Here are all 226 questions on విభాగం బి: ఆధునిక సాహిత్యం asked in UPSC Telugu Literature Optional Paper II (2009–2026), arranged under the 9 topics of this unit. Within each topic the latest questions come first.
Each question ends with a code such as [2024/15m/3b] – the year, the marks, the word limit (where UPSC set one) and the question number in the paper.

2.1] గురజాడ అప్పారావు
19 questions
మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: “గురజాడ కథలు ఆధునిక సమాజ సంస్కరణకు పునాదులు” వివరించండి. [2026/20m/6a]
మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోనూ సమాధానాలు రాయండి: ఆధునిక కథారచనకు ‘గురజాడయే అడుగు జాడ’ అన్న ప్రశంసను ఆణిముత్యాలు ద్వారా నిరూపించండి? [2025/20m/6a]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: “ఆధునిక కథానికా సమున్నత గోపురానికి గురజాడ వారి ఆణిముత్యాలు మూలస్తంభాలు” సమీక్షించండి. [2024/20m/8b]
కింది ప్రశ్నలలో మొదటి రెండింటికి వ్యాసరూప సమాధానములను మూడవ ప్రశ్నకు సంక్షిప్త సమాధానమును రాయండి: గురజాడ తనకథానికల్లో బలంగా నాటిన ఆధునిక పునాదుల్ని విశ్లేషించండి. [2023/20m/6b]
తెలుగు కథాసాహిత్యానికి గురజాడ అప్పారావు వేసిన పునాదిని, పరిపుష్టిని వ్యాఖ్యానించండి. [2022/20m/7a]
ఆధునిక కథానికకు గురజాడ అప్పారావు చేసిన దోహదాన్ని తెలుపండి. [2021/20m/6a]
గురజాడ దృక్పథంలో మహిళ అంటే ఏమిటో నిర్వచించి వారి కథల్లోని మహిళా చైతన్యాన్ని విశ్లేషించండి. [2020/20m/7a]
ఆధునిక సామాజిక కాదర్శాలకు ప్రాతిపదికలుగా గురజాడ కథానికలను పరిశీలించండి. [2019/20m/8b]
ఆధునికతను నిర్వచించి, గురజాడ రచించిన మూడు కథానికలకు అన్వయించండి. [2018/20m/6a]
సంస్కర్త హృదయం, దిద్దుబాటు కథల ఆధారంగా స్త్రీ, పురుష మనస్తత్వాల భేదసాదృశ్యాలను తెలియజేయండి. [2017/10m/6c]
గురజాడ కథానికల్లో స్త్రీ పాత్రల ప్రాధాన్యాన్ని వివరించండి. [2017/10m/8c]
పెద్ద మసీదు కథను వర్తమాన మతభావ సంఘర్షణ నుండి విశ్లేషించండి. [2016/10m/6c]
గురజాడ కథల ద్వారా ఆయన సంస్కరణ దృక్పథాన్ని నిర్ధారించండి. [2016/20m/8b]
మీ పేరేమిటి కథను ఆధారంగా చేసుకొని ఆనాటి మత వైషమ్యాల తీరు తెన్నులను వివరించండి. [2015/20m/6a]
గురజాడ కథల్లోని ఆధునికతను విశ్లేషించండి. [2014/20m/6a]
‘మెటిల్డా’ – ఏ సమస్యను చిత్రీకరిస్తుందో వివరించండి. [2014/10m/6c]
సంప్రదాయ సమాజంలో ఆధునికతను సంతరించుకున్న ఆణిముత్యాలు గురజాడ కథలు – చర్చించండి. [2013/25m/6a]
ఆధునిక సభ్యత, ఆధునిక చింతన ఆధారంగా రూపుదిద్దుకున్న కథలు గురజాడ దిద్దుబాటు, మెటిల్డా, సంస్కర్త హృదయం” – విశ్లేషించండి. [2012/30m/6a]
స్త్రీ పురుష సంబంధాల విషయంలో గురజాడకు గల ఆలోచనలను ఆయన కథానికలలో వ్యక్తమైన రీతిలో వివరించండి. [2011/30m/6a]
2.2] విశ్వనాథ సత్యనారాయణ
30 questions
ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: విశ్వనాథ సత్యనారాయణ తెలెగు తల్లులు తమ పిల్లలకు శౌర్యరసాన్ని ఉగ్గు పాలతో రంగరించి పోసిన తీరును వివరించండి:
వేఁగి రాజ్యపు పల్లె వీధుల చెడుగుళ్ల
రిపులఁ గవ్వించు నేరుపులు తెలిసి
ఎగురు గోడీబిళ్ల సొగసుల్లో రిపుశిర
స్సుల బంతులాడు శిక్షలకు డాసి
చెఱ్ఱాడి యుప్పు తెచ్చిన నాడె శాత్రవ
వ్యూహముల్ పగిలించి నొఱపు గఱచి
కోతి కొమ్మచ్చిలో కోటగోడల కెగఁ
బ్రాకి లంఘించు చంక్రమణ మెఱిఁగి
తెనుఁగు లంతప్పై యవి నేర్చుకొనియయుందు
రెన్నగాఁ దెల్గుతల్లులు మున్ను శౌర్య
రస మొడిచి యుగ్గుబాలతో రంగరించి
బొడ్డుకోయని కూనకే పోయుదురట [2026/10m/5a]మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: ‘ఆంధ్ర ప్రశస్తి’ లోని చారిత్రక, సాంస్కృతికాంశాలను వివరించండి. [2026/20m/7b]
కింది కవితాఖండికలకు సూచించిన విధంగా సమాధానాలు విశ్లేషిస్తు రాయండి: ఈ క్రింది పద్యంలోని వ్యజ్ఞ్య వైభవాన్ని వివరించండి:
అంతలో లోకబాంధవుడస్తమించె
అస్తగిరి గహ్వరాంతర నిత్య స్థితాంధ
కార కృష్ణవర్ణాహిసంచారభయద
మై కకుప్పులు శ్యామలమ్మై తనర్చె [2025/10m/5b]మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోనూ సమాధానాలు రాయండి: ‘ఆంధ్రపశస్తి’లో విశ్వనాథ కవితా వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. [2025/20m/6b]
ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: కింది పద్యంలో వ్యక్తమయ్యే విశ్వనాథ తెలుగు ప్రాంతాభిమానాన్ని విపులీకరించండి:
“మాపూర్వాంధ్ర ధరాధినాయక కథామంజూషికా రత్నగా
థా పద్యావళి పేరి హారి సుమనోదామంబు మాధ్వీక భా
షాపృక్తంబు మహాప్రబంధ రచనా సౌందర్యపున్ వాసనల్
తీపై క్రమ్మగ నాంధ్ర సోదరుల కందిత్తున్ గళాంకమ్ముగన్.” [2024/10m/5b]అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: భారతీయ చక్రవర్తుల ధర్మనిష్ఠా తత్పరతను “మాధవ వర్మ” కవితా ఖండిక ద్వారా కవి ఆవిష్కరించిన తీరును వివరించండి. [2024/20m/6a]
ఈ క్రింది కవితా భాగాలకు అడిగిన రీతిలో 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పద్యంలోని సాంస్కృతిక భావచిత్రాల దృశ్యాలను వివరించండి? అన్మదర్మాతిథౌయారబ్ధములు రెడ్ల
భువి వంటశాలలో బొగలటంచు
అచట శ్రీనాథ కావ్య శ్రోతలగు మాకుఁ
మఱచిన పందిళ్ళ పఱపులంచు
కొండ కొమ్ములఁ దీర్చికొని నిల్చియున్నయాం
ధ్ర భటాళి వీరగంధాలటంచు
ఉత్సవాగత జనమ్మొఱిరిగి పోఁగొండకొ
మ్ములఁ దొంగి కనురెడ యుగుదలనుచు
మున్ను గుట్టాల దూకించు కొన్నచోట
నడు గడుగునందుఁ బాతంబులైన మాకు
నప్పుడప్పుడు తలలెత్తి నంత కొండ
కొసల మబ్బులు పొరపెట్టి విసరులాడు [2023/10m/5c]ఈ క్రింది కవితా భాగాలకు అడిగిన రీతిలో 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పద్యంలోని తెలుగుప్రాంత వైభవంలోని పలుకోణాలను గుర్తించి వివరించండి:
పరదాపద్ధతి మాన్పిరో సిరికిఁగుప్పల్ వోసియంగళ్ల యం
దురుమాణిక్యము లమ్మినారచట మున్నోపక్షిణీ మూరురా
యర గండండు మహీంద్ర వైభవమతో నాంధ్రక్ష్మాతుండలి
న్బరిపాలించిన నాఁటి పెంపును దలంపన్ మేను గంపించెడిన్ [2023/10m/5d]కింది ప్రశ్నలలో మొదటి రెండింటికి వ్యాసరూప సమాధానములను మూడవ ప్రశ్నకు సంక్షిప్త సమాధానమును రాయండి: విశ్వనాథవారు దర్శించిన ఆంధ్రల చారిత్రక ప్రశస్తిని తెలపండి? [2023/10m/6c]
ఈ క్రింది కవిత్వ భాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ పద్యంలోని ఆంధ్రుల వైభవాన్ని తెలపండి:
మృదుల కపోల పత్రముల మీదికి నుబ్బెడు కుండలమ్ములన్
పొదిగిన రత్నదీధితుల మోసులు దాటి ప్రభాత నీరజా
భ్యుదయములైన దివ్య నయనోజ్వల దీప్తులు దాటి శీతరు
గ్వదనము దాటి ధర్మమయొకండు తదాస్యము నందుఁదోచెడిన్. [2022/10m/5e]ప్రాంతీయ చైతన్యం – ప్రాతీయ వైభవం దృష్యా ఆంధ్ర ప్రశస్తి కావ్య ప్రాధాన్యతను చర్చించండి. [2022/15m/7c]
కాల్పనిక భావావేశంలో కూడిన ఈ పద్యాన్ని రసదృష్ట్యా వ్యాఖ్యానించండి:
ఇమ్ముగకాకుళమ్ముమొదలీ వఱకుంగల యాంధ్ర పూర్వరా
జ్యమ్ముల పేరు చెప్పిన హృదంతరమేవో చలించిపోవునా
ర్ద్రమ్మగు చిత్తవృత్తుల పురాభవ నిర్ణయమేని నెన్నిజ
న్మమ్ములు గాఁగనీతనువునన్ బ్రవహించునో యాంధ్రరక్తముల్ [2021/10m/5a]వస్త్వాశయరీతిలో ఆంధ్రాభిమానాన్ని ప్రబోధించిన కావ్యాలలో “ఆంధ్ర ప్రశస్తి” స్థానాన్ని విశదీకరించండి. [2021/20m/6b]
ఈ కింది పద్యంలోని కవిహృదయాన్ని ఆవిష్కరించండి:
శిలవోలెన్ గదలంగ లేక హృదయ స్నిగ్ధార్ద్ర సద్భావనా
ఖిల చైతన్యుడనై పురావిదిత వేంగేపూజ్య సామ్రాజ్య గా
ధల యోజించుచు నాంధ్రపల్లవ నరేంద్ర శ్రీయశస్సుంభమున్
బలె నిల్చుంటిన యీపవిత్ర ధరణీ భగంబునందీ గతిన్ [2020/10m/5e]విశ్వనాథవారు ఆంధ్ర ప్రశస్తిలో ఆంధ్రుల గతవైభవాన్ని స్మరించుకొని నేటి తరాన్ని ఉద్బోధించిన తీరును విశదీకరించండి. [2020/20m/8b]
ఈ పద్యంలో ప్రతిపాదితమైన అర్థాన్ని వివరిస్తూ వర్తమాన సమాజ పరిస్థితులతో సరిపోల్చండి:
నా జాతి పూర్వ ప్రధాజీవరహితమై
శక్తి నాడులయందు చచ్చిపోయి
నా మాతృభూమి తేజోమహశ్చ్యుతిని బ్ర
హ్మక్షత్త్ర తేజంబు మంట గలిపి
నా మాతృభాష నానా దుష్టభాషల
యౌద్ధత్యమును తల నవధరించి
నా తల్లినేల నేనాటి వాచారముల్
పై మెరుంగులు చూచి బ్రమసిపోయి
ఏమి మిగిలిన దీనాటి కిట్లు పొంగు
లొలయు వర్షానదీ గభీరోధకముల
దైన్యగర్భ చారిత్రమల్ దక్క భిన్న
గిరిశిఖర దుర్గ పరిదీన గతి దక్క. [2019/10m/5a]ఆంధ్రుల ఒక నాటి వైభవాన్ని ఆగామి యుగాలకు స్ఫూర్తిదాయకంగా విశ్వనాథ మలిచిన తీరును అభివర్ణించండి. [2019/10m/8c]
ఈ క్రింది పద్యంలోని వర్ణనా నైపుణ్యాన్ని వివరించండి:
గ్రీష్మవేళా నిరాకృతి మేఘగర్భ
ఘూర్ణిత వైఖరీ నేమి నిస్వనములు
చలిత శైలాగ్ర నిర్ఝరిణీవిధా భద్ర
జాత్యశ్వ దివ్య హేషా స్వనములు
కుద్దాల శాతోగ్ర ఖర విఘట్టిత ధరా
చలితోద్ధత పరాగ సంచయములు
ముత్తక్కధ్వాహి[?] సందానత్యశాగ్ర[?] సం
చాలోద్భూత నిస్సానకములు
మెరుపులురుములై వచ్చి నిమేషమంద
దాటిపోయె రాముని స్యందనము కదలి [2018/10m/5a]ఆధునిక కవిత్వంలో ‘ఆంధ్ర ప్రశస్తి’ స్థానాన్ని అంచనా కట్టండి. [2018/20m/6b]
క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది పద్యాన్ని అలంకార రస దృష్టిలో వ్యాఖ్యానించండి.
