Every question from the Telugu Literature Optional papers of UPSC Mains 2021, placed in its syllabus unit and checked against all questions asked from 2013 to 2020. See what was familiar, what came back and what was new.
Other years:
What stood out in 2021
- Every question came from a topic UPSC had asked recently.
Which units got the marks in 2021
Marks asked from each unit in 2021 (dark bar) against its average for 2013–2020 (grey bar).
Paper I
| Unit | 2021 | Average 2013–20 |
|---|---|---|
| విభాగం ఎ: భాష | 200 | 195 |
| విభాగం బి: ప్రాచీన సాహిత్యం | 140 | 134 |
| విభాగం బి: ఆధునిక, జానపద సాహిత్యం | 60 | 66 |
Paper II
| Unit | 2021 | Average 2013–20 |
|---|---|---|
| విభాగం ఎ: ప్రాచీన కావ్యాలు | 200 | 200 |
| విభాగం బి: ఆధునిక సాహిత్యం | 200 | 200 |
A question that fits two units is split equally between them.
Paper I
Q1a. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ద్రావిడ భాషల ప్రత్యేక లక్షణాలను పేర్కొనండి. (10 marks)
Q1b. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: పత్రికా రచనలో తెలుగు భాషా ప్రయోగాలను వివరించండి. (10 marks)
Q1c. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: వృత్తి పదాల ఆధారంగా తెలుగు ప్రాంతాన్ని భాషా మండలాలుగా విభజించిన రీతిని విశదీకరించండి. (10 marks)
Q1d. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ద్రావిడ భాషలలో కనిపించే మనుష్యవాచక సంఖ్యా పదాలను తెలపండి. (10 marks)
Q1e. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: శాస్త్రీయ, సృజనాత్మక రచనల అనువాదంలో ఎదురయ్యే సమస్యలను పరిశీలించండి. (10 marks)
Q2a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: క్రీ.శ. 1100 నుండి క్రీ.శ. 1399 కాలం నాటి ప్రాచీనాంధ్ర శాసనాలలోని తెలుగు భాషా పరిణామాన్ని గమనించండి. (20 marks)
Q2b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాష ఆధునికీకరణలో భాషా, సాహిత్యోద్యమాల పాత్రను నిరూపించండి. (20 marks)
Q2c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: అనువాద పద్ధతులను వివరించి, వాటి ప్రయోజనాలను సంక్షిప్తంగా తెలియజేయండి. (10 marks)
Q3a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు వాక్యం నిర్మాణ క్రమాన్ని వివరించండి. (20 marks)
Q3b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: జయంతి రామయ్య పంతులు, గిడుగు వేంకట రామమూర్తి నడిపిన తెలుగు భాషోద్యమాలను గూర్చి చర్చించండి. (20 marks)
Q3c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాషలో ప్రవేశించిన అన్యదేశ్య పదాలను గుర్తించండి. (10 marks)
Q4a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: మాండలిక భాష ప్రామాణికతను గుర్తించండి. (20 marks)
Q4b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: పదం, పదాంశం, సపదాంశాలను ఉదాహరణ పూర్వకంగా వివరించండి. (20 marks)
Q4c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగులో కర్తరి, కర్మణి వాక్య ప్రయోగాలను సోదాహరణంగా విశదీకరించండి. (10 marks)
Q5a. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ప్రాఙ్నన్నయ యుగంలోని దేశి సాహిత్యాన్ని వివరించండి. (10 marks)
Q5b. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: పాల్కురికి సోమనాథుని బసవపురాణం ప్రాశస్త్యాన్ని తెలియజేయండి. (10 marks)
Q5c. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తోళ్ళపాక అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తనలను పరిశీలించండి. (10 marks)
Q5d. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: వృత్తిజీవన చిత్రణగల కథలను పరిచయం చేయండి. (10 marks)
Q5e. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: స్త్రీవాద రచనలలో శ్రమ దోపిడి నుండి స్త్రీ విముక్తి సాధనను వివేచించండి. (10 marks)
Q6a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: నన్నయ ఆంధ్ర మహాభారత రచనకు గల చారిత్రక, సాహిత్య నేపథ్యాలను వివరించండి. (20 marks)
Q6b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: నవ్యకవిత్వ లక్షణాలను పరిచయం చేయండి. (20 marks)
