Every question from the Telugu Literature Optional papers of UPSC Mains 2026, placed in its syllabus unit and checked against all questions asked from 2013 to 2025. See what was familiar, what came back and what was new.
Other years:
What stood out in 2026
- One question was a close repeat of an earlier paper: Q1d (Paper I), first seen in 2025.
- Every question came from a topic UPSC had asked recently.
Which units got the marks in 2026
Marks asked from each unit in 2026 (dark bar) against its average for 2013–2025 (grey bar).
Paper I
| Unit | 2026 | Average 2013–25 |
|---|---|---|
| విభాగం ఎ: భాష | 200 | 197 |
| విభాగం బి: ప్రాచీన సాహిత్యం | 140 | 133 |
| విభాగం బి: ఆధునిక, జానపద సాహిత్యం | 60 | 67 |
Paper II
| Unit | 2026 | Average 2013–25 |
|---|---|---|
| విభాగం ఎ: ప్రాచీన కావ్యాలు | 200 | 201 |
| విభాగం బి: ఆధునిక సాహిత్యం | 200 | 199 |
A question that fits two units is split equally between them.
Paper I
Q1a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): తెలుగు, తెనుగు, ఆంధ్ర పదాల పూర్వ పరాలను నిర్ణయించండి. (10 marks)
Q1b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): శాస్త్ర సాంకేతిక పదజాల కల్పనలో సమస్యలు? పరిష్కారాలను తెలపండి. (10 marks)
Q1c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): తెలుగు భాషపై పార్శీ, ఉర్దు భాషా ప్రభావాన్ని తెలపండి. (10 marks)
Q1d. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): అనువాద పద్ధతులను వివరించండి. (10 marks)
Q1e. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): భాషా ప్రామాణికతను నిర్ణయించడంలోని సమస్యలను తెలపండి. (10 marks)
Q2a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాషా ఆధునికీకరణలో భాషా, సాహిత్య ఉద్యముల పాత్రను వివరించండి. (20 marks)
Q2b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ద్రావిడ భాషలలో తెలుగు భాష స్థానాన్ని విశిష్టతను చర్చించండి. (20 marks)
Q2c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాషలోని మాండలిక భేదాలను తెలపండి. (10 marks)
Q3a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు వాక్యాల నిర్మాణంలోని ప్రధాన విభాగాలను తెలపండి. (20 marks)
Q3b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాషలోకి వచ్చిన ధ్వని, రూప పరిణాములను సోదాహరణ పూర్వకంగా చర్చించండి. (20 marks)
Q3c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: సంభాషణలో ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులను వివరించండి. (10 marks)
Q4a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: వ్యవహారిక భాషా ఉద్యమంలో గిడుగు వేంకట రామమూర్తి చేసిన కృషిని విశదీకరించండి. (20 marks)
Q4b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: అనువాదంలో సాంస్కృతిక, జాతీయాలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను వివరించండి. (20 marks)
Q4c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగువారి సాంస్కృతిక, సాహిత్య అభిలాషను రేడియో పెంపొందించిందా? చర్చించండి. (10 marks)
Q5a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): ప్రాజ్నన్నయకాలంలో మార్గదేశి విభజన ఎలా ఉండేది? (10 marks)
Q5b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): శివకవుల నాటి సాహిత్య ప్రక్రియలను గురించి వివరించండి. (10 marks)
Q5c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): తిక్కన తెలుగు పలుకుల విశిష్టతను వివరించండి. (10 marks)
Q5d. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): ఎర్రన, నాచన కవిత్వాలను తులనాత్మకంగా విశ్లేషించండి. (10 marks)
Q5e. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): జాతీయోద్యమంలో తెలుగు కవిత్వం నిర్వహించిన పాత్రను వివరించండి. (10 marks)
Q6a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: శ్రీనాధ పోతనల భక్తి తత్త్వాన్ని తులనాత్మకంగా విశ్లేషించండి. (20 marks)
Q6b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: అన్నమయ్య, త్యాగయ్య కీర్తనల తారతమ్యాలను వివరించండి. (20 marks)
Q6c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: నిత్యజీవితంలో జానపద కళల ప్రభావాన్ని వివరించండి. (10 marks)
Q7a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: దక్షిణాంధ్ర వాజ్మయాభివృద్ధిలో రఘునాధనాయకుని పాత్ర. (20 marks)
Q7b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఆంధ్రమహాభారత రచనకుముందున్న చారిత్రక, సాహిత్య నేపథ్యాన్ని వివరించండి. (20 marks)
Q7c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: కావ్యానికి ప్రబంధానికి ఉన్న భేదసాదృశ్యాలను సౌదాహరణంగా వివరించండి. (10 marks)
Q8a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు కథానికాశిల్ప పరిణామాన్ని వివరించండి. (20 marks)
Q8b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: స్త్రీవాద కవిత్వం – జెండర్ స్పృహ. (20 marks)
Q8c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: యక్షగాన ప్రక్రియా వైశిష్ట్యాన్ని వివరించండి. (10 marks)
Paper II
Q1a. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ కింది పద్యంలోని వస్తువు ఆధారంగా నైతిక విలువలను విశ్లేషించండి:
విమల యశోనిధీ పురుష వృత్త మెఱుంగుచునుండుఁ జూవెవే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్
యముఁడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు నన్మహాపదా
ర్థము లివి యుండగా నరుఁడు దక్కొన నేర్చునె తన్నుమ్రుచ్చిలన్. (10 marks)
Q1b. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ కింది పద్యంలోని ధ్వని గర్భిత శబ్ద వాక్య ప్రయోగాలను వివరించండి:
వచ్చినవాడు ఫల్గునుఁడవశ్యము గెల్తు మనంగరాదురా
లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే?