మృదుల కపోల పత్రముల మీఁదికి నుచ్చెడు కుండలమ్ములన్
పొదిగిన రత్న దీధితులు మోసులు నాటి ప్రభాత నీరజా
భ్యుదయము లైన దివ్యనయనోజ్వల దీప్తులు దాటి శీతరు
గ్వదనముదాటి ధర్మమయొకండు తదాస్యమునందుఁ దోఁచెడిన్. [2017/10m/5a]ఈ క్రింది కవితా భాగాలను సూచించిన విధంగా విశ్లేషించండి: ఈ క్రింది పద్యాన్ని అలంకార రసదృష్టితో వ్యాఖ్యానించండి.
తెనుఁగు పొలాలటేని గదిదేరిన బంటుల కాలిదుమ్ము న
ల్లని పెనుభూతమై గగన లంబినియై పెనుగాలి రేఁగి ముం
దునకు వెలార్చగాఁ బడుటతో నహపానుని రాజ్యలక్ష్మితే
జను దొరఁగెన్ పయిన్ తెనుఁగు శూరులు రాజ్యము చొచ్చినంతలో [2016/10m/5a]క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: “ఆంధ్ర ప్రశస్తి పూర్వాంధ్ర ధరాధి నాయక కథా మంజూషికా రత్నగాథా పద్యావళితో నిండినది.” క్రింది పద్యాన్ని ఆధారంగా చేసుకొని నిరూపించండి.
ఇమ్ముగఁ గాకుళమ్ము మొదలీ వఱకుంగల యాంధ్ర పూర్వరా
జ్యమ్ముల పేరు చెప్పిన హృదంతర మేలొ చలించిపోవు నా
ర్ద్రమ్మగు చిత్త వృత్తుల పురాభవ నిర్ణయమేని నెన్నిజ
న్మమ్ములుగాఁగ నీ తనువునన్ బ్రవహించునొ యాంధ్ర రక్తముల్. [2015/10m/5a]వేంగపుర వైభవాన్ని విశ్వనాథవారు వర్ణించిన విధానాన్ని వివరించండి. [2015/20m/6b]
క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది కవితా పంక్తులను చారిత్రక, కళాత్మక దృష్టితో వివేచించండి.
నిప్పులఁ జూడమన్నీ లుత్కల ప్రౌఢ
పాత్రులు బురుజుల పైని లేరు
ఈటెలఁ గ్రుమ్మ శౌర్యేందిరా పుంమూర్తు
లైన రెడ్డి కోటపైన లేరు
గుండెలు కత్తులఁ గ్రుమ్మరాయల రాచ
యేనిక గున్న లీపైన లే
అడుగడుగునకు బ్రాణమాహుతి గొనగద్యాః
స్థాన రక్షక భటులైన లేరు
ఓసి పాగ మబ్బులార! రండోసి రండు,
మీకు మాకిష్టమే యిష్టమాక లేక
తిరుగవచ్చు రాజులు కొల్వు తీర్చు చోట,
నరుగవచ్చు రాకన్నెలున్నట్టి చోట [2014/10m/5a]క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి:– క్రింది పద్యంలో చారిత్రక, సాంస్కృతిక ఔన్నత్యాన్ని గుర్తించండి:–
ఇంతకుమించి యాపద లిఁకేమని కల్గు, రథంబు చేతఁ ద్రొ
క్కింతురటయ్య భూప్రజల, నెంతగనున్న సిరుల్ భుజింత్రు పా
లింతురు, రాజులైన వదలింతురు, తప్పులు కల్గినన్ విచా
రింతురు కాక, చంపుట సరే ప్రజ నిట్టు లకారణంబుగన్? [2013/10m/5d]క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది కవితా పంక్తులను మనస్తత్త్వ దృష్టితో విశ్లేషించండి:
నా ప్రాణమునకును నీ పొగ మబ్బుల
కేమి సంబంధమో, యేను గూడ
పొగ మబ్బునై కొండచిగురు కోసల పైన
బురుజుల పైనఁ గొమ్మలకుఁబైన
వ్రాలిపోనో, మధ్య వ్రీలిపోనో, నేల
రాలి పోనో, గాలి తేలి పోనో?
నా యూహ చక్రసుందర పరిభ్రమణమై
ఈ పొగ మబ్బులనే వరించె
ఎన్ని పొగ మబ్బు లెఱఁగితే నేను మున్ను
తూర్పు కనుమలు విడుచు నిట్టూర్పు లట్టి
విచటి యీ పొగ మబ్బులే యెడఁదలోని
లలితము మదీయ గీతి నేలా వెలార్చు? [2012/12m/5a]క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది పద్యాన్ని చారిత్రిక దృష్టితో వివరించండి:-
“ఏ రాజు పంచెనో యిచట శౌర్యపు పాయ
సమ్ములు నాగుల చవితి నాళ్ల
యే యెఱ్ఱ సంజలో నెలమి పల్లవరాజ
రమణులు నాళ్లఁబారాణులిడిరో
చిత్రరథస్వామి శ్రీరథోత్సవములోఁ
దెలుగు పిల్లలు కత్తి తిప్పిరెపుడో
ఏ రెండు జాముల యినుని వేడిమి వచ్చి
కలసి పోయెనొ త్రిలింగ ప్రభువుల
నాజగచ్ఛ్రేయసంబులై యలరు తొంటి
వేంగిరాజుల పాదపవిత్ర చిహ్న
గర్భితమ్మైన యీ భూమి ఖండమందు
నశ్రువులు జార్త్రు జీవచ్ఛవాంధ్రజనులు.” [2012/12m/5e]‘ఆంధ్రప్రశస్తి’ ఆధారంగా చరిత్రనుగురించి విశ్వనాథ సత్యనారాయణకు గల దృక్పథాన్ని పరిశీలించండి. [2011/30m/6b]
క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి. చారిత్రక-సామాజిక (Historical and Sociological) దృక్పథంతో విమర్శించండి.
“వేగిరాజ్యపు పల్లెవీథుల జెడుగుళ్ళ
రిపులగవ్వించు నేరుపులు తెలిసి
ఎగురుగోడీబిళ్ళసొగసులోరిపుల శిర
స్సుల బంతులాడుశిక్షలకుడాసి
చెర్రాడి యుప్పు తెచ్చిన నాడె శాత్రవ
వ్యూహముల్ పగిలించునొరవుగరచి
కోతికొమ్మచ్చిలోగోటగోడలకెగ
బ్రాకి లఘించు చంక్రమణమెరిగి
తెనుగు లంతప్టైయవినేర్చుకొనెయ ముందు [?]
రెన్నగాదెల్గు తల్లులుమున్నశౌర్య
రసమొడిచి యుగ్గుపాలతో రంగరించి
బొడ్డు కోయని కూనకే పోయుదురట.” [2010/20m/5a]పూర్వాంధ్రవైభవమునుగూర్చి విశ్వనాథనారి భావనలను ‘వేంగీక్షేత్రము’ ఆధారంగా నిరూపించండి. [2010/60m/7]
2.3] దేవులపల్లి కృష్ణశాస్త్రి
34 questions
ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: ఈ క్రింది గేయంలోని ప్రకృతి స్వభావాన్ని తెల్పి, వాటి సంరక్షణకై మన బాధ్యతలేమిటో వివరించండి:
సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబుపారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?
మావిగున్న కొమ్మను మధుమాసవేళ
పల్లవము మెక్కి కోయిల పాడుటేల?
పరుల తనియించుటకో? తన బాగు కొరకో?
