Menu Close

విభాగం ఎ: ప్రాచీన కావ్యాలు – Telugu Literature Optional PYQs (Paper II, Unit 1)

Here are all 228 questions on విభాగం ఎ: ప్రాచీన కావ్యాలు asked in UPSC Telugu Literature Optional Paper II (2009–2026), arranged under the 6 topics of this unit. Within each topic the latest questions come first.

Each question ends with a code such as [2024/15m/3b] – the year, the marks, the word limit (where UPSC set one) and the question number in the paper.

Topic-wise weightage graph of విభాగం ఎ: ప్రాచీన కావ్యాలు, Telugu Literature Optional Paper II
Topic-wise weightage of విభాగం ఎ: ప్రాచీన కావ్యాలు (Telugu Literature Optional Paper II) – share of marks asked from each topic.

1.1] నన్నయ

45 questions

  1. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ కింది పద్యంలోని వస్తువు ఆధారంగా నైతిక విలువలను విశ్లేషించండి:
    విమల యశోనిధీ పురుష వృత్త మెఱుంగుచునుండుఁ జూవెవే
    దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్
    యముఁడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు నన్మహాపదా
    ర్థము లివి యుండగా నరుఁడు దక్కొన నేర్చునె తన్నుమ్రుచ్చిలన్. [2026/10m/1a]

  2. కింది ప్రశ్నల్లో రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: “దుష్యంతుడు-శకుంతల కథ నేటి తరానికి మేలుకొలుపు” వివరించండి. [2026/20m/2a]

  3. కింది ప్రశ్నల్లో మొదటి రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: ‘దుష్యంత చరిత్ర’ ఆధారంగా నన్నయ కవితా రీతులను వివరించండి. [2026/20m/4b]

  4. ఈ క్రింది పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించని వ్యాఖ్యాన రాయండి: ఈ క్రింది పద్యమాధారముగా నాటి సామాజిక స్థితిని వర్ణించండి:
    నరనుత ! నీ ప్రసాదముననా కుదయించిన నందనున్ మహో
    గురుతర యోవరాజ్యమునకున్ దయతోనభిషిక్తుఁజేయఁగా
    వరము ప్రసన్నబుద్ధి ననవద్యముగా దయసేయునెమిమ్మితో
    నిరుపమదాన ! యట్లయిన నీకును నాకును సంగమంబగున్. [2025/10m/1a]

  5. మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: దుష్యంత చరిత్రమాధారంగ నన్నయ కవితా గుణాలను విశ్లేషించండి? [2025/20m/2a]

  6. మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త గాను సమాధానాలు రాయండి: దుష్యంతునికి శకుంతలకు మధ్య జరిగిన సంభాషణా వైచిత్రిని సమీక్షించండి? [2025/10m/4c]

  7. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ కింది పద్యంలోని వాగ్వైభవ వైచిత్రిని, అక్షర రమ్యతను విశదీకరించండి:
    విపరీత ప్రతి భాష లేమిటికి నుర్వీనాథ ! యీ పుత్రగా
    త్ర పరిష్వంగము సేకొనుము ముక్తాహార కర్పూర సాం
    ద్ర పరాగ ప్రసరంబు జందనము జంద్ర జ్యోత్స్నయు బుత్రగా
    త్ర పరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబె కడున్ శీతమే. [2024/10m/1a]

  8. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: భారతీయ సనాతన ధర్మాన్ని దుష్యంత చరిత్ర ద్వారా కవి ఏవిధంగా ఆవిష్కరించాడు. [2024/20m/2a]

  9. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: “ఇవియేనును సతతంబు నాకు కడునిష్టంబులైయుండు” అని నన్నయ పేర్కొన్న రాజరాజ నరేంద్రుని అభీష్టాలను విపులీకరించండి. [2024/10m/7c]

  10. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పద్యంలోని ఆపత్కాల మనస్తత్వ చిత్రణను విశ్లేషణ చేయండి:
    ‘తడయక పుట్టినాఁడ తల్లిచేఁదండ్రిచేవిడువఁ
    బడితి నిప్పుడు పతిచేతను విడువఁబడియెద నొక్కో !
    నుడువులు వేయునింకేల? యిప్పాటి నోములు తొల్లి
    కడఁగి నోఁచితిని గాకేమి’ యనుచును గందెడెందమున. [2023/10m/1a]

  11. దుష్యంతుని చరిత్ర పాఠం ఆధారంగా శకుంతల మూర్తిమత్వాన్ని విపులీకరించండి. [2023/20m/3a]

  12. దుశ్యంతోపాఖ్యానంలో దర్శించిన నానారుచిరార్థసూక్తినిధిత్వాన్ని వివరించండి? [2023/20m/4b]

  13. ఈ క్రింది పద్యభాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ పద్యంలోని విశేషాంశాలను తెలపండి:
    నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత
    వ్రత ! యొక బావి మేలు; మఱి బావులు నూఱిటికంటె నొక్క స
    త్క్రతువది మేలు; తత్క్రతు శతంబున కంటె కుతుండు మేలు; త
    త్సుత శతంబుకంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్. [2022/10m/1a]

  14. శకుంతల దుష్యంతుల ఇతివృత్తంలో నన్నయ సాధించిన కావ్య ప్రయోజనాన్ని వివరించండి. [2022/20m/2a]

  15. ‘దుష్యంత చరిత్ర’లో నన్నయ ప్రతిపాదించిన ‘సత్యనిష్ఠ’ప్రాధాన్యాన్ని తెలియజేయండి. [2022/10m/4c]

  16. ఈ క్రింది పద్యంలోని వస్తు రసభావశిల్పాలను వ్యాఖ్యానించండి:
    ఇదిమునినాథకన్యయనియెంతయునిస్పృహవృత్తినున్ననా
    హృదయమురాజపుత్రివనియిక్కమలాక్షినిజాభిజాత్య సం
    పదవైఱేఁగించివన్ మదన బాణపరంపర కిప్పుడుండనా
    సృదమయి సంచలించెనళిపాతవికంపిత పంకజాకృతిన్ [2021/10m/1a]

  17. దుష్యంత చరిత్రలో నన్నయ గారి ప్రసన్నకథాకవితార్థయుక్తిని వివరించండి. [2021/20m/2a]

  18. దుష్యంతుని ఆస్థానంలోని శకుంతల ప్రసంగం నేటి ఆధునిక స్త్రీకి కలిగించే స్ఫూర్తిని విశ్లేషించండి. [2021/20m/4b]

  19. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ క్రింది పద్యంలోని భావి కథార్థవ్యంజకమైన భావాన్ని, అక్షర రమ్యతను ఆవిష్కరించండి:
    అతిరుచిరా గతుండయిన యాతనికిన్ హృదయప్రమోదమా
    తతముగ నవ్వనంబున లతాలలనల్ మృదులాసి లాప వ
    ర్జిత కుసుమాక్షతా వళులు సేసలు వెట్టిన యట్టిరైరి సం
    పత దళినీ నినాద మృదుభాషల దీవన లొప్ప నిచ్చుచున్ [2020/10m/1a]

  20. దుష్యంత చరిత్రలో నన్నయ గారి నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము ఎంత వరకు సార్థకమైనదో విశదీకరించండి. [2020/20m/2a]

  21. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ క్రింది పద్యంలో మహాకవి ప్రసిద్ధ కవితాగుణాలు మూడింటిని ఆవిష్కరించండి:
    నరవర ! నీ ప్రసాదమున నా కుదయించిన నందనున్ మహీ
    గురుతర యౌవరాజ్యమునకున్ దయతో నభిషిక్తుఁ జేయఁగా
    వరము ప్రసన్నబుద్ధి ననవద్యముగా దయసేయు నెమ్మితో
    నిరుపమకీర్తి ! య ట్లయిన వీకును నాకును సంగమం బగున్. [2019/10m/1a]

  22. శకుంతలా దుష్యంతుల ఆఖ్యానకం స్వయం సమగ్రమైన కార్యం వలె రూపొందిన తీరును అనుశీలించండి. [2019/20m/2b]

  23. మీ దృష్టిలో దుష్యంతోపాఖ్యానము – శకుంతలో పాఖ్యానము అన్న శీర్షికలలో ఏది సమంజసమో కథాస్వరూపాన్ని బట్టి నిర్ణయించండి. [2019/20m/4b]

  24. ఈ క్రింది పద్యభాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ క్రింది పద్యంలోని రూపకాలంకార ఔచిత్యాన్ని విశ్లేషించండి:
    వనజ భవప్రభావుడగు వాని వసిష్ఠునపత్య శోకము
    వ్యసన నిధిలోన ముంచిన యవారిత సత్వుడు విస్ఫు[?] దొట్టియా
    యనిమిషులెల్లవానికి భయం పడుచుండు రట్టియుగ్ర కో
    పనుకడకిప్పుడేగుమని పొడియె యుప్పని నన్నుఁ బంపగన్ [2018/10m/1a]

  25. మూలభారతంలో లేని ఏయే కల్పనలు దుష్యంత చరిత్రకు వన్నె తెచ్చినవో చర్చించండి. [2018/20m/2a]

  26. దుష్యంతుడి పాత్ర చిత్రణంలోని వైరుధ్యాలను చర్చించండి. [2018/20m/4a]

  27. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యంలోని రసానుగుణాన్ని పరిశీలించండి.
    అమ్ముని యల్గి చూచుడును నా క్షణ మాత్రన గోత్ర ధారుణీ
    ధ్రమ్ములు వ్రయ్యు నయ్యిసుము దక్కఁగ నంబుధు లింకు మూఁడులో
    క మ్ములు దిర్దిరం దిరుగు గాడ్పు చలింపఁగ నోడు నుగ్రతం
    బమ్మిన యట్టి కోప పరుపాలికి భామలు వోవ నోడరే [2017/10m/1a]

  28. దుష్యంతుని పాత్రకు ప్రసన్నతను చేకూర్చటానికి నన్నయ అనుసరించిన కథాకథన శిల్పాన్ని వివరించండి. [2017/20m/3a]

  29. ఈ క్రింది పద్యాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యంలోని భావజాలం ఈ కాలానికి సరిపడేదేనా? వ్యాఖ్యానించండి.
    ఎట్టి సాధ్వులకును బుప్పిన యిండ్లను! బెద్దకాలమునికి తద్ద తగదు;
    పమలకడన యునికి సతులకు ధర్మువు; సతుల కేడుగడయుఁ బతుల చూవె [2016/10m/1a]

  30. దుష్యంత చరిత్రలో శకుంతల వ్యక్తిత్వ విశిష్టతను వివరించండి. [2016/20m/2a]

  31. దుష్యంతుడి ప్రవృత్తిలోని పిత్రస్వామిక రాచరిక స్వభావాన్ని వివరించండి. [2016/10m/3c]