హెచ్చగుఁ గుందగుందొడరుటెల్ల విధంబుల కోర్చుటట్లుగా
కిచ్చఁ దలంచి యొక్కమెయి నిత్తఱిఁ బొందగుచేఁతయుందగున్. (10 marks)
Q1c. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ కింది పద్యంలోని గుణనిధి తల్లి మనోవేదనను చిత్రీకరించండి:
విడువక నీవు పట్టణము వీధుల వీధుల వెఱ్ఱివాడవై
చెడుగులఁ గూడి ధౌర్త్యములు సేయ మహీరమణుండెఱింగెనే
విడుచును సోమయాజి మనువృత్తులు చేకొనునెల్ల భంగులన్
జెడుదుము నీకతంబుననుఁ జీరయుఁగూడును లేక? పుత్రకా ! (10 marks)
Q1d. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ క్రింది పద్యంలోని పదప్రయోగ వైచిత్రిని తెల్పండి:
ధళ ధళ మెఱపులు మెఱయఁగఁ
బెళ పెళ నుఱుముచుఁ బెరిల్లు పెరిలునఁ బిడుగుల్
నలుగడఁ బడ బెడిదపుధా
రలుగలబలువాన జలధరంబులు గురిసెన్. (10 marks)
Q1e. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పద్యంలోని అలంకార వైశిష్ట్యాన్ని వివరించండి:
ఇన వంశోద్భవుడైన రాఘవుడు, భూమీశాత్మజల్ వేడ్కతోఁ
దను వీక్షింప, మునీశ్వరుండలరఁ, గోదండంబు చేనంది, చి
వ్వను మోపెట్టి, గుణంబు పట్టి, పటు బాహాశక్తితోఁ దీసినన్,
దునిఁగెన్ జాపము భూరి ఘోషమున, వార్ధుల్ మ్రోయుచందంబునన్. (10 marks)
Q2a. కింది ప్రశ్నల్లో రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: “దుష్యంతుడు-శకుంతల కథ నేటి తరానికి మేలుకొలుపు” వివరించండి. (20 marks)
Q2b. కింది ప్రశ్నల్లో రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: తిక్కన కవిత్వంలో ధర్మం, న్యాయం, రాజనీతి భావజాలాన్ని నేటి పరిస్థితితో సమన్వయించండి. (20 marks)
Q2c. కింది ప్రశ్నల్లో రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: శతక లక్షణాలను ‘ఆంధ్ర నాయక శతకం’తో అన్వయించండి. (10 marks)
Q3a. కింది ప్రశ్నల్లో మొదటి రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: ‘గుణనిధి కథ’ నేటి సమాజానికిచ్చే సందేశమేమి? (20 marks)
Q3b. కింది ప్రశ్నల్లో మొదటి రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: శాలీనుడితో సుగాత్రి తన దాంపత్యాన్ని సరిదిద్దుకున్న తీరు నేటి తరానికి ఎలా ఆవశ్యకమో తెల్పండి. (20 marks)
Q3c. కింది ప్రశ్నల్లో మొదటి రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: ‘అవతారిక’ ఆధారంగా తెలుగు కవిత్వం గురించి మొల్ల వెలువరించిన అభిప్రాయాలను తెల్పండి. (10 marks)
Q4a. కింది ప్రశ్నల్లో మొదటి రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: “ఆంధ్ర నాయక శతకం” లోని పౌరాణికాంశాలను వివరించండి. (20 marks)
Q4b. కింది ప్రశ్నల్లో మొదటి రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: ‘దుష్యంత చరిత్ర’ ఆధారంగా నన్నయ కవితా రీతులను వివరించండి. (20 marks)
Q4c. కింది ప్రశ్నల్లో మొదటి రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: ‘శ్రీకృష్ణరాయబారము’ ఆధారంగా కృష్ణుని దౌత్యవిధానాలను నేటి అంతర్జాతీయ రాజకీయాలతో అన్వయించండి. (10 marks)
Q5a. ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: విశ్వనాథ సత్యనారాయణ తెలెగు తల్లులు తమ పిల్లలకు శౌర్యరసాన్ని ఉగ్గు పాలతో రంగరించి పోసిన తీరును వివరించండి:
వేఁగి రాజ్యపు పల్లె వీధుల చెడుగుళ్ల
రిపులఁ గవ్వించు నేరుపులు తెలిసి
ఎగురు గోడీబిళ్ల సొగసుల్లో రిపుశిర
స్సుల బంతులాడు శిక్షలకు డాసి
చెఱ్ఱాడి యుప్పు తెచ్చిన నాడె శాత్రవ
వ్యూహముల్ పగిలించి నొఱపు గఱచి
కోతి కొమ్మచ్చిలో కోటగోడల కెగఁ
బ్రాకి లంఘించు చంక్రమణ మెఱిఁగి
తెనుఁగు లంతప్పై యవి నేర్చుకొనియయుందు
రెన్నగాఁ దెల్గుతల్లులు మున్ను శౌర్య
రస మొడిచి యుగ్గుబాలతో రంగరించి
బొడ్డుకోయని కూనకే పోయుదురట (10 marks)
Q5b. ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: ఈ క్రింది గేయంలోని ప్రకృతి స్వభావాన్ని తెల్పి, వాటి సంరక్షణకై మన బాధ్యతలేమిటో వివరించండి:
సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబుపారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?