గాన మొనరింపక బ్రతుకు గడవ బోకో? [2026/10m/5b]మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: ‘కృష్ణపక్షం’ లోని కాల్పనిక కవితా తత్వాన్ని (Romanticism) వివరించండి. [2026/10m/8c]
కింది కవితాఖండికలకు సూచించిన విధంగా సమాధానాలు విశ్లేషిస్తు రాయండి: ఈ కవితలోని కవి ఆంతర్యమును విశ్లేషించుము:
అవిరళ స్వేచ్ఛ వెన్కముందరయఁబోక
వారిదమ్ములు చిత్ర కాశ్మీర రుచులఁ
బూని విహరించుఁబశ్చిమ భూధరమున
రజని రానున్న దంచుఁదెల్పంగ రాదె [2025/10m/5a]మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: కృష్ణ పక్షంలోని ఆత్మాశ్రయ ప్రణయ తత్వాన్ని వివరించండి. [2025/10m/8c]
ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: ఈ కింది కవితలోని కవిస్వేచ్ఛా ప్రియత్వాన్ని ప్రకృతి తాదాత్మ్యకతను విశదీకరించండి:
“అలరు పడంతె జక్కిలిగింత వేట్టి
విరిచేడె పులకింప సరసను బాడి
మరి యొక్క ననతోడ మంతనంబాడి
వేరొక్క సుమ కాంత వ్రీడ బోగొట్టి
క్రొందేనె సోనల గ్రోలిసోలుటకు
పూవుపూవునకు పోవుచు మందు
నవ్విపోదురు గాకనాకేటిసిగ్గు
పక్షినయ్యెద చిన్నిఋక్షనుయ్యెదను
మధుపనుయ్యెద వింతమెరపునయ్యెదను
పాటనయ్యెద కొండవాగు నయ్యెదను” [2024/10m/5e]ఈ క్రింది కవితా భాగాలకు అడిగిన రీతిలో 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: తానే ప్రకృతిగా ప్రకృతేతానుగా తాదాత్మ్యం చెంది రచన చేసిన కవి తాత్త్వికతను ఆవిష్కరించండి:
పక్షినయ్యెదఁ జిన్నిఋక్షమయ్యెదను
మధువ మయ్యెదఁ జంద మామ నయ్యెదను
మేఘ మయ్యెదఁ వింతమెఱపు నయ్యెదను
అలరు నయ్యెదఁ జిగురాకు నయ్యెదను
పాట నయ్యెదఁ గొండవాగు నయ్యెదను
పవన మయ్యెదఁ వార్థిభంగ మయ్యెదను
ఏలోకో మెప్పుడో మెటులనో గాని
మాయ మయ్యెద నేను మాఱిపోయెదను [2023/10m/5a]కృష్ణశాస్త్రి ఆత్మాశ్రయ ఆంతర్యాన్ని భావ కవిత్వ లక్షణాలతో సమన్వయించండి? [2023/20m/8a]
ఈ క్రింది కవిత్వ భాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ భావకవిత్వంలో తాత్వికతను తెలపండి:
అవిరళ స్వేచ్ఛా వెన్కముందరయ బోక
వారిదమ్ములు చిత్ర కాశ్మీర రుచుల
బూని వివారించు పశ్చిమ భూధరమున:
రజని రానున్న దంచు తెల్పంగ రాదె? [2022/10m/5a]‘కృష్ణ పక్షం’ కావ్యంలో వ్యక్తమైన స్వేచ్ఛా ప్రతిపాదనలను భావకవితా లక్షణాలతో సమన్వయం చేయండి. [2022/15m/7b]
భావోద్యోగ మాధురీ దృష్టితో ఈ పద్యాన్ని వ్యాఖ్యానించండి:
“తావులతోడ దేనియల ధారల జిప్పిలు వేణుగేతికా
రావముతోడ మందగతులన్ జను మారుతముల్ విశాల బృం
దావన వీధులందుయమునానవ భంగ మృదంగ వాద్యముల్
ప్రోవస్ఫురింపగా వలపు తొందర పెట్టగ బోతినొంటియై” [2021/10m/5d]కృష్ణశాస్త్రి సహృదయుల హృదయాలలోని మధురవిరహన్ని మేలుకొలిపేతీరును వివరించండి. [2021/20m/7a]
ఈ కింది పద్యంలోని భావాన్ని భావకవితా లక్షణాలతో సమన్వయించండి:
మీరు మనసారగా నేడ్వనీరు నన్ను
నమ్మ విడువుడు ! ఒక్కసారినన్నువిడిచి
నంత నేకాంతయవనికా భ్యంతరమున
వెక్కివెక్కి రోదింతును, వెసువు లేక
విరతిలేక దుర్బరశోక విషమగతు
లేడ్చివైతు, ఎలుగెత్తి యేడ్చి వైతు
ఈమహాదానంద వీచికాస్తోను డోలి
కాగ్రములనింక నేనాట్యమాడలేను [2020/10m/5b]“కృష్ణ పక్షం కరుణ రసాత్మకమైన కావ్యం” అని చెప్పే విమర్శనాభిప్రాయాన్ని సమీక్షించండి. [2020/10m/6c]
భావకవిత్వంలోని శాఖలను నిర్వచించి ఈ క్రింది దృశ్యీకరణతో లక్షణ సమన్వయం చేయండి:
ప్రాజ్య పీఠపురీ మహారాజ్య భాగ్య
లక్ష్మి కొలువు దీర్చు చిరత్న రత్న ఖచిత
భాసమాన కల్యాణ సింహాసనమ్ము;
అది వెలమ శౌర్యమూర్తి రణావనీ వి
హార విక్రమ కేళికానంతరమ్ము
శాంతి నుండు విలాస విశ్రామవేది;
అది సభాసీన సకల బుధావతంస
ఘన కవీశాన విజ్ఞాన కాంతి మత్ప్ర
సన్న వీక్షణ స్నాపిత స్వర్ణపీఠి;
అది మహీపతి రామరాయావనీంద్ర
కరకమల వీజ్యమాన చామర సమీర
పులకిత భవన్మృదుశరీర భూషితంబు. [2019/10m/5b]‘కృష్ణపక్షము’ లోని ఆత్మా శ్రయ కవితారీతుల స్వరూప స్వభావాలను విశదీకరించండి. [2019/20m/8a]
ఈ క్రింది కవితా ఖండికలను నవ కవితా లక్షణాలతో సమన్వయం చేయండి:
తిమిరవతి తారకా కుసుమముల దాల్చి
కర్కశ శిలయు నవజీవ కళలదేర
మ్రోడు మోక చివురులెత్తి మురువుచూపు
జగమునిండ స్వేచ్ఛాగాన ఝురుల నింతు
క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య
శృంఖలములు తమంతనె చెదరిపోవ
గగనతలము మార్మ్రోగగ కంఠమెత్తి
జగము నిండ స్వేచ్ఛాగాన ఝురులనింతు
చిత్రమానంద మరీచికల సోల
హృదయమానంద భంగ మాలికల దేల
కనుల నానంద జనితాశ్రు కణములూర
జగము నిండ స్వేచ్ఛాగాన ఝురుల నింతు
యుగయుగంబుల నీశ్వర యోధులగుచు
స్వేచ్ఛకై ప్రాణ సుమములర్పించు వారి
అమల జీవిత ఫలము ధన్యతను గాంచ
జగము నిండ స్వేచ్ఛాగాన ఝురుల నింతు [2018/10m/5b]‘భావ కవితా ప్రవర్తకుడి’గా కృష్ణశాస్త్రిని సమీక్షించండి. [2018/20m/7b]
క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది కవితా పంక్తులను సౌందర్య కళా దృష్టితో వివేచించండి.
ఎట్టులది దాపురించెనో యేమొ యంత
నాకు సంనుల త్రోవల నల్ల దిగియె
నొక్క క్రూరార్క కిరణమ్ము, ఉద్వివాలి
నాగులాబి సోలి తూలి నన్ను వీడె
అప్పడు నావైపు చూచినాయలరు లేని
శూన్యమౌ మ్రోడు మ్రాకును జూచి, యొక్క
కోకిలమ్మకోయని యేడ్చెగొంతు నెత్తి !
మా కొరకు దారి బోయెడు మండపవను
డొకడు జాలిగనొక్క నిట్టూర్పు విసరె ! [2017/10m/5d]దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన ‘కృష్ణపక్షం’లో భావకవిత్వ తత్వాన్ని శాఖలను విశ్లేషించండి. [2017/20m/7b]
ఈ క్రింది కవితా భాగాలను సూచించిన విధంగా విశ్లేషించండి: క్రింది పద్యంలోని భావనాసౌందర్యాన్ని వివరించండి.
ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల
బడి పోవు విరికన్నె వలపువోలె
తీయని మల్లెపూదేనె సోనలపైని
తూగాడు తలిరాకు దోనెవలె
తొలి ప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై
పరువెత్తు కోయిల పాటవోలె
వెల్లువవై పారు వెలది వెన్నెలలోన
మునిగిపోయిన మబ్బుతునుకవోలె
చిరుత తొలకరి వానగా చిన్నిసోనగ
పొంగి పొరలెడు కాల్వగా నింగికెగయు
కడలిగా పిల్లనగ్రోవిని వెడలు వింత
తీయదనమల లీనమై పోయె నెడద. [2016/10m/5d]దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వంలో స్వేచ్ఛాభావన గురించి వ్రాయండి. [2016/10m/7c]
క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది కవితా పంక్తులను సౌందర్య కళా దృష్టితో వివేచించండి.
నవ్వపోదురు గాక నా కేటి సిగ్గు?
నా యిచ్చయే గాక నా కేటి వెరపు?
కల విహంగమ పక్షముల దేలియాడి
తారకామణులలో తారనై మెరసి
మాయ మయ్యెదను నా మధురగానమున!
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు?
మొయిలు దోనెలలోన పయనం బొనర్చి
మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి
పాడుచు చిన్కునై పడిపోదు నిలకు
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు?
తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ
జతగూడి దోబూచి సరసాల నాడి
దిగిరాను దిగిరాను దివి నుండి భువికి
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు? [2015/10m/5d]‘కృష్ణ పక్షం’ ఆధునిక కవిత్వావిష్కారానికి ఎంతవరకు కారణమవుతుందో వివరించండి. [2015/20m/7b]
క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది కవితా పంక్తులను బట్టి కవి కవితా ధోరణిని విశ్లేషించండి:
సౌరభము లేల చిమ్ముపుష్పవ్రజంబు?
చంద్రికల నేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల వినరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?
మావిగున్న కొమ్మను మధుమాస వేళ
పల్లవము మెక్కి కోయిల పాడుటేల?
పరుల తనియించుటకొ? తన బాగు కొరకొ?
గాన మొనరింప బ్రతుకు గడపబోకొ? [2014/10m/5b]భావకవిత్వానికి లక్ష్యప్రాయమైన రచన – కృష్ణపక్షం అన్న వాదనను సమీక్షించండి. [2014/20m/7a]
భావకవితా ధోరణులను కృష్ణపక్ష మాధారంగా వివరించండి. [2014/10m/7c]
క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి:– క్రింది కవితా పంక్తులను మనస్తత్వ దృష్టితో పరిశీలించండి:–
నవవికస్వర దివ్య సౌందర్యమూర్తి
విశ్వసుందరి పరమ పవిత్రమూర్తి
యుదయలక్ష్మి యవతరించె; నెదురుపోయి
స్వాగతం బిమ్ము గీతికా ప్రసవ మొసఁగి
అవిరళ స్వేచ్ఛ వెన్కముందరయ బోక
వారిదమ్ములు చిత్ర కాశ్మీర రుచులఁ
బూని విహరించు బశ్చిమ భూధరమున:
రజని రానున్నదంచుఁ దెల్పంగ రాదె?