Q6c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: శ్రీనాథుడు స్కాందపురాణం ఆధారంగా రాసిన రచనలను వివరించండి. (10 marks)
Q7a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఆంధ్ర మహాభారతంలో తిక్కన తీర్చిదిద్దిన రాయబారాలలోని రాజనీతిని వివరించండి. (20 marks)
Q7b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు ప్రబంధాలలోని ప్రకృతి వర్ణనలను విశదీకరించండి. (20 marks)
Q7c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ప్రపంచీకరణ నేపథ్యంలో అంతరించి పోతున్న జానపద కళారూపాలను పేర్కొని, వాటి అస్తిత్వానికి దోహదపడే మార్గాలను సూచించండి. (10 marks)
Q8a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఎర్రన, నాచన సోమనాథుల కవిత్వ తత్త్వాన్ని, తెలుగు సాహిత్యంలో వారికున్న స్థానాన్ని వివేచించండి. (20 marks)
Q8b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: దక్షిణాంధ్రయుగంలో కవయిత్రులు రచనా వైశిష్ట్యాన్ని విశ్లేషించండి. (20 marks)
Q8c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఆధునిక సాహిత్యంలో అభ్యుదయ కవులు తెచ్చిన మార్పులను పరిగణించండి. (10 marks)
Paper II
Q1a. ఈ క్రింది పద్యంలోని వస్తు రసభావశిల్పాలను వ్యాఖ్యానించండి:
ఇదిమునినాథకన్యయనియెంతయునిస్పృహవృత్తినున్ననా
హృదయమురాజపుత్రివనియిక్కమలాక్షినిజాభిజాత్య సం
పదవైఱేఁగించివన్ మదన బాణపరంపర కిప్పుడుండనా
సృదమయి సంచలించెనళిపాతవికంపిత పంకజాకృతిన్ (10 marks)
Q1b. ఈ కింది పద్యంలోని నాటకీయశిల్పాన్ని వివరించండి:
“ద్రోవది బంధురంబయిన క్రొమ్ముడి గ్రమ్మనవిడ్చి వెంద్రుకల్
దావలచేతఁబూని యసితచ్ఛవిఁబొల్చుమహాభుజంగమో
నావిలసిల్లి వ్రేలఁగ మనంబునఁబొంగు విషాదరోషవముల్
గావఁగలేకబాష్పములుఁగ్రమ్మగదిగ్గన వేచి యార్తయై” (10 marks)
Q1c. ఈ కింది పద్యంలోని వ్యక్తమవుతున్న అస్తిత్వ దృక్కోణాన్ని వ్యాఖ్యానించండి:
“అరుణగభస్తి బింబముద యాద్రిపయిం బొడ తేరగిన్నెవోఁ
బెరుగును వంటకంబు వడపిందియలుం గుడువంగఁబెట్టుని
ర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణముతల్లి యున్నదే?
హరహర ! యెవ్వరింకఁగడుపారసి పెట్టెదరొప్పితాన్నముల్” (10 marks)
Q1d. ఈ క్రింది పద్యంలో ప్రస్ఫుటమయ్యే సంభాషణావైచిత్రిని వివరించండి:
“ఇట్టినిరర్థునెందుఁగన, మేమనబోయిన నీవుమిక్కిలిన్
దిట్టెదు, నాదుసంపదకు దిక్కగుచున్ మొగ మొల్క నీకిఁకన్
బుట్టునో యంటిమే, నితని పోడిమిఁగంటిమ ! వట్టిగొడుతా
కట్టితఁడెంతయున్న నినుఁగాఱియ పెట్టుట వెళ్ళఁగొట్టినన్” (10 marks)
Q1e. వర్ణవిన్యాసవక్రతదృష్ట్యా ఈ పద్యాన్ని విశ్లేషించండి:
“రాజులుకాంతియందు, రతిరాజులు రూపమునందు, వాహినీ
రాజులు దానమందు, మృగరాజులు విక్రమ కేళియండుగో
రాజులుభోగమందు, దినరాజులు సంతత తేజమందురా
రాజులు మానమందు నగురమ్మున రాజకుమారు లందఱున్” (10 marks)
Q2a. దుష్యంత చరిత్రలో నన్నయ గారి ప్రసన్నకథాకవితార్థయుక్తిని వివరించండి. (20 marks)
Q2b. గుణనిధికథలో శ్రీనాథుడు ప్రదర్శించిన పద్య నిర్మాణంలో భాగంగా రీతి సౌందర్యాన్ని విశ్లేషించండి. (20 marks)
Q2c. ఆంధ్ర నాయకశతకంలో వ్యాజస్తుతి అలంకార వైభవాన్ని విశదీకరించండి. (10 marks)
Q3a. శ్రీకృష్ణరాయబార ఘట్టంలోని నాటకీయ శిల్పాన్ని వివరించండి. (20 marks)
Q3b. సుగాత్రీశాలీనుల కథలో పింగళి సూరన ప్రదర్శించిన ప్రబంధ వక్రతనువివరించండి. (20 marks)
Q3c. కాసుల పురుషోత్తమ కవికి శతకసాహిత్య రచనా సంవిధానాన్ని, పరిచయం చేయండి. (10 marks)
Q4a. మొల్లరామాయణం బాలకాండలో కనిపించేప్రబంధ లక్షణాలను వివరించండి. (20 marks)
Q4b. దుష్యంతుని ఆస్థానంలోని శకుంతల ప్రసంగం నేటి ఆధునిక స్త్రీకి కలిగించే స్ఫూర్తిని విశ్లేషించండి. (20 marks)
Q4c. శ్రీకృష్ణ రాయబారంలో తిక్కన ప్రతిపాదించిన రాజకీయకోణాన్ని విశదీకరించండి. (10 marks)
Q5a. కాల్పనిక భావావేశంలో కూడిన ఈ పద్యాన్ని రసదృష్ట్యా వ్యాఖ్యానించండి:
ఇమ్ముగకాకుళమ్ముమొదలీ వఱకుంగల యాంధ్ర పూర్వరా
జ్యమ్ముల పేరు చెప్పిన హృదంతరమేవో చలించిపోవునా
ర్ద్రమ్మగు చిత్తవృత్తుల పురాభవ నిర్ణయమేని నెన్నిజ
న్మమ్ములు గాఁగనీతనువునన్ బ్రవహించునో యాంధ్రరక్తముల్ (10 marks)
Q5b. ఈ క్రింది పంక్తులలోని మానవ స్వభావాన్ని వ్యాఖ్యానించండి:
“నిప్పులు చిమ్ముకుంటూ నెత్తురు క్రక్కుకుంటూ
నింగికి నేనెగిరి పోతే నేలకు నేరాలి పోతే
నిబి డాశ్చర్యంతో వీరు – నిర్దాక్షిణ్యంనా వీరే” – (10 marks)
Q5c. ఈ క్రింది పద్యంలో ధ్వనించే జీవన సంవేదనను వ్యాఖ్యానించండి:
ఎంతకోయిల పాట వృధ యయ్యెనోకదా !