  32. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యంలో స్త్రీ మానసిక వేదనలో సమాజ స్వరూపాన్ని పరిశీలించండి.
    ‘తడయక పుట్టిన నాఁడ తల్లిచేఁ దండ్రిచే విడువఁ
    బడితి; నిప్పుడు పతి చేతను విడువఁ బడియెద నొక్కొ!
    నుడువులు వేయు నింకేల? యిప్పాటి నోములు తొల్లి
    కడఁగి నోఁచితిని గా కేమి’ యనుచును గుందె డెందమున. [2015/10m/1a]

  33. మేనక, శకుంతల పాత్రల ప్రతిఘటనను విశ్లేషించండి. [2015/20m/2b]

  34. దుష్యంతుని మనస్తత్వాన్ని విశ్లేషించండి. [2015/10m/4c]

  35. ఈ క్రింది పద్యభాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యాన్ని ఔచిత్య సౌందర్య దృష్టితో విశ్లేషించండి:
    అనిమేషకాంతయున్ నవలతాంత విభూషణ తీల నల్లన
    ల్లన వనకేళి లాలస విలాస గతింజనుదెంచి ముందటన్
    గనియె మహాముని ప్రవరుఁ గౌశికుఁ గౌశిక చిత్తభీతిసం
    జనన మహాతపశ్చరణ సంయత చిత్తు నిరస్త చిత్తజున్ [2014/10m/1a]

  36. దుష్యంత చరిత్రలో నన్నయ చేసిన వినూత్న కల్పనలను వివరించండి. [2014/20m/2a]

  37. ‘అందరూ విధికి లోబడిన వారే’ – దుష్యంత చరిత్ర మాధారంగా విశ్లేషించండి. [2014/10m/2c]

  38. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి:– క్రింది పద్యాన్ని సౌందర్య కళాదృష్టితో వివేచించండి:–
    అతిరుచిరాగతుం డయిన యాతనికిన్ హృదయ ప్రమోద మా
    తతముగ నవ్వనంబున లతాలలనల్ మృదులానిలాప వ
    ర్జిత కుసుమాక్షతావళులు సేసలు వెట్టినయట్టిరైరి సం
    పత దళినీ నినాద మృదుభాషల దీవన లొప్ప నిచ్చుచున్. [2013/10m/1a]

  39. రాచరిక వ్యవస్థకు ప్రతినిధి దుష్యంతుడు – చర్చించండి. [2013/25m/2a]

  40. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి:- క్రింది పద్యాన్ని సామాజిక దృష్టితో వివరించండి:
    నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటే సూనృత
    వ్రతః యొక బావి మేలు: మరి బావులు నూఱిటికంటె నొక్కస
    త్క్రతువది మేలు: తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు: త
    త్సుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు సూడఁగన్. [2012/12m/1a]

  41. “మూలంలో లేని కొన్ని కల్పనలను తెలుగులో కొత్తగా చేసి, దుష్యంత చరిత్ర కథకు ప్రసన్నతను కలిగించటంతోపాటు వ్యంగ్యార్థ యోజనంతో వస్తుధ్వనిని నన్నయ సాధించాడు.”
    ఈ వాక్య సారాంశాన్ని సోదాహరణంగా విశ్లేషించండి. [2012/30m/2a]

  42. ఈ క్రింది పద్యభాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: కింది పద్యాన్ని సామాజిక దృష్టితో వివరించండి:
    విపరీత ప్రతిభాష లేమిటికి నుర్వీనాథ యీపుత్త్రగా
    త్ర పరిష్యంగ సుఖంబు సే కొనుము ముక్తాహార కర్పూరసాం
    ద్రపరాగ ప్రసరంబుఁజం దనముఁజంద్ర జ్యోత్స్నయుం బుత్త్రగా
    త్రపరిష్యంగమునట్లుజీవులకు హృద్యంచే కడున్ శీతమే [2011/20m/1a]

  43. దుష్యంతుడి గుణ, వర్తనలను సవిమర్శకంగా పరిశీలించండి. [2011/30m/2b]

  44. ‘నానారుచి రార్థ సూక్తినిధి నన్నయ్య’ ఎట్లు? మీ పాఠ్యాంశం ఆధారంగా వివరించండి. [2010/60m/3]

  45. క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి:- కళాసౌందర్య (Aesthetic) దృక్పథంతో విమర్శించండి:-
    ఆ దుష్యంతు డనంత సత్త్వుఁడు సమస్తాశాంత మాతంగ మ
    ర్యాదాలంకృత మైన భూవలయ మాత్మాయత్త మై యుండఁగా
    నాదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో
    నాదిక్షత్త్ర చరిత్ర నేలె నజితుండై బాహువీర్యంబునన్. [2009/20m/1a]

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

1.2] తిక్కన

43 questions

  1. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ కింది పద్యంలోని ధ్వని గర్భిత శబ్ద వాక్య ప్రయోగాలను వివరించండి:
    వచ్చినవాడు ఫల్గునుఁడవశ్యము గెల్తు మనంగరాదురా
    లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే?
    హెచ్చగుఁ గుందగుందొడరుటెల్ల విధంబుల కోర్చుటట్లుగా
    కిచ్చఁ దలంచి యొక్కమెయి నిత్తఱిఁ బొందగుచేఁతయుందగున్. [2026/10m/1b]

  2. కింది ప్రశ్నల్లో రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: తిక్కన కవిత్వంలో ధర్మం, న్యాయం, రాజనీతి భావజాలాన్ని నేటి పరిస్థితితో సమన్వయించండి. [2026/20m/2b]

  3. కింది ప్రశ్నల్లో మొదటి రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: ‘శ్రీకృష్ణరాయబారము’ ఆధారంగా కృష్ణుని దౌత్యవిధానాలను నేటి అంతర్జాతీయ రాజకీయాలతో అన్వయించండి. [2026/10m/4c]

  4. ఈ క్రింది పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించని వ్యాఖ్యాన రాయండి: ఈ కింది పద్యంలో ధర్మరాజు సూచించిన దూత లక్షణాలను వివరించండి:
    మనమునబక్షపాతగతి మాదెసమానుము ధర్మనీతి వ
    ర్తనముల రెండు దిక్కుల హితంబును బెంపును గల్గునట్టి చొ
    ప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రానుచితంబుతోడిమె
    ల్పునఁబరుసందనంబునను భూపతులెల్ల నఱుంగ నాడుమీ [2025/10m/1b]

  5. మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: శ్రీకృష్ణ రాయబారములో తిక్కన చూపిన రాజకీయ కోణమును ఆధునిక రాజకీయాలతో పోల్చి వివరించండి. [2025/20m/2b]

  6. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ కింది పద్యంలో గూఢ, మర్శ, వ్యంగ్యోక్తులను కవి ఏవిధంగా ఆవిష్కరించాడో వివరించండి:
    ఏ నిటులంటి నా వలవ; దింకను నీవును రాజు దమ్ములుం
    గా నుచితంబు చూచి మన కార్యము మీ సుజనత్వముం జెడం
    గా నొక భంగి సేయక తగం గురు వర్గము తోడి సంధి మీ
    కైన తెఱంగునన్ వలచినట్టుల చేయుడు నేర్పు లేర్పడన్ [2024/10m/1c]

  7. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ద్రౌపది మానసిక భావోద్వేగాలను, అమె వాగ్వైభవాన్ని కవి ఏ విధంగా చిత్రీకరించాడు. [2024/20m/3a]

  8. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: కృష్ణరాయబారంలోని దౌత్యసూత్రాలను నేటి రాజకీయ దౌత్య విధానాలతో అన్వయించి విశ్లేషించండి? [2024/20m/4b]

  9. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పద్యంలోని రసధ్వనిని, భావశిల్పాన్ని వ్యాఖ్యానించండి:
    పాండవ కౌరవుల్ గలసి పాలును నీరునుబోలెనెమ్మి మై
    నుండఁగ దుష్టచేష్టల సుయోధనుఁడింతలు సేసి నాతఁడొ
    క్కండ కులక్షయంబునకుఁగారణ మండ్రదిదప్పదైన నీ
    వొండన నేల యా బిరుదువోసిన యంతయుఁదీర్పు నేర్పునన్ [2023/10m/1b]

  10. కింది ప్రశ్నలలో మొదటి రెండింటికి వ్యాసరూప సమాధానములను మూడవ ప్రశ్నకు సంక్షిప్త సమాధానములను రాయండి: శ్రీకృష్ణ రాయభారం కథను నేటి భారత విదేశీ రాయబారాలకు అనువర్తించండి? [2023/20m/2a]

  11. ఈ క్రింది పద్యభాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ పద్యంలోని అర్థప్రాఢిని వివరించండి:
    వరమున బుట్టితిన్, భరత వంశంబు జొచ్చితి, నందు బొండు భూ
    వరునకుఁ గోడలైతి జనవంధ్యుల బొందితి, నీతి విక్రమ
    స్థిరులగు పుత్రులం బడసితిన్, సహజన్ముల ప్రాపు గాంచితిన్
    సరసిజనాభ ! యిన్నిటఁ బ్రశస్తికి నెక్కినదాన నెంతయున్. [2022/10m/1b]

  12. ద్రౌపది తనకు జరిగిన పరాభవాన్ని కృష్ణునితో నివేదించిన తీరును వివరించండి. [2022/20m/2b]

  13. ద్రౌపది పరివేదనను వ్యక్తీకరించడంలో స్త్రీ మనస్తత్వం ఆవిష్కరింపబడిన తీరును తెలపండి. [2022/10m/3c]

  14. ఈ కింది పద్యంలోని నాటకీయశిల్పాన్ని వివరించండి:
    “ద్రోవది బంధురంబయిన క్రొమ్ముడి గ్రమ్మనవిడ్చి వెంద్రుకల్
    దావలచేతఁబూని యసితచ్ఛవిఁబొల్చుమహాభుజంగమో
    నావిలసిల్లి వ్రేలఁగ మనంబునఁబొంగు విషాదరోషవముల్
    గావఁగలేకబాష్పములుఁగ్రమ్మగదిగ్గన వేచి యార్తయై” [2021/10m/1b]

  15. శ్రీకృష్ణరాయబార ఘట్టంలోని నాటకీయ శిల్పాన్ని వివరించండి. [2021/20m/3a]

  16. శ్రీకృష్ణ రాయబారంలో తిక్కన ప్రతిపాదించిన రాజకీయకోణాన్ని విశదీకరించండి. [2021/10m/4c]

  17. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ కింది పద్యంలోని వాక్యరచనా శిల్పాన్ని, శబ్ద ప్రయోగ వైచిత్రిని వివరించండి:
    పగ యడగించు టెంతయు శుభం, బదిలెస్స, యడంగునే పగం
    బగ? వగ గొన్న మార్కొనక పల్కక యుండగా వచ్చునే? కడుం
    దెగ మొదలెత్తే పోవఁ బగ దీర్పగ వచ్చిన గ్రౌర్యమొందు, నే
    మిగతి దలంచినం బగకు మేలిమి లేమి ధ్రువంబు గేశవా ! [2020/10m/1b]