శ్యామలాంబర పరిణాహ సరసిలోనఁ
బ్రణయలీలా విహార విలాసినులగు
తారకలఁ గాంచుమా! నీ హృదయమునందు
భావ నక్షత్ర కాంతులు పర్వునేమె! [2013/10m/5a]కృష్ణపక్షంలో విషాద సౌందర్య నైరాశ్యాల అన్వేషణను పరిశీలించండి. [2013/25m/7b]
“అగాధమైన అంతర్ముఖత్వం, అనుభూతి గాఢత, ఉదాత్త భావ సౌకుమార్యం, అక్షర రమ్యత, చక్కని పదచిత్రాల కూర్పు కృష్ణ పక్షంలోని విశిష్టగుణాలు”- వివరించండి. [2012/30m/6b]
క్రింది కవితా భాఘాలను సూచించినరీతిలో విశ్లేషించండి: క్రింది కవితా పంక్తులను మనస్తత్త్వ దృష్టితో పరిశీలించండి:
స్వచ్ఛమైనట్టి ప్రణయంపు సలిలధార
పోసిపెంచిన స్నేహంపు పూలదీవ
తావులను జిమ్మునలరుల దాల్పకుండ
గాలితాకున నేలపై వ్రాలెనకట
సంజవేళల పవడంపు చాయలటుల
చిరుతప్రాయంపు కోరికల్ చెదిరిపోయె,
పర్వత శ్రేణి నిర్ఝర పంక్తులట్లు
ఆశయములెల్ల నడుగంటి యంతరించె
మత్తిలిన యొక్క చంచల మధుపమునకు
కోలుపోయితి మకరంద జాలమెల్ల
ఇంతలో వీచియెచటికోయెగిరిపోవు
మారుతముతోడ వలపులు మాయమయ్యె [2011/20m/5a]కృష్ణపక్షంలో ఆత్మా శ్రయ లక్షణానికి గల భావభూమికను ప్రస్తావించండి. [2011/30m/7b]
‘భావకవిత్వ ఉద్యమానికి ఆద్యుడు కృష్ణ శాస్త్రి’ ‘కృష్ణపక్షం’ ఆధారంగా వివరించండి. [2010/60m/6]
క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి:- కళా సౌందర్య (Aesthetic) దృక్పథంతో విమర్శించండి:-
సౌరభము లేల చిమ్ము పుష్పవ్రజమ్ము?
చంద్రికల నేల విరజిమ్ము చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?
మావి గున్న కొమ్మను మధుమాస వేళ?
పల్లవము మెక్కి కోయిల పాడుటేల?
పరుల తనియించుటకొ? తన బాగు కొరకొ?
గాన మొనరించక బ్రతుకు గడవబోకొ? [2009/20m/5a]కృష్ణపక్షం ఆధారంగా దేవులపల్లివారిని భావ కవిత్వోద్యమానికి సారథిగా నిరూపించండి. [2009/60m/8]
2.4] శ్రీశ్రీ
31 questions
ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: ఈ గేయం ద్వారా శ్రీశ్రీ యువత సోమరితనాన్ని పటాపంచలు చేసిన తీరును తెల్పండి:
పదండి ముందుకు !
పందండి త్రోసుకు !
పోదాం, పోదాం, పైపైకి !
ఎముకలు క్రుళ్ళిన,
వయస్సు మళ్ళిన
సోమరులారా ! చావండి !
నెత్తురు మండే,
శక్తులు నిండే,
సైనికులారా ! రారండి ! [2026/10m/5c]మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: ‘మహా ప్రస్థానం’ యువ చైతన్యానికి మార్గదర్శి ఎట్లో విపులీకరించండి. [2026/10m/6c]
కింది కవితాఖండికలకు సూచించిన విధంగా సమాధానాలు విశ్లేషిస్తు రాయండి: ఈ కవితాఖండికలోని సామజికాంశాన్ని విశ్లేషించండి:
మీకన్నుల చూపులు సరళరేఖలో / రేఖచెదిరితేగొల్లుమనిపోతారు
రేఖ కవతలివారంతా నేరగాళ్లు / రేఖను రక్షించడానికే
న్యాయస్థానాలు, రక్షక భటవర్గాలు, / చెరసాలలు, ఉరికొయ్యలు.
రేఖను కాపాడక తీరదు. [2025/10m/5c]మొదటి మూడు ప్రశ్నాలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: శ్రీ శ్రీ ప్రాచీన వస్తువులను అభ్యుదయ కవితా ప్రతీకలుగా వినియోగించిన విధానాన్ని విశ్లేషించండి. [2025/20m/7a]
ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: ఈ కింది కవిత ద్వారా చారిత్రిక అధ్యయనానికి సంబంధించి శ్రీశ్రీ పేర్కొన్న భావాలను ఆవిష్కరించండి:
“నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరా హరణోద్యోగం
నరజాతి చరిత్ర సమస్తం
రణరక్త ప్రవాహ సిక్తం
బీభత్సరస ప్రధానం
పిశాచగణ సమవాకారం
నరజాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకు తినడు.” [2024/10m/5c]అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: “క్లేసిజంతో బాటు జాతీయ దురహంకారం కూడా అభ్యుదయ నిరోధకమైనదే” అని చెప్పిన శ్రీశ్రీమాటల్లోని ఔచిత్యానేచిత్యాలను చర్చించండి. [2024/20m/6b]
ఈ క్రింది కవితా భాగాలకు అడిగిన రీతిలో 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కవిదర్శించిన ‘నేటి ఆవేదన–రేపటి సాభాగ్య’ వ్యవస్థలను పరిచయం చేయండి:
కావున – లోకపు టన్యాయాలూ
కాల్చే ఆకలి, కూల్చేవేదన,
దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ
పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ, పాటలువ్రాస్తూ
నాలో కదిలే నవ్య కవిత్వం
కార్మిక లోకపు కల్యాణానికి,
శ్రామిక లోకపు సాభాగ్యానికి
సమర్పణంగా, సమర్చనంగా [2023/10m/5b]మార్క్సిజం దృక్పథానికి అభ్యుదయ మార్గం: మహాప్రస్థానం – చర్చించండి. [2023/20m/7a]
‘మహాప్రస్థానం’ కావ్యంలో అభ్యుదయ దృక్పథాన్ని ప్రతిఫలింపచేయటానికి శ్రీశ్రీ చేసిన ప్రయోగాలను వివరించండి. [2022/15m/8c]
ఈ క్రింది పంక్తులలోని మానవ స్వభావాన్ని వ్యాఖ్యానించండి:
“నిప్పులు చిమ్ముకుంటూ నెత్తురు క్రక్కుకుంటూ
నింగికి నేనెగిరి పోతే నేలకు నేరాలి పోతే
నిబి డాశ్చర్యంతో వీరు – నిర్దాక్షిణ్యంనా వీరే” – [2021/10m/5b]శ్రీశ్రీ కలగన్న జగన్నాథరథం ఏమిటి? ఆరథం నడిచే మార్గం ఏమిటి? వ్యక్తీకరించండి. [2021/20m/7b]
ఈ కింది గేయంలోని మార్క్సిస్టు దృక్పధాన్ని సమీక్షించండి:
పదండిముందుకు ! పదండి త్రోసుకు !
మరో ప్రపంచపు కంచు నగారా
విరామ మెరుగక మ్రోగింది !
త్రాచులవలెనూ, రేచులవలెనూ
ధనంజయునిలా సాగండీ !
కనబడ లేదా మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధగ ధగలు,
ఎర్ర బావుటా నిగనిగలు,
హోమ జ్వాలల భుగభుగలు [2020/10m/5c]మహా ప్రస్థానంలోని పురాణ ప్రతీకలను పేర్కొని శ్రీశ్రీ వాటిని వర్తమాన సమాజానికి ఏవిధంగా అన్వయించాడో వివరించండి. [2020/20m/7b]
ఈ గేయంలో కవి యెన్నుకొన్న అభ్యుదయ కవితా ప్రతీకల ఔచిత్యాన్ని వివరించండి:
సిందూరం, రక్తచందనం
బంధూకం, సంధ్యారాగం
పులి చంపిన లేడి నెత్తురూ,
ఎగరేసిన ఎర్రని జెండా,
రుద్రాలిక నయన జ్వాలిక,
కలకత్తా కాళిక నాలిక
కావాలోయ్ నవకవనానికి.
రాబందుల రెక్కల చప్పుడు
పొగగొట్టపు భూంకారధ్వని,
అరణ్యమున హరీంద్ర గర్జన
పయోధర ప్రచండ ఘోషం
ఖడ్గ మృగోదగ్ర విరావం,
ఝంఝానిల షడ్జధ్వానం
కావాలోయ్ నవకవనానికి. [2019/10m/5d]తెలుగులో అభ్యుదయ సాహిత్య వికాసానికి ‘మహాప్రస్థానం’ మార్గదర్శితను నిరూపించండి. [2019/20m/6b]
ఈ క్రింది ఋక్కులను సామాజిక దృష్టితో వ్యాఖ్యానించండి:
కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా–
హీనంగా చూడకు దేన్ని
కవితామయమేనోయ్ అన్నీ!
రొట్టెముక్కా, అరటితొక్కా, బల్లచెక్కా–
నీవేపే చూస్తూ ఉంటాయ్
తమ లోతు కనుక్కోమంటాయ్!
తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం –
కాదేదీ కవిత కనర్హం
ఔనౌను శిల్ప మనర్ఘం!
ఉండాలోయ్ కవితావేశం
కానీవోయ్ రస నిర్దేశం
దొరకదటోయ్ శోభాలేశం!
కళ్ళంటూ ఉంటేచూసీ,
వాక్కుంటేవ్రాసీ!
ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరని దాహం [2018/10m/5c]తెలుగు సాహిత్యంలో ‘మహాప్రస్థానం’ సృష్టించిన ప్రకంపనలను విశ్లేషించండి. [2018/20m/7a]
క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది కవితా భాగంలో చారిత్రక దృక్పథాన్ని పరిశీలించండి:
ఈ మెగిరిన ఇనుపడేగ,
ఈ పండిన పంట నుంట,
ద్రోహాలను తూలగోట్టి,
దోషాలను తుడిచి పెట్టి,
స్వాతంత్ర్యం, సమభావం,
సౌభ్రాత్రం సౌహార్దం
పునాదులై ఇళ్ళు లేచి,
జనావళికి శుభం పూచి –
శాంతి, శాంతి, కాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది, ఈ స్వప్నం నిజమవుతుంది !
ఈ స్వర్గం ఋజు వవుతుంది ! [2017/10m/5b]శ్రీ శ్రీ భావకవితా దృక్పథాన్ని వివరించండి. [2017/20m/6a]
ఈ క్రింది కవితా భాగాలను సూచించిన విధంగా విశ్లేషించండి: గతితార్కిక చారిత్రక ద్రక్పథం నుండి ఈ క్రింది కవితా భాగాలను వ్యాఖ్యానించండి:
ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరాహరణోద్యోగం:
నరజాతి చరిత్ర సమస్తం
రణరక్త ప్రవాహ సిక్తం.
భీభత్సర సప్రధానం
పిశాచగణ సమవాకారం!
నరజాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకు తినడం.
బలవంతులు దుర్బల జాతిని
బానిసలను కావించారు
నర హంతలు ధరాధిపతులై
చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి.
రణరంగంకాని చోటు భూ
స్థలమంతా వెదకిన దొరకదు
గతమంతా తడిసె రక్తమున
కాకుంటే కన్నీళులతో. [2016/10m/5b]నవకవిత, ఋక్కులు, కవితా ఓ కవితా, ప్రతిజ్ఞ కవితలు ఆధారంగా శ్రీ శ్రీ కవిత్వ దృక్పథాన్ని వివరించండి. [2016/20m/6a]
క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది కవితా పంక్తులలో కనిపించే ప్రతీకాత్మకతను వ్యాఖ్యానించండి:
నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వసృష్టికి
అశ్రు వొక్కటి ధార పోశాను!
