Every question from the Telugu Literature Optional papers of UPSC Mains 2023, placed in its syllabus unit and checked against all questions asked from 2013 to 2022. See what was familiar, what came back and what was new.
Other years:
What stood out in 2023
- 2 questions were close repeats of an earlier paper: Q1c (Paper I), first seen in 2012; Q7b (Paper I), first seen in 2013.
- Every question came from a topic UPSC had asked recently.
Which units got the marks in 2023
Marks asked from each unit in 2023 (dark bar) against its average for 2013–2022 (grey bar).
Paper I
| Unit | 2023 | Average 2013–22 |
|---|---|---|
| విభాగం ఎ: భాష | 200 | 196 |
| విభాగం బి: ప్రాచీన సాహిత్యం | 140 | 135 |
| విభాగం బి: ఆధునిక, జానపద సాహిత్యం | 60 | 65 |
Paper II
| Unit | 2023 | Average 2013–22 |
|---|---|---|
| విభాగం ఎ: ప్రాచీన కావ్యాలు | 200 | 200 |
| విభాగం బి: ఆధునిక సాహిత్యం | 200 | 200 |
A question that fits two units is split equally between them.
Paper I
Q1a. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు భాష ప్రాచీనతను నిరూపించండి. (10 marks)
Q1b. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: మూలద్రావిడం నుంచి తెలుగులో జరిగిన ధ్వని పరిణామాన్ని తెలుపండి. (10 marks)
Q1c. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు భాష ఆధునీకరణలో పత్రికల పాత్రను వివరించండి. (10 marks)
Q1d. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: మాండలికాల ఏర్పాటుకు గల కారణాలను తెలుపండి. (10 marks)
Q1e. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: అనువాదాల ఆవశ్యకతను వివరించండి. (10 marks)
Q2a. తెలుగు పై ఇతర భాషల ప్రభావాన్ని తెలుపండి. (20 marks)
Q2b. నామ్మీకరణ మంటే ఏమిటో నిర్వచించి, అనుకృతి పద్ధతుల్ని వివరించండి. (20 marks)
Q2c. రాయలసీమ మాండలిక పదాల తీరుతెన్నులను వివరించండి. (10 marks)
Q3a. ద్రావిడ భాషల్లో తెలుగు స్థానాన్ని నిరూపించండి. (20 marks)
Q3b. అనువాద సమస్యలను గురించి రాయండి. (20 marks)
Q3c. తెలుగు భాష ప్రామాణీకరణలోని సమస్యలను తెలుపండి. (10 marks)
Q4a. తెలుగు వ్యావహారిక భాషా పరిణామాన్ని వివరించండి. (20 marks)
Q4b. నూత్నపదకల్పన చేసే పద్ధతిని, శాస్త్రసాంకేతిక రంగాల సందర్భంలో ఎదురయ్యే సమస్యల్ని చర్చించండి. (20 marks)
Q4c. ప్రాచీన తెలుగు నుంచి ఆధునిక తెలుగు వరకు పదనిర్మాణంలో వచ్చిన మార్పులను వివరించండి. (10 marks)
Q5a. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: నన్నయకు పూర్వం తెలుగుదేశ కవితా స్థితిని తెలుపండి. (10 marks)