  18. శ్రీకృష్ణరాయబారంలో తిక్కన ప్రదర్శించిన పాత్రల మానసిక సంఘర్షణలను విశ్లేషించండి. [2020/20m/2b]

  19. శ్రీకృష్ణ రాయబార ఘట్టం ద్వారా తిక్కన భారతీయ తత్త్వాన్ని ఆవిష్కరించిన తీరును సమీక్షించండి. [2020/10m/4c]

  20. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: కావ్యశిల్పంలోని అర్థప్రౌఢిని ఈ పద్యముఖంగా వివరించండి:
    తుది రాజ్యమ్ము సగమ్ము గొః, మ్మటవియందుం, బేరు వంచించియుం,
    బదు మూఁడేడులు నీవునుం దిరిగిరాఁ బాలీకపోవచ్చునే?
    యది గాదేఁ దెగి బంటవై యఱుము మాయల్ వన్ను నేర్పింకఁ జె
    ల్లదుసూ నీ కని యా సుయోధనుని యుల్లం బుచ్చిపోనాడుమీ ! [2019/10m/1b]

  21. శ్రీ కృష్ణుని రాయబారం సన్నివేశంలోని భారత రాజకీయాదర్శాలను సమీక్షించండి. [2019/20m/3a]

  22. శ్రీకృష్ణ – పాండవ సంభాషణలలో అభివ్యక్తములైన దూత యొక్క లక్షణాలను పరిశీలించండి. [2019/10m/3c]

  23. ఈ క్రింది పద్యభాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ క్రింది పద్యంలోని విశేషాంశములను వివరించండి:
    యుద్ధము మీఁది వేడ్కయు మహోగ్ర విరోధుల నల్కతీయుడ[?]
    ర్కోద్ధతియున్ సుయోధనుని యున్నతి సైపనియేపు రజ్య సం
    సిద్ధి నిజాగ్రజన్మునకుఁ జేయు తలంపును గల్గి నీవు సం
    బద్ధములైన వాక్యములు పల్కుట యొప్పునె కీచకాంతకా [2018/10m/1b]

  24. శ్రీకృష్ణరాయబార ఘట్టంలో ధర్మరాజు వాక్ చాతుర్యాన్ని వివరించండి. [2018/20m/3a]

  25. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యంలో స్ఫురించే రాజనీతిని విశ్లేషించండి.
    వచ్చిన వాఁడు ఫల్గునుఁ డవశ్యము గెల్తు మనంగ రాదు; రా
    లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వ నేర్చునే;
    హెచ్చగుఁ గుందగుం; దొడరు టెల్ల విధంబుల కోర్చు టట్లుగా,
    కిచ్చఁ దలంచి యొక్క మెయి నిత్తఱిఁ బొందగు చేఁతయుందగున్. [2017/10m/1b]

  26. శ్రీకృష్ణ రాయబారంలో ద్రౌపది పాత్రను పోషించటంలో కవి చూపిన మెళకువలను వివరించండి. [2017/10m/2c]

  27. తిక్కన తీర్చిన శ్రీకృష్ణరాయబారంలోని నాటకీయతను అనుశీలించండి. [2017/20m/4a]

  28. ఈ క్రింది పద్యాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యంలోని ‘ధ్వని’ విశేషాలు వివరించండి.
    అంతలుసేసిపోనడచి యక్కట సంజయు చేతఁ జెప్పిపు
    తైంతురె? యిట్టి యూఱట మదింబ్రియ మందె యుధిష్ఠిరుండు దా
    నంతన యూళులేవురకు నైదు సుయోధనుఁ డిచ్చు నొక్కా? యీ
    కంత కృపావిహీనమతి నాతఁడు నొంచునె యన్నదమ్ములన్? [2016/10m/1b]

  29. ‘కృష్ణరాయబారం’ లో యుద్ధం గురించి ధర్మరాజు దృక్పథం ఏమిటో వివరించండి. [2016/20m/3a]

  30. కృష్ణ రాయబారంలోని ద్రౌపది ఉపన్యాస శిల్ప విశిష్టతను వివరించండి. [2016/20m/4b]

  31. శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో ద్రౌపది ఆవేదనను, కృష్ణుని ఓదార్పులోని ఔచిత్యాన్ని చర్చించండి. [2015/20m/2a]

  32. ఆంధ్ర మహాభారతంలో శ్రీకృష్ణ రాయబార ప్రాముఖ్యాన్ని విశదపరచండి. [2015/20m/4a]

  33. ఈ క్రింది పద్యభాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యాన్ని మనస్తత్వ దృష్టితో వివేచించండి:
    పగయడఁ గించు టెంతయు శుభం బదిలెస్స; యడంగునే పగం
    బగఁ బగగొన్న మార్కొనక పల్కక యుండగ వచ్చునే? కడుం
    దెగ మొదలెత్తి పోఁ బగ దీర్పఁగ వచ్చినఁ గ్రౌర్యమొందు; నే
    మి గతిఁ దలంచినంబగకు మేలిమి లేమి ధ్రువంబుగేశవా! [2014/10m/1b]

  34. పాండవుల రాయబారిగా శ్రీకృష్ణుడినే ఎంపిక చేయడాన్ని వివేచించండి. [2014/20m/2b]

  35. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి:– క్రింది పద్యంలోని నిర్మాణ, అలంకార ధ్వని విశేషాలను పరిశీలించండి:–
    వెరవున లావునం గృషికి వేయి విధంబుల మేలొనర్చినం
    దొరకొనునే ఫలంబు? తఱితోఁదగు వర్షము లేకయున్న; నె
    ప్పరుసున లెస్స సేసినను బౌరుషముల్ ఫలియించుటెల్ల నా
    దీరణమునం బ్రసన్నమగు దైవముచేతన చూవె ఫల్గుణా! [2013/10m/1b]

  36. తిక్కన తీర్చిన రాయబార సంవాద శైలిపై అభిప్రాయాలను వివరించండి. [2013/25m/2b]

  37. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి:- క్రింది పద్యాన్ని నిర్మాణ శిల్ప దృష్టితో వివరించండి:-
    “అక్కట లాతులైనఁ బగఱైనను జంపన కోరనేల? యెం
    డొక్క తెలుంగు లేదె? యది యెప్పుడె? బంధు సుహృజ్జనంబులా
    దిక్కున నున్నవారు; గణుతింపక సంపదకై వధించి వా
    ఱెక్కులు దోషమందుటను నీదురవస్థల కోర్వవచ్చునే?” [2012/12m/1d]

  38. తిక్కన తీర్చిన ‘శ్రీకృష్ణ రాయబారం’లోని విశిష్టతను భిన్న కోణాలతో విశదం చేయండి. [2012/30m/2b]

  39. ద్రౌపది వృత్తాంతం ఆధారంగా తిక్కన మనస్తత్త్వ చిత్రణలోని వైశిష్యాన్ని వివరించండి. [2011/30m/3a]

  40. ఈ క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి: పాత్రమనస్తత్వానుగుణ (Psychological) దృక్పథంతో విమర్శించండి.
    ద్రోపది బంధురం బయిన కొమ్ముడి గ్రమ్మనవిడ్చి, వెండ్రుకల్
    దావల చేతఁబూని, యసితచ్ఛవిఁబొల్చుమహా భుజంగమో
    నావిల సిల్లివ్రేలగ, మనంబునఁబొంగువిషాదరోషముల్
    గావగలేక భాష్పములుగ్రమ్మగ, దిగ్గున లేచియార్తయై [2010/20m/1a]

  41. ‘తిక్కన నానారసాభ్యుదయోల్లాస’ ఎట్లు? మీ పాఠ్యాంశం ఆధారంగా వివరించండి. [2010/60m/2]

  42. క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి:- పాత్ర మనస్తత్వానుగుణ (Psychological) దృక్పథంతో విమర్శించండి:-
    ఈ వెండ్రుకలు పట్టి యీడ్చిన యాచేయి
    తొలుతగాఁ, బోరిలో దుస్ససేను
    తనువింతలింతలు దునియలై చెదరి రూ
    పతియున్నఁ గని యుడుకాఱుఁగాక!
    యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చేయిది;
    పెనుగద పట్టిన భీమసేను
    బాహుబలంబును, బాటించి గాండేవ
    మను నొక విల్లెప్పుడును వహించు
    కఱ్ఱి విక్రమంబుఁ గాల్పనే? యట్లు బ
    న్నములు వడినఁ ధర్మనందనుండు
    నేను రాజరాజు పీనుంగుఁ గన్నారఁ
    గానఁ బడయనైతివేనిఁ గృష్ణఁ! [2009/20m/1b]

  43. శ్రీకృష్ణుని రాయబారాన్ని చిత్రించటంలో తిక్కన ప్రదర్శించిన నాటకీయతను సోదాహరణంగా వివరించండి. [2009/60m/2]

1.3] శ్రీనాథుడు

32 questions

  1. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ కింది పద్యంలోని గుణనిధి తల్లి మనోవేదనను చిత్రీకరించండి:
    విడువక నీవు పట్టణము వీధుల వీధుల వెఱ్ఱివాడవై
    చెడుగులఁ గూడి ధౌర్త్యములు సేయ మహీరమణుండెఱింగెనే
    విడుచును సోమయాజి మనువృత్తులు చేకొనునెల్ల భంగులన్
    జెడుదుము నీకతంబుననుఁ జీరయుఁగూడును లేక? పుత్రకా ! [2026/10m/1c]

  2. కింది ప్రశ్నల్లో మొదటి రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: ‘గుణనిధి కథ’ నేటి సమాజానికిచ్చే సందేశమేమి? [2026/20m/3a]

  3. ఈ క్రింది పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించని వ్యాఖ్యాన రాయండి: ఈ పద్యమునందలి శ్రీనాధునిరచనాచమత్కారాన్ని వివరించండి:
    అంగోద్వర్తనవేళనీవుదరహాసాంకూరము ల్లోచనా
    పాంగ ప్రాంతములం దిగుర్ప నొక సయ్యాటంబుఁగల్పించినా
    యంగు ళ్యాభరణంబు పుచ్చుకొనవా ! యాయుంగరంబిప్పుడే
    శృంగారింపనిచేతఁబావకునకున్ జేయన్ హవిర్దానమున్. [2025/10m/1c]

  4. మొదటి రెండింటికి వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోనూ సమాధానాలు రాయండి: మీపాఠ్యంశం ఆధారంగా గుణనిధి కథలోని వాస్తవికతను విశ్లేషించండి. [2025/20m/3a]

  5. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: గుణనిధి కథ ద్వారా కవి సమాజానికి తెలియజేయ దలచుకొన్న సందేశాన్ని వివరించండి. [2024/10m/2c]

  6. గుణనిధి కథాంశాన్ని నేటియువత పోకడలతో విశదపరచండి. [2023/20m/3b]