నేను సైతం
భువన ఘోషకు
వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను! [2015/10m/5b]‘శ్రీ శ్రీ అందరి బాధనూ తనలో పలికిస్తాడు’ అనుశీలించండి. [2015/20m/7a]
క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది కవితా పంక్తుల్లోని అంతరార్థాన్ని అభ్యుదయ సాహిత్య దృష్టితో వివరించండి:
కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుచిల్లా
హీనంగా చూడకుదేన్నీ
కవితామయమేనోయ్ అన్నీ!
రొట్టెముక్కా, అరటితొక్కా, బల్లచెక్కా
నీ వైపే చూస్తూ ఉంటాయ్
తమ లోతు కనుక్కోమంటాయ్!
తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం
కాదేదీ కవితకనర్హం
ఔనౌను శిల్పమనర్ఘం!
ఉండాలోయ్ కవితావేశం!
కానీవోయ్ రస నిర్దేశం!
దొరకదటోయ్ శోభాలేశం!
కళ్ళంటూ ఉంటే చూసి,
వాక్కుంటే వ్రాసీ!
ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరని దాహం [2014/10m/5c]మహాప్రస్థానంలోని శ్రామికవర్గ దృక్పథాన్ని వివరించండి. [2014/20m/7b]
క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి:– క్రింది కవితా పంక్తులలో కనిపించే ప్రతీకాత్మకతను వ్యాఖ్యానించండి:–
పతితులార!
భ్రష్టులార!
దగాపడిన తమ్ములార!
మీకోసం కలం పట్టి,
ఆకాశపు దారులంట
అడావుడిగ వెళిపోయే,
అరుచుకుంటు వెళిపోయే
జగన్నాథుని రథచక్రాల్,
రథ చక్ర ప్రళయ ఘోష
భూమార్గం పట్టిస్తాను!
భూకంపం పుట్టిస్తాను!
నట ధూర్జటి
నిటాలాక్షి పగిలిందట!
నిటాలాగ్ని రగిలిందట!
నిటాలాగ్ని!
నిటాలార్చి!
నిటాలాక్షి పటాలుమని
ప్రపంచాన్ని భయపెట్టింది! [2013/10m/5c]శ్రీశ్రీ ఆశించిన సమాజాన్ని కవితల ఆధారంగా చిత్రీకరించండి. [2013/25m/7a]
క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది కవితను సామాజిక దృష్టితో వ్యాఖ్యానించండి:-
దారి పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన
కూర్చున్నది ముసిల్దొకతె
మూలుగుతూ, ముసురుతున్న ఈగలతో వేగ లేక
ముగ్గు బుట్టవంటి తలా, ముడుతలు తేరిన దేహం
కాంతిలేని గాజు కళ్లు – తన కన్నా శవం నయం
పడిపోయెను జబ్బు చేసి, అడుక్కొనే శక్తి లేదు
రానున్నది చలికాలం, దిక్కులేని దీనురాలు
ఏళ్లు ముదిరి, కీళ్లు కదిలి, బతుకంటే కోర్కెసడలి.
పక్కనున్న బండరాతి పగిదిగనే పడి ఉన్నది
“ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరి” దని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళిపోయింది?
ఎముక ముక్క కోరుక్కొంటు ఏమీ అనలేదు కుక్క
ఒక ఈగను పడవేసుక తొందరగా తొలగె తొండ
క్రమ్మె చిమ్మ చీకట్లూ, దుమ్ము రేగె సంతలోన
ఇది నా పాపం కాదనె ఎగిరి వచ్చి ఎంగిలాకు. [2012/12m/5b]కవిత్వం గురించి రాసిన కవితల ద్వారా శ్రీశ్రీ ఆవిష్కరించిన నవ్యకవిత్వ స్వరూపాన్ని ప్రపంచించండి. [2011/30m/7a]
క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి. మనస్తత్వానుగుణ (Psychological) దృక్పథంతో విమర్శించండి:
గగనమంతానిండి
పొగ లాగుక్రమ్మి-
బహుళపంచమిజ్యోత్స్న
భయపెట్టునన్ను !
ఆకాశపు టెడారి
నంతటా, అకట !
ఈరేయి రేగింది
ఇసుక తుఫాను !
గాలిలోకనరాని
గడుసుదయ్యాలు
భూ దివమ్ముల మధ్య
ఈదు తున్నాయి !
నోరెత్తి, హోరెత్తి
నొగులు సాగరము !
కరికళేబరములా
కదలదు కొండ !
ఆకాశపు టెడారి
లోకాళ్ళుతెగిన
ఒంటరిఒంటెలా
గుంది జాబిల్లి !
విశ్వమంతానిండి,
వెలిబ్బూదివలె –
బహుళ పంచమిజ్యోత్స్న
భయపెట్టునన్ను ! [2010/20m/5c]క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి:- సైద్ధాంతిక (Ideological) దృక్పథంతో విమర్శించండి:-
కావున లోకపుట న్యాయాలూ
కాల్చే ఆకలి, కూల్చే వేదన,
దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ
పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ
పాటలు వ్రాస్తూ
నాలో కదిలే నవ్య కవిత్వం
కార్మిక లోకపు కల్యాణానికి
శ్రామిక లోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా, సమర్చనంగా
త్రికాలాలలో, త్రిలోకాలలో
శ్రమైకజీవన సౌందర్యానికి
సమానమైనది లేనే లేదని
కష్టజీవులకు, కర్మవీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ
స్వస్తి వాక్యములు సంధానిస్తూ
స్వర్ణవాద్యములు సంరావిస్తూ
వ్యథార్త జీవిత యధార్థ దృశ్యం
పునాదిగా ఇక జనించబోయే
భావి వేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్! [2009/20m/5c]
2.5] జాషువా
30 questions
ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: ఈ పద్యంలో జాషువా లోకం పోకడను గూర్చి వాపోయిన విధానాన్ని విశదీకరించండి:
ప్రతిమల పెండ్లిసేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుః
ఖిత మతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్పదీ భరతమేదిని ముప్పది మూడు కోట్లదే
వత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తు లాఱునే [2026/10m/5d]మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: ‘గబ్బిలం’ లోని జాషువా ఆవేదనను వ్యక్తీకరించండి. [2026/10m/7c]
కింది కవితాఖండికలకు సూచించిన విధంగా సమాధానాలు విశ్లేషిస్తు రాయండి: ఈ పద్యములోని కవి ఆంతర్యాన్ని వివరించండి:
హృదయములేని లోకము సుమీయిది మాపుల పశ్చిమంబుగా
ను దయముతూర్పుగా నడచుచుండు సనాతన ధర్మ ధేనువుల్
పిదికిన పాలుపేదకు లభింపవు శ్రీగలవానియాజ్ఞలోఁ
బెదవిఁగదల్పఁజాల రరవింద భవప్రముఖామృతాంధసుల్. [2025/10m/5d]మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోనూ సమాధానాలు రాయండి: జాషువా గబ్బిలంతో పలికిన మాటలలో స్పృశించిన ప్రదేశాల, వ్యక్తుల విశేషాలను వివరించండి. [2025/10m/6c]
ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: ఈ కింది పద్యంలో సమకాలీన వ్యక్తుల దురన్యాయాలను కవి ఏవిధంగా చిత్రీకరించాడు:
“పదవుల పీట లెక్కి యనువారము లంచపు బాడి బర్రెలం
బిదికి గడించి కార్మికుల పేదల చెమ్మట దెచ్చి కాన్కలి
చ్చెదరు పరోపజీవులు విచిత్రపు భక్తులు వేషధార్లు నీ
కెదురయి వచ్చిరే వలదిసీ చెయిచాచకుమమ్మ పక్షిణీ !” [2024/10m/5a]అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: “జాషువాగారి ‘గబ్బిలం’ కావ్యం ప్రతీతాత్మక కావ్యం” – సమీక్షించండి. [2024/20m/7a]
కింది ప్రశ్నలలో మొదటి రెండింటికి వ్యాసరూప సమాధానములను మూడవ ప్రశ్నకు సంక్షిప్త సమాధానమును రాయండి: దళిత సంఘటిత శక్తికి మూలం: గబ్బిలం – చర్చించండి? [2023/20m/6a]
ఈ క్రింది కవిత్వ భాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ పద్యంలోని దళిత ఆత్మగౌరవ ప్రదర్శనను వివరించండి:
వాని ఱెక్కల కష్టంబు లేని నాడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చమటలోడ్చి ప్రపంచమునకు
భోజనముఁబెట్టు వానికి భుక్తిలేదు. [2022/10m/5d]నేటి ప్రాసంగికతను ‘గబ్బిలం’ కావ్యం ద్వారా అంచనా వేయండి. [2022/20m/6a]
ఈ క్రింది పద్యంలో ధ్వనించే జీవన సంవేదనను వ్యాఖ్యానించండి:
ఎంతకోయిల పాట వృధ యయ్యెనోకదా !
చిక్కు చీకటివనసీమలందు
ఎన్నివెన్నెలవాగులింకిపోయెనోకదా !
కటికకొండల మీదమిటకరించి
ఎన్నికస్తురిజింకవీడేరెనోకదా !
మురికితిన్నెలమీద పరిమళించి
ఎన్నిముత్తెపురాలు భిన్నమయ్యె నోకదా !
పండితనవెదురుజొంపములలోన
ఎంతగంధవహనమెంత తంగెటి జున్ను
యెంతరత్నకాంతి యెంతశాంతి
ప్రకృతిగర్భమందు భగ్నమైపోయెనో
పుట్టరాని చోట పుట్టుకతన [2021/10m/5c]దళిత కవిత్వానికి ‘గబ్బిలం’ – కలిగించిన స్ఫూర్తిని, దాని వైశిష్ట్యాన్ని విశదీకరించండి. [2021/20m/8a]
ఈ కింది పద్యంలో కవి ఆవిష్కరించిన వ్యంగ్యార్థ రసభావతీవ్రతను వివరించండి:
హృదయము తేని లోకము సుమీయిది మాపుల బశ్చిమంబుగా
నుదయము తూర్పుగా నడుచు చుండు సనాతన ధర్మ ధేనువుల్
పిదికిన పాలు పేదకు లభింపవు శ్రీగలవారి యాజ్ఞలోఁ
బెదవి గదల్ప జాల రరవింద భావ ప్రముఖామృతాం ధముల్ [2020/10m/5a]గబ్బిలం కావ్యం రచించడానికి జాషువా గారిని ప్రేరీపించిన అంశాలను పేర్కొని తెలుగు సాహిత్యంలో గబ్బిలం వైశిష్ట్యాన్ని విశదీకరించండి. [2020/20m/8a]
ఈ క్రింది పద్యయుగళంలో నిక్షిప్తమైన దళిత జీవిత సందేశాన్ని, శబ్దసంయోజనలో కవి తత్త్వదృష్టిని పరిశీలించండి:
కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి
స్వార్థలోలురు నా భుక్తి ననుభవింత్రు
కర్మ మననేమొ, దాని కీ కక్షయేమొ
యీశ్వరుని చేత ఋజువు చేయింపవమ్మ.