Q5b. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: వృషాధిప శతకంలోని శివభక్తి తత్త్వాన్ని వివరించండి. (10 marks)
Q5c. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ఎర్రన హరివంశంలోని గోపాలకుల జీవన చిత్రణను తెలుపండి. (10 marks)
Q5d. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ప్రబంధ వికాసాన్ని గురించి రాయండి. (10 marks)
Q5e. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ఉదాహరణ కావ్య లక్షణాల్ని వివరించండి. (10 marks)
Q6a. ‘తిక్కనశిల్పంపు తెనుగుతోట’ – అన్న విశ్వనాథవారి వాక్యాన్ని వివరించండి. (20 marks)
Q6b. పోతన భాగవతంలోని శృంగారవైవిధ్యాన్ని తెలుపండి. (20 marks)
Q6c. జాఘువా గబ్బిలంలోని దళిత సాహిత్య తత్త్వాన్ని వివరించండి. (10 marks)
Q7a. అన్నమయ్య కీర్తనల్లోని జానపదాంశాలను తెలుపండి. (20 marks)
Q7b. చేమకూర వేంకటకవి ప్రతిపద్యరచనా చమత్కృతిని విశదీకరించండి. (20 marks)
Q7c. ఆధునిక తెలుగు కవితా ప్రక్రియలను గురించి రాయండి. (10 marks)
Q8a. జానపద కథాగేయ లక్షణాలను పేర్కొని, వాటి విశిష్టతను వివరించండి. (20 marks)
Q8b. ఆధునిక సాహిత్యంలోని సంస్కరణ దృక్పథాన్ని తెలుపండి. (20 marks)
Q8c. నన్నయ ‘అక్షరరమ్యత’ ను గురించి రాయండి. (10 marks)
Paper II
Q1a. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పద్యంలోని ఆపత్కాల మనస్తత్వ చిత్రణను విశ్లేషణ చేయండి:
‘తడయక పుట్టినాఁడ తల్లిచేఁదండ్రిచేవిడువఁ
బడితి నిప్పుడు పతిచేతను విడువఁబడియెద నొక్కో !
నుడువులు వేయునింకేల? యిప్పాటి నోములు తొల్లి
కడఁగి నోఁచితిని గాకేమి’ యనుచును గందెడెందమున. (10 marks)
Q1b. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పద్యంలోని రసధ్వనిని, భావశిల్పాన్ని వ్యాఖ్యానించండి:
పాండవ కౌరవుల్ గలసి పాలును నీరునుబోలెనెమ్మి మై
నుండఁగ దుష్టచేష్టల సుయోధనుఁడింతలు సేసి నాతఁడొ
క్కండ కులక్షయంబునకుఁగారణ మండ్రదిదప్పదైన నీ
వొండన నేల యా బిరుదువోసిన యంతయుఁదీర్పు నేర్పునన్ (10 marks)
Q1c. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పద్యంలోని అలంకార విశేషాలను వివరించండి:
కలిముఖుడుం గుమారుడు వికారపుజేతల ముద్దు సూపుచు
న్గురువుల వాఱుచున్సరిగ గుట్టలుదాటుచు, జన్ముదోయితో
శిరములు రాయుచుం గబరిచేర్చిన చంద్రుని బట్టి తీయగా
గరములచాప నవ్వెడు జగమ్ముల తల్లి శుభంబు లేవుతన్ (10 marks)
Q1d. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పద్యంలోని సంభాషణా వైచిత్రిని వివరించండి:
వరునకు నెద్దియింపది సువర్తనగాఁగఁ దదప్రియం బస
చ్చరితము గాఁగఁ నెన్నుదు నిసర్గము నాకిది తూనిరాద యీ
శ్వరుడును వేదమున్ గురుఁడు సర్వము భర్తయ యేదదాజ్ఞసు
స్థిరమతిఁ జేయుచున్ విధినిషేధము లెవ్వియుఁ గై కొనం దుదిన్ (10 marks)
Q1e. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పద్యంలోని భక్తి నవవిధ భక్తులలో ఏ కోవకు చెందుతుంది విశ్లేషించండి:
నీచువాసనతో మత్సావతారాన తిరిగినా, కొండను వీపున భరించు
కూర్మమునైనా వరాహమై
తుంగ కాయలను తినుచున్నా, వామనుడవై బలిని దేహి యన్నా
పరశురాముడవై నీవిల్లు
రామునకిచ్చినా, రాముడవై అరణ్యముల తిరిగినా, బల రాముడవై
సురాపాన చిత్తుడవైనా, బుద్ధు
డిగా జడత్వముపొందినా, కల్కిగా అశ్వము నదిరోహించినా నేనునిన్ను
విడువను, నీవు నన్ను కాచియే తీర వలెను (10 marks)
Q2a. కింది ప్రశ్నలలో మొదటి రెండింటికి వ్యాసరూప సమాధానములను మూడవ ప్రశ్నకు సంక్షిప్త సమాధానములను రాయండి: శ్రీకృష్ణ రాయభారం కథను నేటి భారత విదేశీ రాయబారాలకు అనువర్తించండి? (20 marks)
Q2b. కింది ప్రశ్నలలో మొదటి రెండింటికి వ్యాసరూప సమాధానములను మూడవ ప్రశ్నకు సంక్షిప్త సమాధానములను రాయండి: సుగాత్రీ శాలీనుల దాంపత్య జీవనంలోని ఒడిదుడుకులను సరిజేసుకున్న తీరును పింగళిసూరన నేర్పు మీర కవిత్వీకరించిన తీరుతో విశదపరచండి? (20 marks)
Q2c. కింది ప్రశ్నలలో మొదటి రెండింటికి వ్యాసరూప సమాధానములను మూడవ ప్రశ్నకు సంక్షిప్త సమాధానములను రాయండి: ‘ఆంధ్ర నాయక శతకం’ ఆధారంగా శ్రీ కాకుళాంధ్ర చరిత్రను వెలికి తీయండి? (10 marks)
Q3a. దుష్యంతుని చరిత్ర పాఠం ఆధారంగా శకుంతల మూర్తిమత్వాన్ని విపులీకరించండి. (20 marks)
Q3b. గుణనిధి కథాంశాన్ని నేటియువత పోకడలతో విశదపరచండి. (20 marks)
Q3c. కళాపూర్ణోదయమునామ సార్థక్యాన్ని చర్చించండి? (10 marks)
Q4a. మొల్ల రామాయణం అవతారికా పద్యాలలోని వస్తువైశిష్ట్యాన్ని వివరించండి. (20 marks)
Q4b. దుశ్యంతోపాఖ్యానంలో దర్శించిన నానారుచిరార్థసూక్తినిధిత్వాన్ని వివరించండి? (20 marks)
Q4c. గుణనిధి కథలోని కౌటుంబిక తాత్త్విక కోకాన్ని పరిశీలించండి? (10 marks)
Q5a. ఈ క్రింది కవితా భాగాలకు అడిగిన రీతిలో 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: తానే ప్రకృతిగా ప్రకృతేతానుగా తాదాత్మ్యం చెంది రచన చేసిన కవి తాత్త్వికతను ఆవిష్కరించండి:
పక్షినయ్యెదఁ జిన్నిఋక్షమయ్యెదను
మధువ మయ్యెదఁ జంద మామ నయ్యెదను
మేఘ మయ్యెదఁ వింతమెఱపు నయ్యెదను
అలరు నయ్యెదఁ జిగురాకు నయ్యెదను
పాట నయ్యెదఁ గొండవాగు నయ్యెదను
పవన మయ్యెదఁ వార్థిభంగ మయ్యెదను
ఏలోకో మెప్పుడో మెటులనో గాని
మాయ మయ్యెద నేను మాఱిపోయెదను (10 marks)
Q5b. ఈ క్రింది కవితా భాగాలకు అడిగిన రీతిలో 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కవిదర్శించిన ‘నేటి ఆవేదన–రేపటి సాభాగ్య’ వ్యవస్థలను పరిచయం చేయండి:
కావున – లోకపు టన్యాయాలూ
కాల్చే ఆకలి, కూల్చేవేదన,
దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ
పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ, పాటలువ్రాస్తూ
నాలో కదిలే నవ్య కవిత్వం
కార్మిక లోకపు కల్యాణానికి,
శ్రామిక లోకపు సాభాగ్యానికి
సమర్పణంగా, సమర్చనంగా (10 marks)