  7. గుణనిధి కథలోని కౌటుంబిక తాత్త్విక కోకాన్ని పరిశీలించండి? [2023/10m/4c]

  8. శ్రీనాథ మహాకవి కవితా వైభవాన్ని సోదాహరణంగా ప్రస్తుతించండి. [2022/20m/3a]

  9. గుణనిధి పాత్రచిత్రణ ద్వారా మహాకవి శ్రీనాథుడు ప్రబోధించిన భక్తితత్వాన్ని అభివర్ణించండి. [2022/20m/4b]

  10. ఈ కింది పద్యంలోని వ్యక్తమవుతున్న అస్తిత్వ దృక్కోణాన్ని వ్యాఖ్యానించండి:
    “అరుణగభస్తి బింబముద యాద్రిపయిం బొడ తేరగిన్నెవోఁ
    బెరుగును వంటకంబు వడపిందియలుం గుడువంగఁబెట్టుని
    ర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణముతల్లి యున్నదే?
    హరహర ! యెవ్వరింకఁగడుపారసి పెట్టెదరొప్పితాన్నముల్” [2021/10m/1c]

  11. గుణనిధికథలో శ్రీనాథుడు ప్రదర్శించిన పద్య నిర్మాణంలో భాగంగా రీతి సౌందర్యాన్ని విశ్లేషించండి. [2021/20m/2b]

  12. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ కింది పద్యంలోని అలంకార విశేషాలను సమీక్షించండి:
    పాటలాంశు జటాభార భాసురుండు
    భార్గవుడు వోలె నోలాడె భాస్కరుండు
    రాగరక్తచ్ఛటా నిర్ఝర ప్రపూర్ణ
    చరమ సంధ్యా శమంత పంచక నదముల [2020/10m/1c]

  13. గుణనిధి కథద్వారా శ్రీనాధుని వర్ణనా నైపుణ్యాన్ని ఆవిష్కరించండి. [2020/20m/3b]

  14. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: రసౌచిత్యదృష్టితో ఈ క్రింది పద్యంలోని తాత్త్వికతను సమన్వయించండి:
    స్థూలదృష్టి వీక్షించినఁ దోఁపకుండు
    సూక్ష్మదృష్టి వీక్షించినఁ జూడ్కి కందుఁ
    గాన శివభక్తిధర్మం బగాధమహిమ
    కానవచ్చినయ ట్లుండుఁ గానరాదు. [2019/10m/1c]

  15. గుణనిధి వ్యక్తిత్వ చిత్రణలో శ్రీనాధుని మనోవైజ్ఞానిక దార్శనికతను ఆవిష్కరించండి. [2019/20m/3b]

  16. ఈ క్రింది పద్యభాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ క్రింది పద్యంలోని వ్యంగ్యాన్ని విశ్లేషించండి:
    అశన మబ్బక యున్నదైనను శివరాత్రి
    యోరంత ప్రొద్దును నుపవసించె
    వేగిరంబు హరించ నోపనెట్టుకొనియైన[?]
    వేగునంతకుఁ జేసె జాగరంబు
    పాత్రావలోక నోపాయంబునకు నైన
    వెలనైన దీపంబు వెలగ జేసెఁ
    జూడ నొల్లక యైన జూచె నీశ్వరు మౌళిఁ
    బరులు చేసిన యట్టి ప్రణవపూజఁ
    జచ్చె విధిమూఢియైనను జంద్రధరుని
    నగరి మోసాలఁ బెంద్రోవ నల్లనడుము
    సూక్ష్మసృష్టి విచారించి చూచినప్పు
    డింత కంటెను ధర్మంబు లెవ్వి కలవు? [2018/10m/1c]

  17. గుణనిధి కథను ఆధారంగా చేసుకుని కాశీ ఖండము నాటి సామాజిక స్థితిగతులను సమీక్షించండి. [2018/20m/2b]

  18. గుణనిధి పాత్ర ఆధారంగా సామాజిక, తాత్విక భూమికలను పరిశీలించండి. [2017/20m/2a]

  19. గుణనిధి కథలో యజ్ఞదత్తుడు, సోమి దమ్మల వ్యక్తిత్వాలలో గల వైరుధ్యాన్ని విశదీకరించండి. [2017/20m/4b]

  20. ఈ క్రింది పద్యాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యాన్ని సౌందర్య కళాదృష్టితో, ఔచిత్య ద్రష్టితో సమీక్షించండి.
    పాటలాంశు జటాభార భాసురుండు
    భారవుఁడు వోలెనో లాడె భాస్కరుండు
    రాగరక్తచ్ఛటా నిర్ఝర ప్రపూర్ణ
    చరమ సంధ్యాశమంత పంచకనదముల [2016/10m/1c]

  21. గుణనిధి కథలోని తల్లి ఆరాటంలోని ఉచితాను చితాలను సమీక్షించండి. [2016/20m/2b]

  22. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యంలో పుత్రుని మానసిక సంక్షోభాన్ని కరుణరసాత్మక దృష్టితో విశ్లేషించండి.
    అరుణగభస్తి బింబ ముదయాద్రిపయిం బొడతేర గిన్నెలోఁ
    చెరుఁగును వంటకంబు వడపిందియలుం గుడువంగఁ బెట్టుని
    ర్భర కరుణాధురీణ యగు ప్రాణము ప్రాణము తల్లి యున్నదే?
    హర హర! యెవ్వరింకఁ గడుపారఁగ బెట్టెద రీప్సితాన్నముల్. [2015/10m/1b]

  23. సోమిదమ్మ పుత్ర వాత్సల్యాన్ని వ్యక్తీకరించండి. [2015/10m/3c]

  24. శ్రీనాథుడి విలక్షణ సృష్టి – గుణనిధి అను అంశాన్ని సమీక్షించండి. [2014/20m/3a]

  25. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి:– క్రింది పద్యాన్ని సామాజిక దృష్టితో అనుశీలించండి:–
    మరిచ ధూళీపాళి పరిచితంబులు మాఱి
    బంధాశ్మ లవణ పాణింధమములు
    బహుల సిద్ధార్థ జంబాల సారంబులు
    పటురామఠామోద భావితములు
    తింత్రిణీక రసోపదేశ ధూర్ధరములు
    జంబీర నీరాభి చుంబితములు
    హైయంగవీన ధారాభిషిక్తంబులు
    లలిత కుస్తుంబరూల్లంఘితములు
    శాకపాక రసావళీ సౌష్ఠవములు
    భక్ష్య భోజ్య లేహ్యంబులు పానకములు
    మున్నుగాఁగల యోగిరంబులు సమృద్ధి
    వెలయఁ గొనివచ్చె నొండొండ వివిధములను; [2013/10m/1c]

  26. గుణనిధి కథ మూలంగా ఆనాటి సామాజిక భూమికను విశ్లేషించి నేటికీ ఉపకరించే సందేశాన్ని గుర్తించండి. [2013/25m/3a]

  27. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి:- క్రింది పద్య భాగాన్ని మనస్తత్త్వ దృష్టితో వ్యాఖ్యానించండి:-
    సచ్ఛోత్రియులు సనూచానులు సోమపీ
    థులునైన కులము పెద్దలఁదలంచి
    రాజమాన్యుఁడు సత్యరతుఁడు వినిర్మలా
    చార వంతుఁడునైన జనకుఁదలఁచి
    భాగ్య సంపదఁ బుణ్య పతి దేవతలలోన
    నెన్నంగఁదగియెడు నన్నుఁదలఁచి
    వేద శాస్త్ర పురాణ విద్యా నిరూఢులై
    వాసి కెక్కిన తోడి వారిఁదలచి
    చెడ్డ యింటి చెదారమై శివుని కరుణ
    నివ్వటిలు నిర్వదేనేండ్ల నిన్నుఁదలఁచి
    పదియు నార్వత్సరంబుల భార్యఁదలఁచి
    గోర తనములు మానురా! కొడుకుఁగుజ్జ! [2012/12m/1b]

  28. “పాత్ర చిత్రణ ప్రవణమైన, సహజత్వ సాక్షాత్కరణ చరణమైన కవితాసుధ గుణనిధి కథ”-సమన్వయించండి. [2012/30m/3a]

  29. గుణనిధి కథలో కనిపించే శ్రీనాథుడి సంభాషణ రచనా కౌశలాన్ని వివరించండి. [2011/30m/2a]

  30. ఈ క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి: కళాసౌందర్య, ధ్వని (Aesthetic) దృక్పథంలో విమర్శించండి:
    స్వాధ్యాయమెన్నండుఁజదువంగఁబోయెకుండ?
    బోలునే చదువంగఁబోయెననుట?
    తెల్లవాఱగనీటఁదీర్థమాడక యుండ
    ననురూపమే తీర్థమాడెననుట?
    సమయానుకూలత సంధ్యవార్వక యుండ
    వైదగ్ధియే సంధ్యేవార్చె ననుట?
    తఱితోడనగ్నిహోత్రము వేల్వకుండగ
    విజ్ఞాన సరణియే వేల్చెననుట?
    కల్లలాడంగ ఫలమేమి కలిగెనీకు?
    మాటిమాటికి నేను నీమాటనమ్మి
    యరసిరక్షింపనేరకయనుఁగుగొడుకు
    భ్రష్టుఁజేసితినేమి చెప్పంగఁగలదు? [2010/20m/1b]

  31. గుణనిధీ తల్లి సోమిదమ్మపాత్రచిత్రణలో శ్రీనాథుడు పాటించిన రచనా రీతిని వివరించండి. [2010/60m/4]

  32. క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి:- చారిత్రక సామాజిక (Historical and Sociological) దృక్పథంతో విమర్శించండి:-
    దరిసెనం బిచ్చె నెద్దానిఁ గోమటి క్రొత్త
    పొడసూప నేతెంచి భూభుజునకుఁ
    దనకిచ్చె నెద్దాని ధారాంబు పూర్వంబు
    పుణ్యకాలము నాఁడు భూమిభర్త
    తానిచ్చె నెద్దాని ధర్మగేహిని యైన
    సోమిదమ్మకు మనఃప్రేమ మలరఁ
    దఱిచూచి యిచ్చె నెద్దానిఁ బట్టికిఁ దల్లి
    జూదమోడిన మైఁడి సుట్టికొనిన
    నట్టి నవరత్న మయమైన యంగుళీయ
    కంబు యజ్ఞావభృథ పుణ్యకర్మసాక్షి
    వీటిలో నొక్క జూదరి వ్రేల నుండఁ
    జూచెఁ గనుఱెప్ప వెట్టక సోమయాజి. [2009/20m/1c]

1.4] పింగళి సూరన

42 questions

  1. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ క్రింది పద్యంలోని పదప్రయోగ వైచిత్రిని తెల్పండి:
    ధళ ధళ మెఱపులు మెఱయఁగఁ
    బెళ పెళ నుఱుముచుఁ బెరిల్లు పెరిలునఁ బిడుగుల్
    నలుగడఁ బడ బెడిదపుధా
    రలుగలబలువాన జలధరంబులు గురిసెన్. [2026/10m/1d]