ఆలయంబున నీవు వ్రేలాడువేళ
శివుని చెవి నీకుఁ గొంత చేరువుగ నుండు
మౌని ఖగరాజ్ఞి ! పూజారి లేనివేళ
విన్నవింపుము నాదు జీవితచరిత్ర. [2019/10m/5e]‘గబ్బిలము’ కావ్యముఖంగా జాఘవ ప్రవేశపెట్టిన పదబంధాలను, ప్రతీకలను పరిచయం చేయండి. [2019/10m/7c]
ఈ క్రింది పద్యాన్ని తాత్త్విక దృష్టితో విశ్లేషించండి:
పుట్టంగావలె సత్కవీశ్వరుడు నీ పుణ్యాన మా వంశపుం
బుట్టం జీలిచి కొందు సంచిత కళాపూర్ణ ప్రభారాశియై
పుట్టం గూడదు పుట్టినం గలుగ వెట్టున్[?] నిండు సన్మానముల్
గట్టాయుచ్ఛ్రిత[?] వీచికాయుత వితర్క భ్రష్ట దేశంబునన్. [2018/10m/5d]‘ప్రతిఘటన చైతన్యధార – జాషువా కవిత్వం’ అని నిరూపించండి. [2018/10m/6c]
క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది పద్యంలోని సాహిత్య చారిత్ర కాంశాల్ని వివరించండి.
యతియుంబ్రాసయులేని సంస్కృత కవిత్వారణ్యమందున్న భా
రతవేదానఁ ఒదేను పర్వముల కాంధ్రత్వంబు నేర్పంచి శా
శ్వతుఁడై పోయిన తిక్కయజ్వకు నివాసంబైన నెల్లూరికిన్
నతులర్పింపుము స్నానమాడు మతి గణ్యంబైన పెన్నానదిన్. [2017/10m/5c]‘గబ్బిలము’ ఖండ కావ్యంలో జాఘవా ప్రయోగించిన ప్రతీకలమూలంగా సామాజికాంశాలను ఏ విధంగా విశ్లేషించాడో వివరించండి. [2017/20m/7a]
ఈ క్రింది కవితా భాగాలను సూచించిన విధంగా విశ్లేషించండి: ఈ క్రింది పద్యాన్ని సామాజిక మత కోణం నుండి వ్యాఖ్యానించండి.
ప్రతిమల పెండ్లిసేయుటకు వందలు వేలు వ్యయించుఁగానిదు:
ఖిత మతువైన పేదల పకీరుల శూన్యమువైన పాత్రలన్
మెతుకు విదల్ప దీ భరత మేదిని ముప్పది మూఁడు కోట్ల దే
వత లెగవడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తు లాఱునే [2016/10m/5c]‘గబ్బిలం’ ఆధారంగా దేశీయ చరిత్ర సంస్కృతుల పట్ల జాఘవా దృక్పథాన్ని వివరించండి. [2016/20m/7a]
క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది పద్య రచనా శైలిని పరిశీలించండి.
కలరు కళా సముద్రములు గట్టులు రాయగ నీదినట్టి ధీ
విలసితులైన పండితులు పెక్కురు వేదపురాణ శాస్త్రముల్
బలకిన సత్క వీశ్వరుఁడు వ్యాసమునీంద్రుడు శిష్యకోటితో
మెలగెఁ నొకప్పుడుండు నట మేచక కంఠుద్రు విశ్వనాథుఁడై. [2015/10m/5c]‘నాదు కన్నీటి కథ సమన్వయము సేయ నార్ద్ర హృదయంబు కూడ కొంతవసరంబు’ గబ్బిలంలోని వస్తుతత్వంలో సమన్వయించండి. [2015/10m/6c]
క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది కవితా పంక్తులను సామాజిక దృష్టితో విశ్లేషించండి:
హృదయము లేని లోకము సుమీ యిది మాపుల
పశ్చిమంబుగా
నుదయము తూర్పుగా నడచుచుండు సనాతన ధర్మ
ధేనువుల్
పిదికిన పాలు పేదకు లభింపవు శ్రీగలవాని యాజ్ఞలో
పెదవి గదల్ప జాల రరవింద భవ ప్రముఖామృతాంధసుల్ [2014/10m/5d]క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి:– క్రింది పద్యాన్ని సామాజిక దృష్టితో వ్యాఖ్యానించండి:–
ముప్పు ఘటించి వీని కులమున్ గలిమిన్ గబళించి దేహమున్
బిప్పి యొనర్చు నీ భరత వీరుని పాదము కందకుండఁగాఁ
జెప్పులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరింపలే
దెప్పుడు నప్పువడ్డది సుమీ భరతావని వీని సేవకున్. [2013/10m/5b]క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది పద్యాన్ని సామాజిక దృష్టితో విమర్శించండి:-
“ప్రతిమల పెండ్లిసేయుటకు వందలు వేలు వ్యయించుఁగాని దుః
ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్పదీభరతమేదిని ముప్పదిమూడు కోట్ల దే
వతలెగబడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులారునే?” [2012/12m/5d]“జాషువా కవిత్వంలో ఎంత ఆధునికత ఉంది – అభ్యుదయాంశ ఉంది. కొంత సంప్రదాయం ఉన్నా మరెంతో ప్రయోగం ఉంది. ప్రయోజనమూ ఉంది.”
ఈ వాక్యాన్ని సమర్థించండి. [2012/30m/7a]క్రింది కవితా భాఘాలను సూచించినరీతిలో విశ్లేషించండి: క్రింది పద్యాన్ని సామాజిక దృష్టితో వ్యాఖ్యానించండి:
పరమార్థంబులు బోధసేయుదురులోభస్వాంతలైనిత్యమున్
గురువుల్ ముక్కుకు సూటిగాఁ దగులు యుక్తుల్ పన్ని కైవల్యపుం
దెరువుల్చూపి మహాపరాధివనుచున్ దీర్మానముల్ సేముచుం
దురు లేదాంత రథంబు సాగదను కొందున్ నేను లేకుండినన్ [2011/20m/5b]క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి. కళాసౌందర్య (Aesthetic) దృక్పథంతో విమర్శించండి:
దర్శింపగలవు గౌతమబుద్ధదేవుని
ప్రాచీన భరత శిల్పంబునందు
సాధింపఁగల వహింసామంత్రరాజం బు
శాక్యసింహునికాలిజాడలయందు
తెలిసికోఁగలవు బౌద్ధుల సాహితీసేవ
అమరసింహుని కవిత్వమునయందు
వీక్షింపగలవు కపిలవస్తు నగరంబు
నాశనదేవ్యధీనంబు నందు
రెండువేలేండ్లు క్రింద నిద్రించుచున్న
మౌర్యరాజుల విపుల సామ్రాజ్య చరిత
మేకరువుపెట్టు ప్రకృతి యందాకళించి
వెచ్చవెచ్చనికన్నీరు విడువగలవు [2010/20m/5b]క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి:- సామాజిక (Sociological) దృక్పథంతో విమర్శించండి:-
నిన్ను బహిష్కరించు నవనీవలయం బిది యంటరానివాఁ
డున్న నిషిద్ధగేహము సహోదరి. నీవు సమస్త దేవతా
సన్నిధి నారగింతువు ప్రసాదము లంతటి పుణ్యురాలివై
యన్నము లేని పేదల గృహంబుల సొచ్చితివేల బేలవై. [2009/20m/5b]
2.6] సి. నారాయణరెడ్డి
29 questions
ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: రాణి, లకుమతో తన ఆర్ద్రతను వెల్లడించిన విధం నేటి యువతకు సందేశాత్మకం ఎలానో వివరించండి:
నిన్ను రాయలు కన్నులందున
నిల్పినందుకు పరితపించను
కాని దేశమ్మును తృణమ్మటు
కాల ద్రోయుట ఎట్లు సైతును?
దేశ మొక దెస నీవు ఒక దెస
తేల్చుకొను మెయ్యది ఘనమ్మో
వ్యక్తి సంఘములందు ఎయ్యది
ప్రథమ గణ్యమొ చెప్పవమ్మా ! [2026/10m/5e]మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: ‘కర్పూర వసంత రాయలు’ ‘భావుకతకు ప్రతీక’ విశ్లేషించండి. [2026/20m/8b]
కింది కవితాఖండికలకు సూచించిన విధంగా సమాధానాలు విశ్లేషిస్తు రాయండి: ఈ క్రింది ఖండికలోని భావార్థాన్ని విశదపరచండి:
నేల నిదురవోయె
నింగి నిదురవోయె
గాలినిదురవోయె రేడో
కండె అదరిపోయె [2025/10m/5e]మొదటి మూడు ప్రశ్నాలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: కర్పూర వసంత రాయలు కావ్యంలోని సి. నారె రచనా శిల్పాన్ని ఆవిష్కరించండి? [2025/10m/7c]
ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: ‘కావ్యవస్తువు అంటే కావ్యానికి చివర ఉన్న ఈ రెండు పంక్తుల లోనే ఉంది’ – సమర్థించండి:
“కొండవీటను పాదు కొన్నట్టిమట్టిలో
సైతమ్ము కర్పూర సౌరభమ్ములు వీచు.” [2024/10m/5d]అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: కర్పూర వసంత రాయల కావ్యం ద్వారా సినారే గారి వర్ణనాలంకార శిల్పచాతుర్యాన్ని విపులీకరించండి. [2024/10m/6c]
ఈ క్రింది కవితా భాగాలకు అడిగిన రీతిలో 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పంక్తుల్లోని శ్లేషను వివరించండి:
ముక్త భూషణయైవి
ముక్తేతరాలంకరణ యై
నర్తించు లకుమ నా
నరవరుడు చూచె అనిమిషుడై [2023/10m/5e]కర్పూర వసంతరాయలు లోని శృంగార, వీర రసాచిత్యాన్ని విశదీకరించండి? [2023/10m/8c]
ఈ క్రింది కవిత్వ భాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ కవిత్వంలోని ప్రతీకాత్మక రచనా శైలిని విశ్లేషించండి:
వాసంత సమీరం నీవై,
హేమంత తుషారం నేనై
నీ ఎగిరిన జీవ విహంగం
నా పగిలిన మరణ మృదంగం
చిగురించిన తోటల లోనో
చితులుంచిన చోటులలోనో
వలయములై చలించునపుడే.