చిక్కు చీకటివనసీమలందు
ఎన్నివెన్నెలవాగులింకిపోయెనోకదా !
కటికకొండల మీదమిటకరించి
ఎన్నికస్తురిజింకవీడేరెనోకదా !
మురికితిన్నెలమీద పరిమళించి
ఎన్నిముత్తెపురాలు భిన్నమయ్యె నోకదా !
పండితనవెదురుజొంపములలోన
ఎంతగంధవహనమెంత తంగెటి జున్ను
యెంతరత్నకాంతి యెంతశాంతి
ప్రకృతిగర్భమందు భగ్నమైపోయెనో
పుట్టరాని చోట పుట్టుకతన (10 marks)
Q5d. భావోద్యోగ మాధురీ దృష్టితో ఈ పద్యాన్ని వ్యాఖ్యానించండి:
“తావులతోడ దేనియల ధారల జిప్పిలు వేణుగేతికా
రావముతోడ మందగతులన్ జను మారుతముల్ విశాల బృం
దావన వీధులందుయమునానవ భంగ మృదంగ వాద్యముల్
ప్రోవస్ఫురింపగా వలపు తొందర పెట్టగ బోతినొంటియై” (10 marks)
Q5e. వర్ణనాత్మక దృష్టితో ఈ పంక్తులలో వ్యక్తమౌతున్న వైశిష్ట్యాన్ని తెలుపండి:
“పృథివి నాయమ జఘన పీఠమ్మునంజూచి
జలమామెకంటి పాపల లోతులజూచి
తేజమ్ము నామె ముఖ రాజీవమున గాంచి
వాయుగతినామె నిశ్వాసముల గుర్తించి
ఆకాశమామె మధ్యమునందు గమనించి
నిఖిల సృష్టికి లకుమనే ప్రతీకగనెంచి” – (10 marks)
Q6a. ఆధునిక కథానికకు గురజాడ అప్పారావు చేసిన దోహదాన్ని తెలుపండి. (20 marks)
Q6b. వస్త్వాశయరీతిలో ఆంధ్రాభిమానాన్ని ప్రబోధించిన కావ్యాలలో “ఆంధ్ర ప్రశస్తి” స్థానాన్ని విశదీకరించండి. (20 marks)
Q6c. మధ్యతరగతి భేషజాన్ని ఆత్రేయ యన్.జి.వో నాటకంలో చిత్రించినవైనాన్ని విశ్లేషించండి. (10 marks)
Q7a. కృష్ణశాస్త్రి సహృదయుల హృదయాలలోని మధురవిరహన్ని మేలుకొలిపేతీరును వివరించండి. (20 marks)
Q7b. శ్రీశ్రీ కలగన్న జగన్నాథరథం ఏమిటి? ఆరథం నడిచే మార్గం ఏమిటి? వ్యక్తీకరించండి. (20 marks)
Q7c. “అల్పజీవి” నవలలోని చైతన్య స్రవంతి శిల్పాన్ని విశదీకరించండి. (10 marks)
Q8a. దళిత కవిత్వానికి ‘గబ్బిలం’ – కలిగించిన స్ఫూర్తిని, దాని వైశిష్ట్యాన్ని విశదీకరించండి. (20 marks)
Q8b. లకుమ పాత్రచిత్రణలో నారాయణరెడ్డి చూపిన ప్రతిభావిశేషాన్ని వివరించండి. (20 marks)
Q8c. ఆధునిక సమాజ చరిత్ర నిర్మాణంలో శారద లేఖలు కలిగించే వికాసాన్ని వివరించండి. (10 marks)
Spotted something wrong?
If a question is in the wrong unit or a match looks wrong, please report an error.
Related: Overall Telugu Literature PYQ analysis · Year-wise question papers · Topic-wise PYQs