  2. కింది ప్రశ్నల్లో మొదటి రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: శాలీనుడితో సుగాత్రి తన దాంపత్యాన్ని సరిదిద్దుకున్న తీరు నేటి తరానికి ఎలా ఆవశ్యకమో తెల్పండి. [2026/20m/3b]

  3. ఈ క్రింది పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించని వ్యాఖ్యాన రాయండి: ఈ క్రింది పద్యమునందలి రసాభివ్యక్తిని విశ్లేషించండి:
    తు డిచినఁబోక మన్మథుని దుర్జనతా మహిమన్బొరింబొరిం
    బడఁతి మెఱుంగుచెక్కిళులఁ బర్వెడుఘర్మముఁగాంచియంతనా
    బడలిక చూడలేకిడుమపాట్లకుఁజొచ్చి నలంగితంచు నె
    క్కుడు తమకంబుతోడఁదలగ్రుచ్చికవుంగిటఁగూర్చెనత్తఱిన్ [2025/10m/1d]

  4. మొదటి రెండింటికి వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోనూ సమాధానాలు రాయండి: సుగాత్రీ శాలీనుల కథలోని ప్రణయ తత్వాన్ని వివరించండి. [2025/10m/3c]

  5. మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త గాను సమాధానాలు రాయండి: సుగాతీశాలీనుల కథాచిత్రణలో సూరన చూపిన నేర్పును వివరించండి? [2025/20m/4b]

  6. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: భారతీయ స్త్రీ హృదయంలోని భావావేశాలకు ప్రతీకగా కవి ఈ కింది పద్యాన్ని చిత్రీకరించిన తీరును వివరించండి:
    చిత్తము వేరొకర్తు పయి జేర్చి మరల్పగ నేరకేమొ మీ
    రత్తరళాక్షి దెచ్చుకొను దేయక నావశమైన బంపు డే
    దెత్తు నవశ్యమున్ మరియు దేవరకుంబలె నవ్యధూటి కిం
    దొత్తగుచున్ బనుల్ సలుపుదున్ నిజమాడెద దైవ సాక్షిగన్. [2024/10m/1d]

  7. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: సుగాత్రి శాలీనుల కథను మానసిక విశ్లేషణ దృక్పథంలో విశ్లేషించండి. [2024/20m/2b]

  8. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: కళాపూర్ణోదయ కావ్యంలో పింగళిసూరన చిత్రించిన సుగాత్రీశాలీనుల దాంపత్యః నేటి ఆధునిక దాంపత్యంతో తులనాత్మకంగా పరిశీలించండి. [2024/20m/4a]

  9. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పద్యంలోని సంభాషణా వైచిత్రిని వివరించండి:
    వరునకు నెద్దియింపది సువర్తనగాఁగఁ దదప్రియం బస
    చ్చరితము గాఁగఁ నెన్నుదు నిసర్గము నాకిది తూనిరాద యీ
    శ్వరుడును వేదమున్ గురుఁడు సర్వము భర్తయ యేదదాజ్ఞసు
    స్థిరమతిఁ జేయుచున్ విధినిషేధము లెవ్వియుఁ గై కొనం దుదిన్ [2023/10m/1d]

  10. కింది ప్రశ్నలలో మొదటి రెండింటికి వ్యాసరూప సమాధానములను మూడవ ప్రశ్నకు సంక్షిప్త సమాధానములను రాయండి: సుగాత్రీ శాలీనుల దాంపత్య జీవనంలోని ఒడిదుడుకులను సరిజేసుకున్న తీరును పింగళిసూరన నేర్పు మీర కవిత్వీకరించిన తీరుతో విశదపరచండి? [2023/20m/2b]

  11. కళాపూర్ణోదయమునామ సార్థక్యాన్ని చర్చించండి? [2023/10m/3c]

  12. ఈ క్రింది పద్యభాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ పద్యంలోని భావధ్వని విశేషాలను వివరించండి:
    ఆ లలితాంగి చాలఁ దడ వచ్చట నమ్మెయి నుండి సాహసో
    ద్వేలత నంతఁ జేరి కడుఁ ద్రిమ్ముటచే శ్రమ మొందినారు గాఁ
    బోలును బోదునా? నిదుర బోయెదరా ! యని కప్పురంపుఁదాం
    బూలము తావి బుగ్గురని ముంచుకొనం, జెవిదండఁబల్కినన్. [2022/10m/1d]

  13. సుగాత్రీ శాలీనుల కథ ద్వారా పింగళి సూరన ప్రతిపాదించిన శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రస్తుతించగలమా? చర్చించండి. [2022/20m/4a]

  14. ఈ క్రింది పద్యంలో ప్రస్ఫుటమయ్యే సంభాషణావైచిత్రిని వివరించండి:
    “ఇట్టినిరర్థునెందుఁగన, మేమనబోయిన నీవుమిక్కిలిన్
    దిట్టెదు, నాదుసంపదకు దిక్కగుచున్ మొగ మొల్క నీకిఁకన్
    బుట్టునో యంటిమే, నితని పోడిమిఁగంటిమ ! వట్టిగొడుతా
    కట్టితఁడెంతయున్న నినుఁగాఱియ పెట్టుట వెళ్ళఁగొట్టినన్” [2021/10m/1d]

  15. సుగాత్రీశాలీనుల కథలో పింగళి సూరన ప్రదర్శించిన ప్రబంధ వక్రతనువివరించండి. [2021/20m/3b]

  16. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ క్రింది పద్యం ద్వారా స్త్రీ హృదయంలోని భావావేశాలను కవి ఏవిధంగా ఆవిష్కరించాడు:
    అపుడు మనంబులోన ననయంబుఁ బతిం దలపోసి, యిట్టి ఘో
    రపుఁ జెనువాన నెట్లయితో ప్రాణవిభుండ యటంచు నీకు బా
    పపు బువు దోట పాట్లెచటఁ బ్రాప్తములయ్యె నటంబు, నెంతయు
    న్విపుల తరార్తిఁ జేడ్పడుచు నింగిఁ బొరింబొరిఁదొంగి చూచుచున్ [2020/10m/1d]

  17. శాలీనుని పాత్రను మనస్తత్వశాస్త్ర నేపథ్యంలో విశ్లేషించండి. [2020/10m/3c]

  18. సుగాత్రి శాలీనుల కథలో పింగళిసూరన ప్రదర్శించిన అపూర్వ కథాసంవిధానవైచిత్రిని విశదీకరించండి. [2020/20m/4b]

  19. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ క్రింది పద్యంలోని భావధ్వనివిశేషాలను సమీక్షించండి:
    ఈ దేహంబునఁ బూర్వదేహములయం దేనిన్ వ్రతధ్యానదా
    నాదిప్రోద్భవ మేమియేమి గల దాయాపుణ్యమీ వర్షపీ
    డా దోషంబును మత్పతిం బొరయకుండన్ మానుపున్ గాతః, నే
    నౌదుం గావుతఁ దన్నిమిత్తపతిపాపాక్రాంతికిన్ బాత్రమన్. [2019/10m/1d]

  20. సుగాత్రీ శాలీనుల పేర్లు కథా సంవిధానానికి ఏ విధంగా సార్థకతను చేకూర్చినదీ విశదీకరించండి. [2019/20m/2a]

  21. కళా పూర్ణోదయములో నాటకీయ కవిత్వతత్త్వవిచారం చేయండి. [2019/10m/4c]

  22. ఈ క్రింది పద్యభాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ క్రింది పద్యభాగంలోని ఉచితానుచితాలను వివేచించండి:
    పెనిమిటి దేశాంతరియై
    చనినన్; భవదీయమైన సంతతి నాము
    ష్మున కయ్యెడు ననుచును, ద
    ర్శనంబున కెదురు చూచు సతతము నాత్మన్ [2018/10m/1d]

  23. శాలీనుడి పాత్రను మనోవైజ్ఞానిక దృష్టితో విశ్లేషించండి. [2018/20m/3b]

  24. కళాపూర్ణోదయంలోని కవితా నిర్మాణ శిల్పాన్ని విశ్లేషించండి. [2018/10m/4c]

  25. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యంలో వర్షాగమన సందర్భంలో కవి పాటించిన వర్ణనౌ చిత్యాన్ని విశ్లేషించండి.
    మిగుల జగంబు బెగ్గడిల మించెఁద దుద్ధత వృష్టి యద్భుతం
    బగుచు, ఘనా ఘనౌఘ సముదగ్ర నిరర్గళ ఘర్ఘ రార్భ టీ
    ల గ న ఘనోచ్చల జ్జల ఝుళంఝుళ నిర్ఝల జర్జరీభవ
    న్నగ విగళ చ్ఛిలాగణ ఘణంఘణ ఘోషణ భీషణంబుగన్ [2017/10m/1c]

  26. కళా పూర్ణోదయంలో అపూర్వ కథా సంవిధాన వైచిత్రిని పోషించటంలో సూరన చూపిన ప్రతిభను ఆవిష్కరించండి. [2017/20m/3b]

  27. ఈ క్రింది పద్యాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యంలోని సామాజిక జీవన వాస్తవికతను వివరించండి.
    నీరెత్తు వేళల నీరెత్తుఁ బాదుపా
    దునకుఁ గాలువలు పొందుగనమర్చి
    త్రవ్వటంబుల తఱిఁ ద్రవ్వటంబులు వెట్టుఁ
    దగినట్టి కట్టు గుద్దలి గదించి
    యెఱువుఁ జల్లెడు వేళ నెరువు జల్లు, గతాభి
    మానుడై గంపలఁ దాన తెచ్చి
    యంట్లొత్తు పదమున నంట్లొత్తు, నెలమిగా
    న్వించులేఁ గొమ్మలు వంచివంచి
    నారు వోయంగ వలయుచో నారువోయు
    గొమ్మ నాటంగఁ దగునెడఁ గొమ్మ నాటు
    నొకటి విసువక, యంత కంతకును హెచ్చు
    హాళితోడను శాలీనుఁ డవిరతంబు. [2016/10m/1d]

  28. “సుగాత్రి శరీరస్పృహ గల స్త్రీ” – చర్చించండి. [2016/10m/2c]

  29. సుగాత్రీ శాలీనుల కథ శ్రమైక జీవన సౌందర్యానికి పట్టం కట్టిన తీరు వ్రాయండి. [2016/20m/4a]

  30. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యాన్ని చదివి స్త్రీ మానసిక ధోరణిని వివేచించండి
    అకటా! యేమని దూఱుదాన మిము? నాథా! వేగు జామయ్యెఁ, బొం
    దికగాఁ బాదము లొత్త రమ్మనుట గానీ! యొంటి యేమో కదా!
    నికట క్షోణికి నేఁగుదెమ్మనుట గానీ! కొంత నెయ్యంపుఁ బూ
    నికతోఁ గన్నులు విచ్చి చూచుటయ కానీ, తేదు మొక్కింతయున్. [2015/10m/1c]