విలయములై జలించునపుడే
కాలానికి కళ్ళెం వేస్తాం
ప్రేమానికి గొళ్ళెం తీస్తాం. [2022/10m/5b]ఈ క్రింది కవిత్వ భాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ పద్యంలోని భావచిత్రాలను రచయిత దృశ్యీకరించిన విధమెట్టిది? విరహి చిత్తముల ఓర్జరి తమ్ములుగ జేయ
దండు వెడలిన మన్మథస్వామి రథముపై
ముద్దుమూటలు గట్టు ముత్యాల గొడుగు
కొండపై అదో వియోగుల కగ్గి విడుగు
వలకాక నణచికొను తలిరు బోణుల జూచి
కనులెఱ్ఱ జేసినటు కంజారి అగుపించె [2022/10m/5c]లకుమా దేవి వ్యక్తిత్వ ఆవిష్కరణలో సి. నారాయణ రెడ్డి కవితా శిల్పాన్ని పరిశీలించండి. [2022/15m/6c]
వర్ణనాత్మక దృష్టితో ఈ పంక్తులలో వ్యక్తమౌతున్న వైశిష్ట్యాన్ని తెలుపండి:
“పృథివి నాయమ జఘన పీఠమ్మునంజూచి
జలమామెకంటి పాపల లోతులజూచి
తేజమ్ము నామె ముఖ రాజీవమున గాంచి
వాయుగతినామె నిశ్వాసముల గుర్తించి
ఆకాశమామె మధ్యమునందు గమనించి
నిఖిల సృష్టికి లకుమనే ప్రతీకగనెంచి” – [2021/10m/5e]లకుమ పాత్రచిత్రణలో నారాయణరెడ్డి చూపిన ప్రతిభావిశేషాన్ని వివరించండి. [2021/20m/8b]
ఈ కింది కవితా ఖండికల ద్వారా పాత్రల భావోద్వేగాన్ని కవి ఏవిధంగా ఆవిష్కరించాడో వివరించండి:
ఆమె ఆక్రందనము విని కా
టయ్యవేముని గుండె నేలను
చీల్చుకొని ఉప్పొంగిపడివ
చ్చెను కవోష్ణాశ్రువుల ధారలు
అతడు దుఃఖించకము చెల్లీ
యనుచు ఆశ్వాసించు చుండెను
ఆమె ‘అన్నా’ యనుచు ఆతని
అడుగులంబడి యేడ్చు చుండెను [2020/10m/5d]కర్పూర వసంతరాయలు ఖండ కావ్యంలో నారాయణ రెడ్డిగారు ప్రదర్శించిన నాటకీయ శిల్పాన్ని, సంవాదాత్మక శైలీ విన్యాసాన్ని విశదీకరించండి. [2020/20m/6a]
ఈ క్రింది సన్నివేశంలో ఇమిడి ఉన్న కావ్యతాత్పర్యాన్ని వివరించండి:
ఎటులనో తన చూపు లిటుత్రిప్పి కాటవే
ముని పైన ప్రసరించె రేడు
ఇంగితజ్ఞుడు చెప్పెనేదో? రేని యెడంద
లో నిల్చె వర్ణములు మూడు.
రాజు పెదవుల మీద ‘లకుమా’ యనెడు అక్ష
రము లయత్నముగ నొల్కినవి
లకుమ చరణానద్ధరత్నకింకిణులు మె
ల్లగ ‘ప్రభూ’ యంచు పల్కినది.
రాణి అధరోష్ఠమ్ముపైన ఒక సోగవె
న్నెల తున్క జారిపోయినది
లకుమ ఓడ్యాణస్థ రత్న ముకురముల చం
ద్రిక తన ముఖమ్ము జూచినది. [2019/10m/5c]‘కర్పూర వసంతరాయలు’ కావ్యంలో వ్యక్తి స్వార్థము – దేశభక్తి అన్న భావనల నాటకీయ సంఘర్షణను విశ్లేషించండి. [2019/20m/7a]
ఈ క్రింది కవితా ఖండికలను కాల్పనిక దృష్టితో వివేచించండి:
పసుపు మించుల చేలమేదీ
పసిడియంచుల చేలమేదీ
కర్ణతాటంకమ్ములేవీ
కాంచనాధ్యాణమ్మదేదీ[?]?
ఆమె వెన్నెల యౌనో? వెన్నెల
ఆమెయో? యన కానుపించెను
కాదు; వెన్నెల తరుణి వేషము
కట్టెనో యనగా స్ఫురించెను. [2018/10m/5e]‘కర్పూర వసంతరాయలు’ కావ్యంలోని వర్ణనా నైపుణ్యాన్ని విశ్లేషించండి. [2018/10m/7c]
క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది కవితా భాగాలను మనస్తత్వ దృష్టితో పరిశీలించండి.
“నీ పయిన్ ఒక ఘోర భారము
మోపగా వచ్చితిని చెల్లీ
పాల ముంతువొ నీట ముంతువొ
బాధ్యతను గమనించి తల్లీ
నిన్ను రాయలు కన్నులందున
నిలిపినిందుకు పరితపించను
కాని దేశమ్మును తృణమ్మటు
కాల ద్రోయుట ఎట్లు సైతును?
దేశ మొకదెన నీవు ఒక దెస
తేల్చుకొను మెయ్యది ఘనమ్మో
వ్యక్తి సంఘములందు ఎయ్యది
ప్రథమగణ్యమొ చెప్పవమ్మా !
గుండె రాయిగ చేసుకొని కడ
కొక్క మాటయె అందునమ్మా !
భూపతిని ఎటులైన విడిపో
వుటయె నీకు అవశ్యమమ్మా !” [2017/10m/5e]ఈ క్రింది కవితా భాగాలను సూచించిన విధంగా విశ్లేషించండి: ఈ క్రింది కవితాభాగాలను మనస్తత్వ పరిశీలనా దృష్టితో వ్యాఖ్యానించండి.
ఇన్ని నాళ్ళుగ నా యెదను దహి
యించు బాధను దాచి యుంచితి
ఈ దినమ్మున మాత్రమన్నా!
ఏలకో చలియించిపోయితి
రేడు నా అంతఃపురమునకు
రాడనెడు దుఃఖమ్ముకన్నను
రాచగద్దెను విడిన వార్తయె
రంపమునగోసినది తండ్రీ!
ఆట కత్తెల నాదరించుట
అధిపులకు ధర్మమ్మెకానీ
వారి యడుగుల మ్రోల బ్రతుకును
ధార వోయుట యేటి న్యాయము?
కేళికామందిరము కన్నను
ఓలగమ్ము పవిత్రమైనది
వ్యక్తి కన్నను దేశ సౌభా
గ్యమ్ము ఆదర పాత్రమైనది. [2016/10m/5e]క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది గేయ పాదాలలో ఔచిత్య అలఁకార శోభను విశ్లేషించండి.
లకుమ ఒకప్పుడు నదిపో
లిక పొంగులు వోయినపుడు
ప్రభువే రత్నాకరుడై
పరీరంభమున ముంచును
ఆమె విపంచికయైతా
దాత్మ్యమున మ్రోయునపుడు
ప్రభువు వాయమ తనూవల్లి
పై పాణితలమ్ముంచును. [2015/10m/5e]కర్పూరవసంతరాయలులో లకుమాదేవి పాత్ర విశిష్టను అనుశీలించండి. [2015/10m/7c]
క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది కవితా పంక్తుల్లోని అలంకార వైచిత్రిని వివరించండి:
ఆమె వెన్నెలయౌనో? వెన్నెల
ఆమెయో? యన కానుపించెను
కాదు; వెన్నెల తరుణివేషము
కట్టెనో యనగా స్ఫురించెను
ఆమె నల్లడ లాలకించెను
అమరగానము సాగుచుండెను
ఆమె యెదురుగ చూపుదించెను
అమృత రూపము వెల్గుచుండెను
పరవశుండగు రాజు వెన్నెల
తరగలంబడి తేలిపోయెను
పరవశుండగు రాజు బృందా
పరిసరమ్ముల నిల్చిపోయెను. [2014/10m/5e]క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి:– క్రింది కవితా పంక్తులను కళా సౌందర్య దృష్టితో పరిశీలించండి:–
కోకిలాది శకుంతముల
కాకలీ స్వరములు తప్ప
వేరు గొంతుకలు పల్కిన
తీరు కానిపించదచట
గువ్వల మువ్వపు వ్రేళుల
కొసల తాకిడులను తప్ప
అచట చిగురు కొమ్మలు అ
న్య స్పర్శ నెరుంగ లేదు. [2013/10m/5e]క్రింది కవితా భాగాలను సూచించిన రీతిలో విశ్లేషించండి: క్రింది కవితాపంక్తులను కళా సౌందర్య దృష్టితో పరిశీలించండి:-
ఆ నాడు లకుమ నిర్వేణియై ఉన్మత్త
వాణియై గోపితగ్లానియై రూపించె
కురులు విరబోసుకొని శిరసుపై ఒక పూల
చెండు నిడుకొని చంద్రశేఖరుండ నేననును
అలికమున సింధూర తిలకమ్ము దీర్చి ‘ఇది
గో యగ్నినేత్ర’మని రాయనిని బెదరించు
గళమందు కస్తూరికా రేఖలను దిద్ది
కాకోలకంఠ మిదిగో కనుము కనుమనున
తన తనువు నిండ నిలువున గీటు గీసికొని
ఈ వైపు అమృతమును ఆ వైపు విషమునును
లకుమ చేష్టలు రాయునికి వింతగా తోచి
ఇది యేమి అభినయమ్మో ప్రేయసీ యనెను. [2012/12m/5c]క్రింది కవితా భాఘాలను సూచించినరీతిలో విశ్లేషించండి: క్రింది కవితా పంక్తులను కళాసౌందర్య దృష్టితో పరిశీలించండి:
ఈపాదములే కాదా
భూపాలుడనైననన్ను
అనంతర సరాజ్యమ్మున
కధీశ్వరునిగ జేసెను
ఈచరణములేకాదా
రాజవాడనైననాకు
రెక్కలిచ్చిగంధర్వవ
రేణ్యునిగా నొనరించెను
ఈపదములరాపాడిన
నూపురములు చిరుగజ్జెలు
చప్పని నాబ్రతుకులోర
సధ్వనులను పలికించెను
పువురేకులు తాకినచో
బొబ్బలెత్తు నీయరికా
ళ్లను ని మిరితినా పులకిం
చును పంచ ప్రాణమ్ములు [2011/20m/5c]క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి. సైద్ధాంతిక (Ideological) దృక్పథంతో విమర్శించండి:
నీపయిన్ ఒకఘోరభారము
మోపగా వచ్చితిని చెల్లీ !
పాలముంతవొ నీటముంతవొ
బాధ్యతనుగమనించి తల్లీ
నిన్నురాయలు కన్నులందున
నిలిపినందుకు పరితపించను
కానిదేశమ్మును తృణమ్మటు
కాలద్రోయుట ఎట్లుసైతును?
దేశమొకదెస నీవు ఒకదెస
తేల్చుకొనుమెయ్యదిఘనమ్మో
వ్యక్తి సంఘములందు ఎయ్యది
ప్రథమ గణ్యమొ చెప్పవమ్మా ! [2010/20m/5d]క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి:- చారిత్రక-సామాజిక (Historical and Sociological) దృక్పథంతో విమర్శించండి:
ఎటు చూచినను కపురపు గంధమే
ఏదెసను ఆనందమే అందమే
కర్పూర కస్తూరి
కా చందనములతో
నేలయేకాదు నిం
గియు పరిమళించినది.
జాదర జాదర జాదరయంచును
‘చర్చరి గీతులు’ పాడెడువారలు
ద్రుత తాళమ్మున ధుంతక ధుంతక
ధుంధుంకిటయని ఆడెడువారలు.