Q5c. ఈ క్రింది కవితా భాగాలకు అడిగిన రీతిలో 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పద్యంలోని సాంస్కృతిక భావచిత్రాల దృశ్యాలను వివరించండి? అన్మదర్మాతిథౌయారబ్ధములు రెడ్ల
భువి వంటశాలలో బొగలటంచు
అచట శ్రీనాథ కావ్య శ్రోతలగు మాకుఁ
మఱచిన పందిళ్ళ పఱపులంచు
కొండ కొమ్ములఁ దీర్చికొని నిల్చియున్నయాం
ధ్ర భటాళి వీరగంధాలటంచు
ఉత్సవాగత జనమ్మొఱిరిగి పోఁగొండకొ
మ్ములఁ దొంగి కనురెడ యుగుదలనుచు
మున్ను గుట్టాల దూకించు కొన్నచోట
నడు గడుగునందుఁ బాతంబులైన మాకు
నప్పుడప్పుడు తలలెత్తి నంత కొండ
కొసల మబ్బులు పొరపెట్టి విసరులాడు (10 marks)
Q5d. ఈ క్రింది కవితా భాగాలకు అడిగిన రీతిలో 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పద్యంలోని తెలుగుప్రాంత వైభవంలోని పలుకోణాలను గుర్తించి వివరించండి:
పరదాపద్ధతి మాన్పిరో సిరికిఁగుప్పల్ వోసియంగళ్ల యం
దురుమాణిక్యము లమ్మినారచట మున్నోపక్షిణీ మూరురా
యర గండండు మహీంద్ర వైభవమతో నాంధ్రక్ష్మాతుండలి
న్బరిపాలించిన నాఁటి పెంపును దలంపన్ మేను గంపించెడిన్ (10 marks)
Q5e. ఈ క్రింది కవితా భాగాలకు అడిగిన రీతిలో 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పంక్తుల్లోని శ్లేషను వివరించండి:
ముక్త భూషణయైవి
ముక్తేతరాలంకరణ యై
నర్తించు లకుమ నా
నరవరుడు చూచె అనిమిషుడై (10 marks)
Q6a. కింది ప్రశ్నలలో మొదటి రెండింటికి వ్యాసరూప సమాధానములను మూడవ ప్రశ్నకు సంక్షిప్త సమాధానమును రాయండి: దళిత సంఘటిత శక్తికి మూలం: గబ్బిలం – చర్చించండి? (20 marks)
Q6b. కింది ప్రశ్నలలో మొదటి రెండింటికి వ్యాసరూప సమాధానములను మూడవ ప్రశ్నకు సంక్షిప్త సమాధానమును రాయండి: గురజాడ తనకథానికల్లో బలంగా నాటిన ఆధునిక పునాదుల్ని విశ్లేషించండి. (20 marks)
Q6c. కింది ప్రశ్నలలో మొదటి రెండింటికి వ్యాసరూప సమాధానములను మూడవ ప్రశ్నకు సంక్షిప్త సమాధానమును రాయండి: విశ్వనాథవారు దర్శించిన ఆంధ్రల చారిత్రక ప్రశస్తిని తెలపండి? (10 marks)
Q7a. మార్క్సిజం దృక్పథానికి అభ్యుదయ మార్గం: మహాప్రస్థానం – చర్చించండి. (20 marks)
Q7b. కనుపర్తి వరలక్ష్మమ్మ శారద లేఖలు సంఘ చైతన్యానికి పునాదులు చర్చించండి? (20 marks)
Q7c. ఎన్.జి.వో. నాటకంలోని మధ్యతరగతి జీవన విధానాన్ని సమీక్షించండి? (10 marks)
Q8a. కృష్ణశాస్త్రి ఆత్మాశ్రయ ఆంతర్యాన్ని భావ కవిత్వ లక్షణాలతో సమన్వయించండి? (20 marks)
Q8b. ‘ద్వైధీభావ లక్షణాలతో మనిషి మనుగడ సాధ్యంకాదు’ అన్న రావిశాస్త్రి అభిప్రాయాన్ని ‘అల్పజీవి నవల’ ఆధారంగా నిరూపించండి? (20 marks)
Q8c. కర్పూర వసంతరాయలు లోని శృంగార, వీర రసాచిత్యాన్ని విశదీకరించండి? (10 marks)
Spotted something wrong?
If a question is in the wrong unit or a match looks wrong, please report an error.
Related: Overall Telugu Literature PYQ analysis · Year-wise question papers · Topic-wise PYQs