  31. కళాపూర్ణోదయంలో సామాజిక దృక్పథాన్ని పరిశీలించండి. [2015/20m/3a]

  32. ఈ క్రింది పద్యభాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యాన్ని సౌందర్య కళాదృష్టితో విశ్లేషించండి:
    తోరంపుఁ జనుదోయి త్రుళ్ళింతల నిడంగ
    దగు చోట్లు గుద్దంటఁ ద్రవ్వి త్రవ్వి;
    వ్రేఁగైన పిఱుఁదు బల్విడిఁ జలింపంగను
    వడి నిట్టునట్టును నడచి నడచి;
    యడుసు తుంపురు చెక్కుటద్దంబులను బర్వ,
    మళ్ళకు మడవలు మార్చి మార్చి;
    నడుము లేఁదీవియ నకనకల్ గుడువ, నిం
    పునఁ దగు మోవులు మోసి మోసి;
    చిఱు చెమటఁ జేర్చు వింత క్రొమ్మెఱుఁగు తోడఁ
    గొమరు మేనొప్ప, సారెకుఁ గొప్పు కదల,
    నేమిటికి నైన దామున్న యేగి యేగి
    యెల్లపనులు నొనర్చె నింపెసక మెసగ [2014/10m/1d]

  33. సుగాత్రి గుణశీలములను విశ్లేషించండి. [2014/20m/3b]

  34. కళాపూర్ణోదయ నామ సార్థక్యాన్ని వివరించండి. [2014/10m/3c]

  35. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి:– క్రింది పద్యంలో కవి వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి:–
    దివిజ నుతయైన శారదా దేవి పూజ
    కుపకరించు కార్యం బిది యొప్పు ననుచు;
    నధిక మోదంబుతో నతఁడా దరించి
    సంతతంబు తదేక నిష్ఠత దలిర్ప
    సమధిక మధు మద గరిమా
    సమ చంచల చంచరీక సంచయ సంచా
    ర మనోరమ సుమనో రమ
    నమరఁగ నా పూవు దోఁట ననిశముఁ బెంచెన్. [2013/10m/1d]

  36. శృంగార, పుణ్య వస్తు వర్ణనా కర్ణనీయం కళాపూర్ణోదయం – పరిశీలించండి. [2013/25m/3b]

  37. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి:- క్రింది పద్యంలోని నిర్మాణ విశేషాల్ని తెలియజేస్తూ సారాంశాన్ని అందజేయండి:-
    ముంగల జగంబు బెగ్గడిల ముంచెఁ దమువృత వృష్టి యుద్భటం [?]
    బగుచు ఘనాఘనౌఘ సముదగ్ర నిరర్గళ ఘర్ఘరార్భటీ
    లగన ఘనోచ్ఛలజ్ఝల ఝళంఝళ ఝళ నిర్ఝర జర్ఝరీభవ
    న్నగవిశళచ్ఛిలాగణ ఘణం ఘణ ఘోషణ భీషణంబుగన్ [2012/12m/1c]

  38. “సుగాత్రీ శాలీనుల శృంగారము అపూర్వ కథా సంవిధాన వైచిత్రీ మహనీయమైన శృంగారరస భృంగారము”- వివరించండి. [2012/30m/3b]

  39. ఈ క్రింది పద్యభాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: కింది పద్యభాగాన్ని మనస్తత్త్వ దృష్టితో వ్యాఖ్యానించండి:
    మఱచి తప్పియునన్యమహిమ విమర్శింపఁ
    జూడవు, వినవన్యసొబగు, వేడ్కఁ
    బతిభక్తియెందుఁగేడ్పడనీవు, వేఁడుదు
    తత్పుష్టియేదైవతంబుఁగనిన
    నధిపుడు హర్షింప హర్షింతు, జింతింపఁ
    జింతింతు, చిక్కినఁ జిక్కు దెపుడు,
    గడఁజనవిచ్చిన గర్వింప నీకయుం
    డిన, ఖేదమొందవు డెందమునను,
    నిండుకడవరీతి నుండుదెపుడు నుంగ
    భీరతకుఁగలంక చేరనీక
    పతిప్రవాస వేళఁబాటించుకొనవునె
    మ్మేన గరగరికలు మెఱుఁగుబోడి. [2011/20m/1b]

  40. సుగాత్రీశాలీనుల కథలోని తాత్త్వికతను విశదీకరించండి. [2011/30m/4a]

  41. ఈ క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి: సామాజిక (Sociological) దృక్పథంతో విమర్శించండి:
    నీ రెత్తువేళ నీరెత్తుఁబాదుపా
    దునకుఁగాలువలుపొందగ, నమర్చి,
    త్రవ్వటంబుల తఱిఁద్రవ్వటంబులువెట్టుఁ
    దగినట్టికఱ్ఱుగుద్దలిగడించి,
    యెరువుఁజల్లెడువేళనెరవుఁజల్లు, గతాభి
    మానుడైగంపలఁదాన తెచ్చి,
    యంట్లొత్తుఫదనున నంట్లొత్తు, నెలమిఁగా
    న్పించు లేఁగొమ్మలు వంచివంచి,
    నారువోయంగవలయుచో నారు వోయుఁ,
    గొమ్మనాటంగఁ దగునెడఁగొమ్మనాటు,
    నొకటివిసువక, యంత కంతను హెచ్చు
    హాళితోడను శాలీనుడవిరతంబు [2010/20m/1c]

  42. సుగాత్రీ శాలీనుల మనస్తత్వాన్ని పింగళి సూరన ఎట్లా చిత్రించాడో నిరూపించండి. [2009/60m/3]

1.5] మొల్ల

36 questions

  1. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పద్యంలోని అలంకార వైశిష్ట్యాన్ని వివరించండి:
    ఇన వంశోద్భవుడైన రాఘవుడు, భూమీశాత్మజల్ వేడ్కతోఁ
    దను వీక్షింప, మునీశ్వరుండలరఁ, గోదండంబు చేనంది, చి
    వ్వను మోపెట్టి, గుణంబు పట్టి, పటు బాహాశక్తితోఁ దీసినన్,
    దునిఁగెన్ జాపము భూరి ఘోషమున, వార్ధుల్ మ్రోయుచందంబునన్. [2026/10m/1e]

  2. కింది ప్రశ్నల్లో మొదటి రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: ‘అవతారిక’ ఆధారంగా తెలుగు కవిత్వం గురించి మొల్ల వెలువరించిన అభిప్రాయాలను తెల్పండి. [2026/10m/3c]

  3. ఈ క్రింది పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించని వ్యాఖ్యాన రాయండి: ఈ పద్యంలోని అలంకారవైచిత్రిని విశ్లేషించండి:
    కనకవిలాసకుంభములు గబ్బికుచంబులలీలఁ జిత్రకే
    తనములు పైఁటకొంగులవిధంబునఁగ్రాల గవాక్షముల్ రహిన్
    గనుగవయట్లపొల్పెసగఁగా భువి భోగులు మెచ్చ భోగినీ
    జనములరీతిఁజెల్వమరు సౌధనికాయము పాయకప్పురిన్. [2025/10m/1e]

  4. మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: మొల్ల తన రచనా విధానాన్ని అవతారితా పద్యాలలో వివరించిన అంశాలను విశదపరచండి. [2025/10m/2c]

  5. మొదటి రెండింటికి వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోనూ సమాధానాలు రాయండి: “కందువమాటలు, సామెతలందముగాఁగూర్చిచెప్పనది తెనుంగునకున్ బొందై రుచియై వీనులవిందై” ఉంటుందన్న మొల్ల అభిప్రాయం తన కవితాముఖంగా సమన్వయించండి. [2025/20m/3b]

  6. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ కింది పద్యంలోని వర్ణనాలంకార శిల్పాన్ని, శబ్ద ప్రయోగ వైశిష్ట్యాన్ని విపులీకరించండి:
    మేలిమి మంచు కొండ నుపమింపగ జాలిన యంచ నెక్కి, వా
    హ్యాళి నటించి వచ్చు చతురాస్యు నెదుర్కొని నవ్వు దేరగా
    వాలిక సోగ కన్నుల నివాళియొనర్చి, ముదంబు గూర్చు వి
    ద్యాలయ, వాణి శబ్దములనర్థములన్ సతతంబు మాకిడున్. [2024/10m/1b]

  7. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ముల్లరామాయనం బాలకాండలోని ‘పద్యరచనా రామణీయకత’ను విపులీకరించిన రీతిని విశ్లేషించండి? [2024/20m/3b]

  8. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పద్యంలోని అలంకార విశేషాలను వివరించండి:
    కలిముఖుడుం గుమారుడు వికారపుజేతల ముద్దు సూపుచు
    న్గురువుల వాఱుచున్సరిగ గుట్టలుదాటుచు, జన్ముదోయితో
    శిరములు రాయుచుం గబరిచేర్చిన చంద్రుని బట్టి తీయగా
    గరములచాప నవ్వెడు జగమ్ముల తల్లి శుభంబు లేవుతన్ [2023/10m/1c]

  9. మొల్ల రామాయణం అవతారికా పద్యాలలోని వస్తువైశిష్ట్యాన్ని వివరించండి. [2023/20m/4a]

  10. ఈ క్రింది పద్యభాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ పద్యంలోని వర్ణణా వైచిత్రిని సమన్వయం చేయండి:
    అంబరవీధి నిల్చి త్రిదశాంతకు లెంతయు వేచి రక్తమాం
    సంబులు గాధినందనుని జన్నముపైఁ గురియంగ నంతలో
    నంబర రత్న వంశకల శాంబుధి చంద్రుఁడు రామచంద్రుఁడు
    గ్రంబుగఁ ద్రుంచెఁ జండబలగర్వులఁదమ్ముడు దానునొక్కటై. [2022/10m/1c]

  11. రామాయణ మహాకావ్యాలలోను, మొల్ల రామాయణంలోను కనిపించే వైవిధ్యాన్ని ప్రత్యేకతలను సమీక్షించండి. [2022/20m/3b]

  12. వర్ణవిన్యాసవక్రతదృష్ట్యా ఈ పద్యాన్ని విశ్లేషించండి:
    “రాజులుకాంతియందు, రతిరాజులు రూపమునందు, వాహినీ
    రాజులు దానమందు, మృగరాజులు విక్రమ కేళియండుగో
    రాజులుభోగమందు, దినరాజులు సంతత తేజమందురా
    రాజులు మానమందు నగురమ్మున రాజకుమారు లందఱున్” [2021/10m/1e]

  13. మొల్లరామాయణం బాలకాండలో కనిపించేప్రబంధ లక్షణాలను వివరించండి. [2021/20m/4a]