మావిగున్న కొమ్మను మధుమాసవేళ
పల్లవము మెక్కి కోయిల పాడుటేల?
పరుల తనియించుటకో? తన బాగు కొరకో?
గాన మొనరింపక బ్రతుకు గడవ బోకో? (10 marks)
Q5c. ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: ఈ గేయం ద్వారా శ్రీశ్రీ యువత సోమరితనాన్ని పటాపంచలు చేసిన తీరును తెల్పండి:
పదండి ముందుకు !
పందండి త్రోసుకు !
పోదాం, పోదాం, పైపైకి !
ఎముకలు క్రుళ్ళిన,
వయస్సు మళ్ళిన
సోమరులారా ! చావండి !
నెత్తురు మండే,
శక్తులు నిండే,
సైనికులారా ! రారండి ! (10 marks)
Q5d. ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: ఈ పద్యంలో జాషువా లోకం పోకడను గూర్చి వాపోయిన విధానాన్ని విశదీకరించండి:
ప్రతిమల పెండ్లిసేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుః
ఖిత మతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్పదీ భరతమేదిని ముప్పది మూడు కోట్లదే
వత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తు లాఱునే (10 marks)
Q5e. ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: రాణి, లకుమతో తన ఆర్ద్రతను వెల్లడించిన విధం నేటి యువతకు సందేశాత్మకం ఎలానో వివరించండి:
నిన్ను రాయలు కన్నులందున
నిల్పినందుకు పరితపించను
కాని దేశమ్మును తృణమ్మటు
కాల ద్రోయుట ఎట్లు సైతును?
దేశ మొక దెస నీవు ఒక దెస
తేల్చుకొను మెయ్యది ఘనమ్మో
వ్యక్తి సంఘములందు ఎయ్యది
ప్రథమ గణ్యమొ చెప్పవమ్మా ! (10 marks)
Q6a. మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: “గురజాడ కథలు ఆధునిక సమాజ సంస్కరణకు పునాదులు” వివరించండి. (20 marks)
Q6b. మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: ‘అల్పజీవి’ కథానాయకుడి పాత్ర ద్వారా యువత నేర్చుకోదగ్గ అంశాలేమిటి? (20 marks)
Q6c. మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: ‘మహా ప్రస్థానం’ యువ చైతన్యానికి మార్గదర్శి ఎట్లో విపులీకరించండి. (10 marks)
Q7a. మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: ‘శారద లేఖలు’ సంఘచైతన్యానికి, ఆధునిక సమాజానికి ఏవిధంగా పునాదులు వేశాయో విశ్లేషించండి. (20 marks)
Q7b. మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: ‘ఆంధ్ర ప్రశస్తి’ లోని చారిత్రక, సాంస్కృతికాంశాలను వివరించండి. (20 marks)
Q7c. మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: ‘గబ్బిలం’ లోని జాషువా ఆవేదనను వ్యక్తీకరించండి. (10 marks)
Q8a. మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: కుటుంబ, ఉద్యోగ సమతౌల్యాన్ని సాధించదంలో ‘ఎన్.జి.ఒ.’ నాటకం ఇచ్చే సందేశం ఏమిటి? (20 marks)
Q8b. మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: ‘కర్పూర వసంత రాయలు’ ‘భావుకతకు ప్రతీక’ విశ్లేషించండి. (20 marks)
Q8c. మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానం రాయండి: ‘కృష్ణపక్షం’ లోని కాల్పనిక కవితా తత్వాన్ని (Romanticism) వివరించండి. (10 marks)
Spotted something wrong?
If a question is in the wrong unit or a match looks wrong, please report an error.
Related: Overall Telugu Literature PYQ analysis · Year-wise question papers · Topic-wise PYQs