తుమ్మెద పదములు వెన్నెల పదములు
కమ్మగ గానము చేసెడువారలు
ఏలలు పాడుచు ఈలలు వేయుచు
సోలుచు తూలుచు పోయెడువారలు
ఝల్లరి జర్ఝరి మోదెడువారలు
వల్లకి వంశిక మ్రోసెడివారలు
డమరువులను మ్రోగించుచు బల్ ఫీ
ట్కారమ్ములతో తూగెడువారలు
దేశి మార్గముల నృత్తనృత్యముల
తీరులు చూపుచు పోయెడువారలు. [2009/20m/5d]
2.7] కనుపర్తి వరలక్ష్మమ్మ
16 questions
మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: ‘శారద లేఖలు’ సంఘచైతన్యానికి, ఆధునిక సమాజానికి ఏవిధంగా పునాదులు వేశాయో విశ్లేషించండి. [2026/20m/7a]
మొదటి మూడు ప్రశ్నాలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: ‘శారద లేఖలు’ – లోని స్త్రీ మనస్తత్వాన్ని నాటి సాంఘిక స్థితిగతుల ఆధారంగా వివరించండి. [2025/20m/7b]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ‘శారద లేఖల’ ద్వారా తెలియవచ్చే ఆనాటి స్త్రీల స్థితిగతులను, వాళ్ళ మనోభవాలను విపులీకరించండి. [2024/20m/7b]
కనుపర్తి వరలక్ష్మమ్మ శారద లేఖలు సంఘ చైతన్యానికి పునాదులు చర్చించండి? [2023/20m/7b]
“పత్రికలలో హాస్యరచన పోషణకు స్త్రీయే వస్తువగుట అనుచితము” అని వరలక్ష్మమ్మ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని స్త్రీవాద దృష్టికోణంలో విశ్లేషించండి. [2022/20m/8a]
ఆధునిక సమాజ చరిత్ర నిర్మాణంలో శారద లేఖలు కలిగించే వికాసాన్ని వివరించండి. [2021/10m/8c]
మహిళాభ్యుదయానికి సంబంధించి వివిధ ప్రాంతాలలో వివిధరంగాలలో ఏర్పడిన పరిణామాలను అంచనావేసే కొలమానాలుగా శారదలేఖలను విశ్లేషించండి. [2020/10m/8c]
“మూడు దశాబ్దుల ఆంధ్ర జీవిత రేఖలు” శారద లేఖలలో ప్రతిబింబితమైన తీరును వివరించండి. [2019/20m/6a]
శారదలేఖల్లో వ్యక్తమైన సామాజిక పరిణామాలను వివరించండి. [2018/20m/8a]
శారద లేఖల్లో ప్రస్తావించిన యాత్రల ఆధారంగా కనుపర్తి వరలక్ష్మమ్మ పేర్కొన్న సామాజికాంశాలను పరిశీలించండి. [2017/20m/6b]
‘శారద లేఖలు’ లో సామాజిక సాంస్కృతిక అంశాలపట్ల స్త్రీల కోణం ఆవిష్కరించబడిన తీరు వ్రాయండి. [2016/20m/6b]
శారద లేఖలలో చిత్రించిన మహిళా చైతన్యాన్ని వివరించండి. [2015/20m/8b]
శారద లేఖల్లోని సంఘసంస్కరణ దృష్టిని సమీక్షించండి. [2014/20m/6b]
శారద లేఖలు స్త్రీ చైతన్యానికి మూలాలు – వివరించండి. [2013/25m/6b]
తెలుగులో లేఖా సాహిత్యాన్నికున్న ప్రాధాన్యం వివరించి ‘శారద లేఖలు’లోని అంశాలను చర్చించండి. [2012/30m/7b]
‘శారదలేఖలు సామాజిక పరిస్థితులకు దర్పణాలు’ వివరించుము. [2010/60m/8]
2.8] ఆత్రేయ
17 questions
మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: కుటుంబ, ఉద్యోగ సమతౌల్యాన్ని సాధించదంలో ‘ఎన్.జి.ఒ.’ నాటకం ఇచ్చే సందేశం ఏమిటి? [2026/20m/8a]
మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: ఎన్.జి.వో. నాటకంలో ఆత్రేయ చిత్రించిన మధ్యతరగతి జీవన ఆటుపోట్లను చర్చించండి? [2025/20m/8b]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఆత్రేయగారి నాటకశిల్ప కళా కౌశల్యాన్ని, సంభాషణా చాతుర్యాన్ని ‘ఎన్.జి.ఓ.’ నాటకం అధారంగా నిరూపించండి. [2024/10m/8c]
ఎన్.జి.వో. నాటకంలోని మధ్యతరగతి జీవన విధానాన్ని సమీక్షించండి? [2023/10m/7c]
తెలుగు నాటక సాహిత్యంలో ఎన్.జి.ఓ. నాటకానికి లభించిన ప్రాశస్థ్యాన్ని వివరించండి. [2022/15m/8b]
మధ్యతరగతి భేషజాన్ని ఆత్రేయ యన్.జి.వో నాటకంలో చిత్రించినవైనాన్ని విశ్లేషించండి. [2021/10m/6c]
ఆత్రేయ యన్.జి.ఓ. నాటకం ద్వారా మధ్యతరగతి మందభాగ్యుల జీవితాల్లోని సంఘర్షణలను ఆవిష్కరించిన తీరును వివరించండి. [2020/10m/7c]
‘ఎన్.జి.ఓ.’ లో గోపి సంభాషణల ద్వారా ఆత్రేయ ఆశించిన ఆదర్శసమాజం తీరుతెన్నులను సమీక్షించండి. [2019/20m/7b]
ఆత్రేయ ఎన్.జి.వో. నాటకం ఏ ప్రజాశ్రేణి మనస్తత్వ చిత్రీకరణమో చర్చించండి. [2018/20m/8b]
రాజకీయ ఆర్థిక సామాజిక కోణాల్లో మధ్యతరగతి జీవిత చిత్రణను ఎన్.జి.ఓ. నాటకంలోని గోపి, రంగనాథం పాత్రల ఆధారంగా విశ్లేషించండి. [2017/20m/8a]
మధ్యతరగతి చిరుద్యోగ జీవన వేదనలను ఎన్.జి.వో. నాటకం ప్రతిఫలించిన తీరును వివరించండి. [2016/20m/8a]
ఎన్.జి.ఓ. నాటకంలో ప్రతిబింబించే అభ్యుదయ భావాలను విశదీకరించండి. [2015/10m/8c]
ఆత్రేయ నాటక రచన ప్రతిభను ఎన్.జి.వో. నాటకం ఆధారంగా వివేచించండి. [2014/20m/8a]
ఎన్.జి.ఓ. నాటకంలోని పాత్రల మానసిక చిత్రణను అనుశీలించండి. [2013/25m/8b]
“సంప్రదాయాల ముసుగులో బతికే మధ్య తరగతి మందభాగ్య జీవితాన్ని యన్.జి.ఓ. నాటకంలో ఆత్రేయ శక్తిమంతంగా చిత్రించారు” – విశదం చేయండి. [2012/30m/8b]
ఎన్.జి.ఓ. నాటకంలో ప్రతిఫలించిన వాస్తవికతను నాటక రచనాకాలంనాటి పరిస్థితుల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వివరించండి. [2011/30m/8b]
ఎన్.జీ.ఓ. నాటకంలో ఆత్రేయ మధ్యతరగతి కుటుంబ జీవనాన్ని చిత్రించిన విధానాన్ని వివరించండి. [2009/60m/7]
2.9] రాచకొండ విశ్వనాథశాస్త్రి
20 questions
మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: ‘అల్పజీవి’ కథానాయకుడి పాత్ర ద్వారా యువత నేర్చుకోదగ్గ అంశాలేమిటి? [2026/20m/6b]
మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: ‘అల్పజీవి’ – నవలను మనస్తత్వ శాస్త్ర దృక్పథంలో విశ్లేషించండి? [2025/20m/8a]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: చైతన్య స్రవంతి అంటే ఏమిటో నిర్వచించి, రావిశాస్త్రిగారి ‘అల్పజీవి’లో రచయిత ప్రదర్శించిన నూతనత్వాన్ని విశదీకరించండి. [2024/20m/8a]
‘ద్వైధీభావ లక్షణాలతో మనిషి మనుగడ సాధ్యంకాదు’ అన్న రావిశాస్త్రి అభిప్రాయాన్ని ‘అల్పజీవి నవల’ ఆధారంగా నిరూపించండి? [2023/20m/8b]
‘అల్పజీవి’ నవలలో మనోవిశ్లేషణాత్మక దృష్టికోణం వ్యక్తమయ్యే తీరును సుబ్బయ్య, మోహిని పాత్రచిత్రణ ఆధారంగా విశ్లేషించండి. [2022/15m/6b]
“అల్పజీవి” నవలలోని చైతన్య స్రవంతి శిల్పాన్ని విశదీకరించండి. [2021/10m/7c]
అల్పజీవి నవలలోని మనోవైజ్ఞానిక సిద్ధాంతాల ప్రతి ధ్వనులను విశ్లేషించండి. [2020/20m/6b]
సుబ్బయ్య వ్యక్తిత్వంలోని క్రమపరిణామాన్ని రా.వి. శాస్త్రి శిల్పీకరించిన సంవిధానాన్ని గూర్చి వ్రాయండి. [2019/10m/6c]
‘అల్పజీవి’ నవలాధారంగా రా.వి. శాస్త్రి రచనా విలక్షణతను వివరించండి. [2018/10m/8c]
సుబ్బయ్య ‘అల్పజీవి’గా జీవించటానికి రాచకొండ విశ్వనాథ శాస్త్రి వ్యక్తంచేసిన కారణాలను వివరించండి. [2017/10m/7c]
‘మంచికి హాని చెడ్డకి సహాయం చెయ్యకూడదు’ అనే రాచకోండ విశ్వనాథ శాస్త్రి ఆలోచనను అల్పజీవి నవల ఆధారంగా తెలియజేయండి. [2017/20m/8b]
“భయానికీ మంచికీ పొందికలేదు. పిరికి వారెవరూ కూడా మంచి వారు కాజాలరు –” అన్న రావిశాస్త్రి అభిప్రాయాన్ని అల్పజీవి నవల ఆధారంగా నిరూపించండి. [2016/20m/7b]
అల్పజీవి నవలలో ‘ఆత్మ న్యూనతాభావం’ పాత్రను సమీక్షించండి. [2016/10m/8c]
అల్పజీవి నవల ఆధారంగా మానవ ప్రవృత్తులను పరిశీలించండి. [2015/20m/8a]
మనోవిశ్లేషణాత్మక నవలగా అల్పజీవిని సమీక్షించండి. [2014/20m/8b]
అవ్యక్త మానసిక స్థితికి ప్రతిబింబము అల్పజీవి – చర్చించండి. [2014/10m/8c]
అల్ప జీవి స్వగతం – ఆత్మ న్యూనతా భావ వ్యక్తీకరణను విశ్లేషించండి. [2013/25m/8a]
“అల్పజీవి అడ్లర్ ఆత్మన్యూనతాభ్రాంతి సిద్ధాంతం ప్రాతిపదికగా గల రచన” – విశ్లేషించండి. [2012/30m/8a]
‘అల్పజీవి’ నవల నామ సార్థక్యాన్ని వివరించండి. [2011/30m/8a]
అల్పజీవి నవలలో రచయిత చేసిన సుబ్బయ్య మనస్తత్వ చిత్రణను సమీక్షించండి. [2009/60m/6]
« Previous: విభాగం ఎ: ప్రాచీన కావ్యాలు · Next: Other questions »
Back to: Telugu Literature Optional PYQs – Topic-wise
Last updated: 2 November 2026