  14. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ కింది పద్యాన్ని పౌరాణిక దృష్టితో వ్యాఖ్యానించండి:
    కదలకుమీ ధరాతలమ, కాశ్యపిఁబట్టు, ఫణీంద్ర భూవిషా
    సృదులను బట్టు, కూర్మమ రసాతల భోగి ఢులే కులే శులన్
    వదలక పట్టు, ఘృష్టి ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్
    బొదువుచుఁ బట్టుడీ కరులు, భూవరుఁడీశుని చాప మెక్కిడున్ [2020/10m/1e]

  15. మొల్ల రామాయణం అవతారిక ద్వారా కవయిత్రి హృదయాన్ని ఆవిస్కరించండి. [2020/10m/2c]

  16. తెలుగు రామాయణాలలో మొల్ల రామాయణ వైశిష్ట్యాన్ని తెలపండి. [2020/20m/4a]

  17. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ పద్యంలోని అలంకారవైభవాన్ని వర్ణ్యాంశానికి ఉద్దీపకంగా నిరూపించండి:
    కవిగురుబుధమిత్రాదులు
    వివిధార్చనల నమరపురి వెలయుదు రెలమిన్
    గవి గురు బుధమిత్రాదులు
    వివిధార్చనల నమరఁ బురి వెలయుదు రెలమిన్. [2019/10m/1e]

  18. రామాయణ రచనలో ప్రస్ఫుటించిన మొల్ల కవిత్వాదర్శాలను, మహిళా దృష్టికోణాన్ని సమీక్షించండి. [2019/20m/4a]

  19. ఈ క్రింది పద్యభాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ క్రింది పద్యాన్ని పౌరాణిక దృష్టితో వివరించండి:
    అంబర వీధి నిల్చి త్రిదశాంతకు లింతయునేచి, రక్తమాం
    సంబులు గాధి నందనుని జన్నము పైఁ గురియంగ, నంతలో
    నంబర రత్న వంశ కలశాంబుధి చంద్రముడు, రామచంద్రుడు
    గ్రంబుగఁ ద్రుంచెఁ జండ బలగర్వులఁ దమ్ముడు దాను నొక్కటై [2018/10m/1e]

  20. మొల్ల రామాయణంలోని పాత్రల చిత్రణంలో వ్యక్తమైన మనిషితత్వాన్ని[?] వివరించండి. [2018/10m/2c]

  21. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యంలోని తెలుగు భాషా శైలిన వివరించండి.
    రాముఁడు గిముఁడంచును ధరాజనురెల్ల నుతింపదిట్టవై
    భీముని చాపమున్ విఱిచి వ్రేలెద వందుల కేమిగాని యీ
    శ్రీమహిశేశు కార్ముకముఁ జేకొని యెక్కిడుదేని నేఁడు నీ
    తో మఱి పోరు సల్పి పడఁ ద్రోతు రణస్థలి నీ శరీరమున్. [2017/10m/1d]

  22. మొల్లరామాయణంలో పురుష పాత్రల విశ్లేషణలో గల ప్రత్యేకతను వ్యక్తంచేయండి. [2017/10m/3c]

  23. మొల్ల రామాయణంలోని బాలకాండ విశిష్టతను చర్చించండి. [2017/10m/4c]

  24. మొల్ల రామాయణ అవతారిక పురుష కవుల కావ్యావతారికల కంటే ఎలా భిన్నమైందో నిరూపించండి. [2016/20m/3b]

  25. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యాన్ని ఔచిత్య దృష్టితో విశ్లేషించండి.
    కదలకుమీ ధరాతలను కాశ్యపిఁ ఒట్టు ఫణీంద్ర భూవిషా
    స్పదులను ఒట్టు కూర్మను రసాతల భోగిఢులీకులీశులన్
    వదలక పట్టు ఘృష్టి ధరణీఫణి కచ్చపపోత్రి వర్గమున్
    బొదువుచుఁ ఒట్టుఁడీ కరులు భూవరుఁడీశుని చాపమెక్కిడున్. [2015/10m/1d]

  26. మొల్ల రామాయణంలో రాముని వర్ణించిన తీరు ఎటువంటిది? [2015/20m/3b]

  27. మొల్ల పాటించిన నవీన కల్పనలను విపులీకరించండి. [2015/20m/4b]

  28. ఈ క్రింది పద్యభాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యాన్ని కవితా నిర్మాణ దృష్టితో విశ్లేషించండి:
    ధవళాక్షులను మాట తథ్యంబు గావింపఁ
    డెలుపెక్కి కన్నులు తేటలయ్యె
    నీలకుంతలలని నెగడిన యా మాట
    నిలుపంగ నెఱులపై నలుపు నూపె
    గురు కుచలను మాట సరవి భాషింపంగఁ
    దోరమై కుచముల నీరుపట్టె
    మంజు భాషిణులను మాట దప్పక యుండ
    మెలఁతల పలుకులు మృదువులయ్యెఁ
    గామిను లటంట నిక్కమై కాంతలందు
    మీఱి మేలైన రుచులపైఁ గోరికయ్యెఁ
    సవతి పోరునఁ దమలోన సారె సారెఁ
    కోకి లింతలు బెట్టు చిట్టుములు బుట్టె [2014/10m/1e]

  29. మొల్ల రామాయణం బాలకాండలో కనబడుతున్న మహిళా దృక్పథాన్ని సమీక్షించండి. [2014/20m/4b]

  30. రామాయణ రచనలో మొల్ల చేపట్టిన నూతన కల్పనలను అనుశీలించండి. [2013/25m/4b]

  31. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి:- “ప్రకటానురాగ సంపన్నులేదురు గాని
    రమణీయరుక్మ కారకులు గారు
    శుభపవిత్రోజ్జ్వల సూత్రధారులు గాని
    టక్కరి హాస నాటకులు గారు
    ఉభయ సంధ్యాది విధ్యుక్త కర్మలు గాని
    చర్చింపఁగా నిశాచరులు గారు
    తిలకించి చూడ సద్విజులేదురే కాని
    తలఁపఁగఁ బక్షిజాతములు కారు
    బాడబులుగాని యుగ్నరూపములుగారు
    పండితులుగాని విజ్ఞులవగిదిఁగారు
    ధీవరులుగాని జాతినిందితులుగారు
    పరమపావనులాపురి ధరణీ సురులు” [2012/12m/1e]

  32. మొల్ల రామాయణ రచన నేపథ్యాన్ని, ఆ కవయిత్రి ప్రకటించిన కావ్యరచనా సాధన సామగ్రి సముల్లాస సంపదను సుస్పష్టం చేయండి. [2012/30m/4a]

  33. ఈ క్రింది పద్యభాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: కింది పద్యంలోని నిర్మాణ విశేషాల్ని తెలియజేస్తూ సారాంశాన్ని అందజేయండి:
    కనఁగోరఁడొకనాఁడుఁగన్నులఁబరవధూ
    లావణ్యసౌభాగ్య లక్షణములు
    వినఁగోరఁడొకనాఁడు వీనులకింపుగాఁ
    గొలుచువారల మీఁది కొండెములను
    చిత్తంబువెడలించి జిహ్వాగ్రమునఁగోది
    పలుకఁడు కాఠిన్య భాషణములు
    తలపఁడించుకయైన ధనకాంక్షనేనాఁడు
    బంధుమిత్రాశ్రిత ప్రతతిఁజెఱుప
    సతత గాంభీర్యధైర్య భూషణపరుండు
    వార్తకెక్కిన రాజన్యవర్తనుండు
    సకలభూపాల జన సభా సన్నుతుండు
    ధర్మతాత్పర్యనిరతుండు దశరథుండు [2011/20m/1c]

  34. మొల్ల కావ్య రచనలోని ప్రత్యేకతలను వివరించండి. [2011/30m/4b]

  35. క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి:- నిర్మాణశిల్ప (Structural) దృక్పథంతో విమర్శించండి:-
    తన కీర్తి కర్పూర తతి చేత వాసించెఁ
    బటుతర బ్రహ్మాండ భాండ మెల్లఁ
    దన శౌర్య దీప్తిచే నినబింబ మనయంబుఁ
    బగలెల్ల మాఁగుడు వడఁగఁ జేసెఁ
    దన దాన విఖ్యాతి ననుదినంబును నర్థి
    దారిద్ర్యములు వెళ్ళఁబారఁ దరిమెఁ
    దన నీతి మహిమచే జనలోక మంతయుఁ
    దగిలి సంతతమును బొగడఁ దనరెఁ
    భళిర! కొనియాడఁ బాత్రమై పరఁగినట్టి
    వైరి నృపజాల మేఘ సమీరణుండు
    దినకరాన్వయ పాథోధి వనజవైరి
    నిశిత కౌక్షేయక కరుండు దశరథుండు. [2009/20m/1d]

  36. మొల్ల దృష్టిలో కావ్యం ఎట్లా ఉండాలో తెలిపి ఆమె రచనలో ఆమె చెప్పిన కావ్య లక్షణాలు ఎట్లా దర్శనిమిస్తాయో వివరించండి. [2009/60m/4]

1.6] కాసుల పురుషోత్తమ కవి

30 questions

  1. కింది ప్రశ్నల్లో రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: శతక లక్షణాలను ‘ఆంధ్ర నాయక శతకం’తో అన్వయించండి. [2026/10m/2c]

  2. కింది ప్రశ్నల్లో మొదటి రెండింటికి వ్యాసరూపంలోను, మూడవ ప్రశ్నకు సంక్షిప్తంగాను సమాధానాలు రాయండి: “ఆంధ్ర నాయక శతకం” లోని పౌరాణికాంశాలను వివరించండి. [2026/20m/4a]

  3. మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త గాను సమాధానాలు రాయండి: ఆంధ్ర నాయక శతకంలోని వస్తువైవిధ్యాన్ని చారిత్రక సాంఘిక కోణంతో విశదపరచండి? [2025/20m/4a]

  4. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ కింది పద్యంలో పౌరాణికాంశాలను క్రోడీకరించండి:
    వరమిచ్చినట్టి శంకరుని నెగ్గు దలంచు భస్మాసురుని పేరు బాపినావు
    తనయిల్లు గాచు నుగ్రుని బోరుటకు బిల్చు బాణుచేతులు తెగ బరికినావు
    తొలిమిన్కులజుని మ్రుచ్చిలిగొన్న సోమకు జంపి విద్యలు ధాతకంపినావు
    బలిమిదైత్యులు సుధాకలశమున్గొన వారి వంచించి సురలకు బంచినావు
    నిఖిల దైవత కార్యముల్ నిర్వహించు
    నీకు నిజ కార్యము భరంచె నిర్వహింప
    చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ
    హతవిమత జీవ, శ్రీకాకుళాంధ్ర దేవ ! [2024/10m/1e]

  5. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఆంధ్రనాయక శతకంలో చిత్రీకరించిన ఆనాటి చారిత్రక సాంస్కృతిక వైభవాలను విశదపరచండి? [2024/10m/3c]

  6. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: వ్యాజస్తుతి శతకమనేపేరు ఆంధ్ర నాయక శతకానికి ఎలా అన్వయించవచ్చో వివరించండి. [2024/10m/4c]

  7. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: కింది పద్యంలోని భక్తి నవవిధ భక్తులలో ఏ కోవకు చెందుతుంది విశ్లేషించండి:
    నీచువాసనతో మత్సావతారాన తిరిగినా, కొండను వీపున భరించు
    కూర్మమునైనా వరాహమై
    తుంగ కాయలను తినుచున్నా, వామనుడవై బలిని దేహి యన్నా
    పరశురాముడవై నీవిల్లు
    రామునకిచ్చినా, రాముడవై అరణ్యముల తిరిగినా, బల రాముడవై
    సురాపాన చిత్తుడవైనా, బుద్ధు
    డిగా జడత్వముపొందినా, కల్కిగా అశ్వము నదిరోహించినా నేనునిన్ను
    విడువను, నీవు నన్ను కాచియే తీర వలెను [2023/10m/1e]

  8. కింది ప్రశ్నలలో మొదటి రెండింటికి వ్యాసరూప సమాధానములను మూడవ ప్రశ్నకు సంక్షిప్త సమాధానములను రాయండి: ‘ఆంధ్ర నాయక శతకం’ ఆధారంగా శ్రీ కాకుళాంధ్ర చరిత్రను వెలికి తీయండి? [2023/10m/2c]

  9. ఈ క్రింది పద్యభాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ క్రింది పద్యంలోని అలంకార వైభవాన్ని ప్రశంసాత్మకకంగా వివరించండి:
    ఇంద్ర నీలచ్ఛాయ లీను నిమ్మేనిపైఁ
    గన కాంబర ప్రభ గ్రందు కొనఁగఁ
    బర్వసుధాంశు శోభాన ముజ్జ్వల వక్త్ర
    మున నూర్ధ్వ పుండ్రము ముద్దు గుల్క
    నెగు భుజంబుల ధగద్ధగితాంగద ద్యుతుల్
    మూర్ధరత్న కరీటమునఁ జరింప
    వర్ణితోర స్థలి వైజయంతిక, కౌస్తు
    భాంతర శ్రదేవియంద మమర
    రమ్ము దర్మన మిమ్ము ఘోరముల జిమ్ము
    మభయ మిమ్ము భపతత్త్వమానతిమ్ము
    చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
    హత విమత జీవ, శ్రికాకుళాంధ్ర దేవ ! [2022/10m/1e]

  10. ఆంధ్ర నాయక శతకంలో కాసుల పురుషోత్తమ కవి ప్రదర్శించిన సామాజికాంశాలను పరిశీలించండి. [2022/10m/2c]

  11. ఆంధ్ర నాయకశతకంలో వ్యాజస్తుతి అలంకార వైభవాన్ని విశదీకరించండి. [2021/10m/2c]

  12. కాసుల పురుషోత్తమ కవికి శతకసాహిత్య రచనా సంవిధానాన్ని, పరిచయం చేయండి. [2021/10m/3c]

  13. ఆంధ్రనాయక శతకంలో కవి చూపినవ్యంగ్యవైచిత్రిని వివరించండి. [2020/20m/3a]

  14. వ్యాజస్తుతి ఆంధ్ర నాయక శతకంలో పరాకాష్ఠస్థితిని పొందటాన్ని నిరూపించండి. [2019/10m/2c]

  15. ఆంధ్రనాయక శతకంలోని శ్లేష చమత్కారాలను వివేచించండి. [2018/10m/3c]

  16. శ్రీకాకుళాంధ్రదేవుని వర్ణనముల ఔచిత్యాన్ని విశ్లేషించండి. [2018/20m/4b]

  17. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యంలోని నిందాస్తు తిమూలంగా కవి లక్ష్యాన్ని వ్యక్తంచేయండి.
    కోరిక లీను వైకుంఠంబులోని లో
    నగరిలో నామూల నవ్యదివ్య
    సౌధంబు దాపలి సరసమందారవ
    నాంతరామృత సరః ప్రాంత చంద్ర
    కాంతో పలోత్పల కల్పిత పర్యంక
    సకల సౌభాగ్య లక్షణ నివాస
    లక్ష్మీమనోజ్ఞ విలాస వశీకృత
    సంభోగ సామ్రాజ్య సంతతాభి
    రామమూర్తికి వాంఛేతర ప్రపంచ
    మేమిగావలె లీలార్థ మింతెకాని, చిత్ర చిత్రప్రభావ, దాక్షిణ్య భావ,… [2017/10m/1e]

  18. ‘ఆంధ్ర నాయక శతకము’ లోని భక్తి తత్వాన్ని వ్యక్తీకరించండి. [2017/20m/2b]

  19. ఈ క్రింది పద్యాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యంలోని అలంకారాన్ని పేర్కొని ఉక్తి వైచిత్రిని వివరించండి.
    అయవారు చదివించినట్లుగాఁ జదువక
    మఱి కొట్టి తిట్టక వెఱపుఁ గొనక
    తనయుఁడెంతో పరధ్యానంబుగా నున్నఁ
    దండ్రి వల్దని చెప్పఁ దగఁడె ధాత్రి
    నీకుఁగోపంచేమి నృ రహరి రూపంబున
    స్తంభంబులోఁ బుట్టి చటులనేత్ర
    దంష్ట్రానఖప్రభ దహన కీలలఁ బోలి
    భగ్గురనంగఁ బైఁ బడి హిరణ్య
    కశిపుఁదునుమాడి ప్రహ్లాదుఁ గరుణినేలి
    తందరి కసహ్యమయ్యె నిన్నపుడె కనఁగ,
    చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ
    హత విమతజీవ, శ్రీకాకుళాంధ్ర దేవ! [2016/10m/1e]

  20. ఆంధ్రనాయక శతకంలోని వక్రోక్తి మాధుర్యాన్ని వివరించండి. [2016/10m/4c]

  21. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యం ఆధారంగా నిర్గుణ తత్త్వాన్ని తెలియజేయండి.
    పురుషాకృతిగ నిన్ను గుఱుతు బట్టగరాదు
    స్త్రీ మూర్తి వనుచును జెప్పరాదు
    పరగనపుంసక భావమెన్నగరాదు
    రూపంబు గల్గ టెఱుంగరాదు
    గుణవంతుడ వటంచు గణుతింపగా రాదు
    మర్యాద దెలియ నేమతికి రాదు
    కులజుడ వనుచు నిక్కువముగ జెప్పగ రాదు
    స్థలమెక్కడనొ కాని తెలియరాదు
    వస్తు నిర్దేశ మొనరింప వశముగాని
    నిన్ను వర్ణింపరాదయా నిశ్చయముగ
    చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
    హత విమతజీవ, శ్రీకాకుళాంధ్ర దేవ! [2015/10m/1e]

  22. ఆంధ్ర నాయక శతకంలో నిందాస్తుతి లక్షణాన్ని ఉదాహరించండి. [2015/10m/2c]

  23. ఈ క్రింది పద్యభాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: క్రింది పద్యంలోని ధ్వనిని, చమత్కారాన్ని వివరించండి:
    ధర్మ విఘాత మిద్దర నీ వొనర్చిన
    మూడు లోకంబులు మ్రోసెనపుడె
    జనకుని కూఁతు నిచ్చను బెండ్లియాడంగ
    నరనాథ కోటులు నవ్విరపుడె
    పుణ్య జనంబులఁ బోర బాధింపంగ
    సురలద్భుతము నొంది చూచిరపుడె
    సంతతాశ్రిత విభీషణు రాజుఁ జేయంగ
    నల రవీందులు సాక్షి నిలిచిరపుడె
    మంచి నడవడి నడచినా వెంచి చూడఁ
    గీర్తిగల మూర్తివే యిట్టివార్తలరయ
    చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్య భావ,
    హత విమత జీవ, శ్రీకాకుళాంధ్రదేవ! [2014/10m/1c]

  24. శతక వాజ్మయంలో ఆంధ్ర నాయక శతకానికున్న స్థానాన్ని వివరించండి. [2014/20m/4a]

  25. పురుషోత్తమ కవి కవితా పాటవాన్ని విశ్లేషించండి. [2014/10m/4c]

  26. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి:– క్రింది పద్యంలో అలంకార వైచిత్రిని ప్రస్తావించండి:–
    ఆడించెదవు బొమ్మలాటవాఁడును బోలె
    సర్వచరాచర జంతువులను
    కనుకట్టు గట్టెదు గారడీఁడును బోలె
    మిథ్యా ప్రపంచంబు తథ్యముగను
    వేర్వేఱఁ దోఁతువు వేషదారియుఁ బోలె
    బహు విధ దేవతా భద్ర కళలఁ
    దెలివి మాన్పుదువు జక్కులవాని చందానఁ
    బ్రజల సంపద్రంగవల్లిఁ జేర్చి
    యిట్టివే కద నీ విద్య లెన్ని యైన
    నింక నేయుట ఘనుఁడవో యెఱుఁగరాదు
    చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
    హతవిమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ! [2013/10m/1e]

  27. ఆంధ్ర నాయక శతకంలో కవి పాటించిన వస్తుధ్వనిని గురించి వివరించండి. [2013/25m/4a]

  28. “భక్తి శతకములలోనే అంతర్భూతమగుచు భగవన్నుతి యందు ఒక క్రొత్త మార్గమును అవలంబించిన శతకము ఆంధ్ర నాయక శతకము” – వివరించండి. [2012/30m/4b]

  29. ఆంధ్ర నాయక శతకంలో కవి వ్యాజస్తుతిని నిర్వహించిన తీరుని ప్రస్తావించండి. [2011/30m/3b]

  30. ఈ క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి: సైద్ధాంతిక (Ideological) దృక్పథంతో విమర్శించండి:
    వంచనగాదె దివ్యక్షేత్రపతులలో
    మంత్రార్థకృత్యముల్మానియున్న?
    నపకీర్తిగాదె లోకా లోకములయందు
    వత్సరోత్సవములు వదలియున్న?
    నగుబాటుగాదె యన్యమతస్థజనులలో
    నిజదాసకోటిమన్నింపకున్నఁ?
    బరిపాటిగాదెయల్పజ్ఞానమతులలో
    దేవతామహిమంబుఁదెలుపకున్న?
    నేఁటిదా నీప్రతిష్ఠవర్ధించిచూడఁ
    బాడిదప్పినబలు నిందపాలుగావె?
    చిత్రచిత్రప్రభావ, దాక్షిణ్యభావ,
    హతవిమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ ! [2010/20m/1d]

Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

« Previous: విభాగం బి: ఆధునిక, జానపద సాహిత్యం · Next: విభాగం బి: ఆధునిక సాహిత్యం »

Back to: Telugu Literature Optional PYQs – Topic-wise

Last updated: 2 November 2026